కెరీర్ మొత్తంలో ఒక్క హిట్ సినిమా లేదు.. అయినా అమ్మడి లగ్జరీకి మాత్రం కొదవలేదు.. మెర్సిడెస్‌లో మెరిసిన కృతి
సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ, సినిమాలోని పాటల్లో అదిరిపోయే స్టెప్పులతో ప్రజలను ఆకట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి టాలెంట్ ఉన్న బ్యూటీ కృతి సనన్. మిమి సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న కృతి ఇప్పటికే అనేక హిట్ సినిమాల్లో నటించింది. ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అయినా, కృతి స్టార్‌డమ్‌కి మాత్రం ఏమాత్రం లోటు రాలేదు. ఆమెను గుర్తుపట్టడానికి పరం పరం పరమ సుందరి పాట ఒక్కటి చాలు.
తాజాగా కృతి సనన్ తన లగ్జరీ ఎస్‌యూవీ మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ GLS 600లో వస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సినిమాకు రూ. 3 నుంచి 4 కోట్లు వసూలు చేసే ఈ హీరోయిన్, ప్రకటనలు, మోడలింగ్ ద్వారా కూడా బాగా సంపాదిస్తుంది. ఈ అందాల తారకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం.

ఈ కారును కృతి కొన్ని రోజుల క్రితం సొంతంగా కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ. 2.43 కోట్లు. ఈ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య కూడా ఒక సెలబ్రిటీ. ఈ కారుకు 4.0 లీటర్ బై-టర్బో V8 పెట్రోల్ ఇంజన్ అమర్చారు. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ భారీ V8 ఇంజన్ గరిష్టంగా 550 బీహెచ్‌పీ శక్తిని, 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
మెర్సిడెస్ బెంజ్ 4MATIC డ్రైవ్‌ట్రైన్ స్టాండర్డ్‌గా ఉండటం వల్ల ఈ ఎస్‌యూవీ అసాధారణమైన పనితీరును కనబరుస్తుంది. ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా స్టాండర్డ్‌గా ఉంటుంది. మేబ్యాక్ GLS 600 ఎస్‌యూవీ కేవలం 4.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడు గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

డిజైన్ విషయానికొస్తే.. ఎవరినైనా ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు. పెద్ద క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో పాటు మేబ్యాక్ డిజైన్ అంశాలను GLS600లో ఉన్నాయి. దీని ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది.
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు రెండు 12.3 అంగుళాల స్క్రీన్‌లను ఇచ్చారు. 4 సీట్ల ఈ కారులో నాప్పా లెదర్ అప్‌హోల్‌స్టరీ, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, గాలి తగిలే మసాజింగ్ సీట్లు, షాంపెయిన్ బాటిల్స్ ఉంచడానికి రిఫ్రిజిరేటర్ ఉన్న ఫిక్స్‌డ్ సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి.
యాక్టివ్ డిస్టెన్స్ అసిస్ట్ డిస్ట్రానిక్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్ వంటి అనేక సురక్షా ఫీచర్లను మెర్సిడెస్ ఈ అల్ట్రా-లగ్జరీ ఎస్‌యూవీలో అందించింది. మేబ్యాక్‌తో పాటు కృతి గ్యారేజీలో ఆడి Q7, బీఎండబ్ల్యూ 3 సిరీస్ 320d వంటి కార్లు కూడా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








