ఖరీదైన కారులో కనిపించిన 'మాధురీ దీక్షిత్' దంపతులు.. వైరల్ అవుతున్న వీడియో

అలనాటి అందాల తార మరియు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ 'మాధురీ దీక్షిత్' గురించి తెలుగు వారికి కూడా బాగా తెలుసు. తెలుగులో ఈమె నటించిన సినిమాల సంఖ్య చాలా తక్కువ, కానీ హిందీలో తన నటనకు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవల మాధురీ దీక్షిత్ ఒక ఖరీదైన కారులో కనిపించింది.

ఖరీదైన కారులో కనిపించిన 'మాధురీ దీక్షిత్' దంపతులు

నివేదికల ప్రకారం, నటి మాధురీ దీక్షిత్ ఇటీవల తన భర్త 'డాక్టర్ శ్రీరాం మహదేవ్ నెనె' తో కలిసి ఫెరారీ 296 GTB కారులో కనిపించింది. దీనికి సంబంచిందిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మాధురీ దీక్షిత్ & శ్రీరాం నెనె ఇద్దరూ బ్లాక్ కలర్ ఫెరారీ 296 GTB కారులో వెళ్లడం చూడవచ్చు. శ్రీరాం నెనె కారు డ్రైవ్ చేస్తుండగా మాధురీ దీక్షిత్ ప్యాసింజర్ సీట్లో కూర్చుని ఉండటం చూడవచ్చు.

ఖరీదైన కారులో కనిపించిన 'మాధురీ దీక్షిత్' దంపతులు

ఫెరారీ 296 GTB కారు ధర రూ. 6 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ ఖరీదైన కారులో ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబై వీధుల్లో ప్రయాణించింది. అయితే ఈ కారు నెంబర్ ను ప్రభుత్వ వాహన సమాచార వెబ్‌సైట్ పరివాహన్‌లో ట్రాక్ చేసినప్పుడు అది నవనిత్ మోటార్స్‌కి చెందినదని తెలిసిందని కొన్ని వర్గాల ద్వారా తెలిసింది. కావున ఈ కారు మాధురీ దీక్షిత్ కుటుంభానికి చెందినదా.. లేదా అనేది ఖచ్చితంగా తెలియదు.

ఖరీదైన కారులో కనిపించిన 'మాధురీ దీక్షిత్' దంపతులు

నవనిత్ మోటార్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ముంబైలోని ఫెరారీ కంపెనీ యొక్క డీలర్. అయితే మాధురీ దీక్షిత దంపతులు ఈ కారుని అక్కడ కొనుగోలు చేసి ఉండవచ్చు.. లేదా త్వరలో కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సూపర్ కారు దేశీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. ఈ కారుని మన దేశంలో అతి తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రమే కలిగి ఉన్నారు.

ఖరీదైన కారులో కనిపించిన 'మాధురీ దీక్షిత్' దంపతులు

నిజానికి మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరాం మహదేవ్ నెనె ఆటోమోటివ్ ఔత్సాహికుడు, ఈ కారణంగానే యితడు ఇతర దేశాలకు చెందిన ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నారు. ఇందులో వారి రోజు వారీ ప్రయాణానికి టాటా మోటార్స్ యొక్క పాపులర్ ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ EV ని కూడా కలిగి ఉన్నారు. అంతే కాకుండా వారు రెండు పోర్ష్‌ కార్లను, ఒక టెస్లా కారుని కలిగి ఉన్నట్లు సమాచారం.

ఖరీదైన కారులో కనిపించిన 'మాధురీ దీక్షిత్' దంపతులు

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీదారు అయిన ఫెరారీ యొక్క 296 జిటిబి అనేది కంపెనీ యొక్క లేటెస్ట్ మోడల్. ఇది రెండు డోర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది హార్డ్-టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. ఇది అత్యధిక వేగంతో ప్రయాణించే వేగవంతమైన కారు. ఇది చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

ఫెరారీ 296 GTB అద్భుతమైన పర్ఫామెన్స్ అందించడానికి ఇందులో 3.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్ మరియు 123 kW ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు కలయికతో పవర్ డెలివరీ చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ యొక్క కంబైన్డ్ పవర్ అవుట్‌పుట్ 830 hp వరకు ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఖరీదైన కారులో కనిపించిన 'మాధురీ దీక్షిత్' దంపతులు

సాధారణంగా సెలబ్రెటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం లేదా లగ్జరీ కార్లలో ప్రయాణించడం ఇదేమి కొత్త కాదు, ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ కి చెందిన ఒక వ్యక్తి రూ. 12 కోట్ల విలువైన మెక్‌లారెన్ 765 LT స్పైడర్ కారుని కూడా కొనుగోలు చేశారు. ఇలాంటి ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, December 26, 2022, 16:38 [IST]
English summary
Bollywood beauty madhuri dixit spotted in ferrari 296 gtb with husband
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+