బాలీవుడ్ బ్యూటీ 'గుల్ పనాగ్' కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా.. ఇక్కడ చూడండి
ప్రముఖ సినీ నటి 'గుల్ పనాగ్' గురించి దాదాపు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఈమె కేవలం సినీ నటి మాత్రమే కాదు మాజీ మిస్ ఇండియా, వ్యాపారవేత్త కూడా. అయితే ఈమె ఇటీవల ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుసుకుందాం.
సాధారణంగా సెలబ్రెటీలకు ఎక్కువగా లగ్జరీ కార్లు లేదా లగ్జరీ బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే గుల్ పనాగ్ మాత్రం ఇటీవల మహీంద్రా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో గుల్ పనాగ్ స్వయంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నడపడం చూడవచ్చు.

నిజానికి గుల్ పనాగ్‌కు రోడ్ ట్రిప్పింగ్ అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే అప్పుడప్పుడు రోడ్ ట్రిప్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఈమె కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ రిక్షా మహీంద్రా కంపెనీ యొక్క జోర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ త్రీవీలర్. ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ధర రూ. 3.60 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇది 10.24 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి, 12kw మోటరుకి జతచేయబడి ఉంటుంది. ఇది 50 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ రిక్షా సాధారణ రోడ్ల మీద మాత్రమే కాకుండా ఏటవాలుగా ఉన్న రోడ్ల మీద కూడా సజావుగా ముందుకు సాగుతుంది. ఇది కేవలం 4 గంటల సమయంలో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు. దీని గరిష్ట వేగం గంటాకు 50 కిమీ వరకు ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 153 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది, అయితే వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో తప్పకుండా 100 కిమీ పరిధి అందిస్తుంది.
We’ll, IMO, best kind of Brand Ambassadors are the paying kind.😀
— Gul Panag (@GulPanag) December 27, 2022
You’d be surprised with the uses, it has for me, and are those like me, who run establishments that focus on clean energy. pic.twitter.com/UV3KotPT15
గుల్ పనాగ్ కొనుగోలు చేసిన ఈ ఎలక్ట్రిక్ రిక్షా ఇతర ఎలక్ట్రిక్ రిక్షాల మాదిరిగానే సాధారణ గేర్‌బాక్స్ కోల్పోతుంది. అయితే ఈ రిక్షా యొక్క హ్యాండిల్ బార్ కుడి వైపున ఫార్వర్డ్, న్యూట్రల్ మరియు రివర్స్ మోడ్ వంటివి ఉంటాయి. మహీంద్రా జోర్ గ్రాండ్ వాన్ బాడీ మరియు పిక్-అప్ స్టైల్ బాడీలో అందుబాటులో ఉంది. అయితే గుల్ పనాగ్ పిక్-అప్-స్టైల్ వెర్షన్‌ను కొనుగోలు చేసింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.
ప్రస్తుతం డీజిల్ మరియు CNG త్రీ-వీలర్‌లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్వహణ ఖర్చు కూడా డీజిల్ మరియు CNG కంటే తక్కువగా ఉండటమే. గుల్ పనాగ్ ఎలక్ట్రిక్ రిక్షా కొనుగోలు చేసిన ఫోటో మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈఓ సుమన్ మిశ్రా ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ.. మా లాస్ట్ మైల్ కుటుంబానికి స్వాగతం @గుల్పనాగ్.. మీరు మా కస్టమర్‌గా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నామని రాశారు.
అయితే గుల్ పనాగ్ కూడా ఒక వీడియో షేర్ చేసింది, ఇందులో ఆమె ఆ ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవ్ చేస్తూ ఉండటం గమనించవచ్చు. నిజానికి గుల్ పనాగ్ కి బైకులు మరియు కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈమె వద్ద చాలా వాహనాలు ఉన్నాయి. ఇందులో మహీంద్రా E20 కారు కూడా ఉంది. దీనిని గుల్ పనాగ్ భర్త ఆమె పుట్టిన రోజుకి గిఫ్ట్ గా అందించాడు.
గుల్ పనాగ్ వద్ద పైన చెప్పిన వాహనాలు మాత్రమే కాకుండా మహీంద్రా యొక్క థార్, అల్టురాస్ G4, బిఎండబ్ల్యు F650 Funduro, రాయల్ ఎన్ఫీల్డ్, ట్రైయంప్ బోన్‌విల్ టి120 మరియు జావా 42 మొదలైనవి ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








