కోటి రూపాయల Mercedes Benz కారును కొనుగోలు చేసిన బాలీవుడ్‌ నటి..!

బాలీవుడ్‌ ప్రముఖ నటి, నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ సోదరి సోహా అలీ ఖాన్ లగ్జరీ బెంజ్‌ కారును కొనుగోలు చేశారు. రంగ్‌ దే బసంతి, తుమ్‌ మైల్‌ వంటి చిత్రాలతో ఈ ప్రసిద్ధి చెందారు. ఈ నటి తన 45వ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త Mercedes Benz GLE Class SUVను కొనుగోలు చేశారు. తెలుపు రంగు లగ్జరీ కారును ఎంచుకున్నారు.

మెర్సిడెస్‌ బెంజ్‌ GLE క్లాస్‌ లగ్జరీ ఎస్‌యూవీ మూడు వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. GLE 300d, GLE 400d, GLE 450 వెర్షన్‌లో లభిస్తుంది. అయితే ఈ మూడు వెర్షన్‌లలో సోహా అలీ ఖాన్‌ ఏ మోడల్‌ను కొనుగోలు చేశారన్నది తెలియలేదు. ముంబయిలోని తమ నివాసంలో తన కొత్త కారును డెలివరీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను డీలర్‌ తన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

actress soha ali khan buys luxury Mercedes Benz

మెర్సిడెస్‌ బెంజ్‌ GLE క్లాస్‌ కారు బాలీవుడ్‌లో చాలా మంది నటీనటులకు ఇష్టమైన వాహనంగా మారింది. సోహా అలీఖాన్‌ కొనుగోలు చేసిన బెంజ్‌ GLE క్లాస్‌ SUV ధర రూ.91 లక్షల నుంచి రూ.1.08 కోట్లుగా ఉంటుంది. ఈ కారు భారత్‌లో కొన్ని వారాల క్రితమే విడుదల అయింది. బాలీవుడ్‌లో సోహా అలీఖాన్‌ ఈ సరికొత్త వెర్షన్‌కు తొలి యాజమానిగా తెలుస్తోంది.

మెర్సిడెస్‌ బెంజ్ GLE క్లాస్‌ SUV భారత్‌ మార్కెట్‌లో 5 సీటర్‌ వెర్షన్‌తో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్‌ GLE 300d కారు 2.0 లీటర్‌ 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 241 bhp గరిష్ఠ శక్తి మరియు 500Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

actress soha ali khan buys luxury Mercedes Benz

GLE 400d వాహనం 3.0 లీటర్‌ ఇన్‌లైన్‌ 6 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 326 bhp శక్తి, 700Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. GLE క్లాస్‌కు చెందిన GLE 450 ఏకైక పెట్రోల్‌ వెర్షన్‌గా ఉంది. 3.0 లీటర్‌ ఇన్‌లైన్‌ 6 సిలిండర్‌ టర్బోఛార్జడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 362 bhp శక్తి, 500Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న GLE క్లాస్‌ మూడు వేరియంట్లు స్టాండర్డ్‌గా లాంగ్‌ వీల్‌ బేస్‌, 4 MATIC ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ మరియు 9 స్పీడ్‌ ఆటోమేటిక్ ట్రాన్సి్మిషన్‌ను కలిగి ఉంటాయి. మెర్సిడెస్‌ బెంజ్‌ GLE క్లాస్‌ అనేక లగ్జరీ కార్లతో పోటీ పడుతోంది.

actress soha ali khan buys luxury Mercedes Benz

BMW X5, ఆడీ Q7, ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ వెలార్‌ మరియు వోల్వో XC90 వంటి హైఎండ్‌ మోడళ్లతో పోటీపడుతోంది. ఈ కారు కేవలం గరిష్ఠంగా 250 kmph వేగంతో ప్రయాణం చేయగలదని సంస్థ తెలిపింది. భద్రతపరంగా అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, October 6, 2023, 11:05 [IST]
English summary
Bollywood actress soha ali khan buys luxury mercedes benz gle class
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+