బాలీవుడ్ కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

కోట్లు విలువ చేసే ఆస్తులు, ఇండస్ట్రీలో పెద్ద పేరు మరియు ఎంతో స్టేటస్ ఉన్నప్పటికీ, షారుఖ్ ఖాన్ చాలా సింపుల్‌గా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కింగ్ ఖాన్‌కు టూవీలర్స్ అంటే చాలా భయం, అందుకే అతడు కార్లపై ఎక్కువ ప్రేమను పెంచుకున్నాడు.

Recommended Video

Tata Tiago iCNG Telugu Review | CNG Performance, Features & Safety | Boot Space, Harman Sound System

ఈ బాలీవుడ్ సూపర్‌స్టార్ వద్ద ఇప్పటికే అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈయన కార్ గ్యారాజ్‌లో క్రెటా నుండి రోల్స్ రాయిస్ వరకూ చాలానే కార్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

1. రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్ తయారు చేసిన ప్రత్యేకమైన మోడళ్లలో ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూప్ కూడా ఒకటి. ఈ కన్వర్టిబల్ రోల్స్ రాయిస్ దాని పరిచయం సమయంలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లలో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం, ఈ కారు విక్రయాలు నిలిపివేయబడ్డాయి.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

ఈ రోల్స్ రాయిస్ సెడాన్ ధర విడుదల సమయంలో సుమారు రూ.7 కోట్లు. సెలబ్రిటీలకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేయాలంటే, దాని ధర మరింత పెరుగుతుంది.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

2. బెంట్లీ కాంటినెంటల్ జిటి

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్లను తయారు చేసే కంపెనీలలో బెంట్లీ కూడా ఒకటి. ఇది కూడా బ్రిటన్‌కు చెందిన కార్ కంపెనీయే. మన కింగ్ ఖాన్ వద్ద బెంట్లీ తయారు చేసిన కాంటినెంటల్ జిటి మోడల్ ఉంది. ఈ మోడల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. ఇదొక టూ-డోర్ కూప్ మోడల్. బెంట్లీ కాంటినెంటల్ జిటి 2-డోర్ కూప్ మోడల్ శక్తివంతమైనన 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

3. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్

షారుఖ్ ఖాన్ గ్యారాజ్‌లో కొలువుదీరిన మూడవ బ్రిటీష్ కారు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్. టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న ఈ బ్రిటీష్ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ తమ రేంజ్ రోవర్ సిరీస్‌లో విక్రయిస్తున్న స్పోర్టీ ఎస్‌యూవీ ఇది. రేంజ్ రోవర్ స్పోర్ట్ అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే, ఈ కారుకి ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ శక్తివంతమైన 5.0-లీటర్ సూపర్‌చార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

4. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్

పైన తెలిపిన మూడు కార్లు షారుఖ్ ఖాన్ గ్యారాజ్‌లో అత్యంత ఖరీదైన మోడళ్లు. ఇక వీటితో పాటుగా ఆయన కార్ కలెక్షన్‌లో ఉన్న జర్మన్ లగ్జరీ కారు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్. మంచి ఏరోడైనమిక్ డిజైన్ మరియు విలావసవంతమైన ఇంటీరియర్ ఫీచర్లతో రూపొందించబడిన ఒక అద్భుతమైన లగ్జరీ సెడాన్ ఇది. షారూఖ్ ఖాన్ వద్ద 7-సిరీస్ మోడల్ యొక్క పెట్రోల్ వేరియంట్ అయిన 760 ఎల్ఐ ఉన్నట్లు సమాచారం.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

5. బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కన్వర్టిబల్

షారుఖ్ ఖాన్‌కు ఓపెన్ టాప్ లేదా కన్వర్టిబల్ కార్లంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ స్టార్ హీరో వద్ద మరో జర్మన్ కారు మరియు మరో కన్వర్టిబల్ కారు బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కన్వర్టిబల్. ఇదొక 2-డోర్ 4-సీటర్ డ్రాప్ హెడ్ కారు, అయితే ప్రస్తుతం ఇది అమ్మకంలో లేదు. దీనికి బదులుగా కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 అనే కన్వర్టిబల్ కారును విడుదల చేసింది. షారుఖ్ ఖాన్ యొక్క ప్రారంభ లగ్జరీ కార్లలో 6-సిరీస్ కన్వర్టిబుల్ కూడా ఒకటి. ఇది 4.4-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

6. బిఎమ్‌డబ్ల్యూ ఐ8

కింగ్ ఖాన్ వద్ద ఉన్న మూడవ జర్మన్ కారు మరియు బిఎమ్‌డబ్ల్యూకి చెందిన మూడవ మోడల్ బిఎమ్‌డబ్ల్యూ ఐ8. షారుఖ్ ఖాన్ గ్యారాజ్ లో ఎక్కువ బిఎమ్‌డబ్ల్యూ కార్లను చూస్తుంటే, ఆయనకు ఈ బ్రాండ్ కార్లంటే చాలా ఎక్కువ ఇష్టమని తెలుస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ ఐ8 అనేది ఈ బ్రాండ్ అందించిన ఓ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు మరియు ఇది తక్కువ కాలం మాత్రమే ఉత్పత్తి చేయబడింది.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

7. ఆడి ఏ8 ఎల్

షారుఖ్ ఖాన్ గ్యారాజ్‌లోని నాల్గవ జర్మన్ బ్రాండ్ కారు ఆడి ఏ8 ఎల్. ఇది ఆడి అందిస్తున్న కార్లలో కెల్లా అత్యంత విశాలమైనది మరియు విలాసవంతమైనది. ఈ కారు ఓ చిన్నసైజు లీమోజైన్ మాదిరిగా అనిపిస్తుంది. ఆడి ఏ8 ఎల్ దేశంలోని అనేక ప్రముఖ సెలబ్రిటీలను ఆకర్షించింది. ఈ కారులో అందించే సీట్లు మరియు ఫీచర్లు అంత విలాసవంతంగా ఉంటాయి. షారూఖ్ ఖాన్ వద్ద డీజిల్ వెర్షన్ ఆడి ఏ8 ఎల్ మోడల్‌ ఉన్నట్లు సమాచారం. ఇది 4.2 లీటర్ వి8 డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

8. టొయోటా ల్యాండ్ క్రూయిజర్

జపాన్‌కు చెందిన టొయోటా భారతదేశంలో విక్రయించే ఇంపోర్టెడ్ కారు టొయోటా ల్యాండ్ క్రూయిజర్. చూడటానికి, ఫార్చ్యూనర్ పెద్దన్నలా కనిపించే ఈ పెద్ద ఎస్‌యూవీ దాని గంభీరమైన రోడ్ ప్రజెన్స్‌తో రోడ్డుపై ఎలాంటి వారి దృష్టినైనా తనవైపుకు తిప్పుకుంటుంది. టొయోటా ల్యాండ్ క్రూయిజర్ మంచి ఆఫ్-రోడింగ్ శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. యూరోపియన్ మార్కెట్లలో ఈ మోడల్ చాలా ప్రసిద్ధి చెందింది. ల్యాండ్ క్రూయిజర్‌లో పవర్‌ఫుల్ 4.5-లీటర్ వి8 డీజిల్ ఇంజన్‌ ఉంటుంది.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

9. మిత్సుబిషి పాజెరో

జపనీస్ కార్ బ్రాండ్ మిత్సుబిషి అందించే అత్యుత్తమ స్పోర్టీ ఎస్‌యూవీలలో పాజెరో కూడా ఒకటి. పాత మోడల్ మిత్సుబిషి పాజెరో దాని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు మరియు పవర్‌ఫుల్ ఇంజన్‌కు చాలా ప్రసిద్ధి చెందింది. షారూఖ్ ఖాన్ గ్యారేజీలో ఉన్న పురాతన క్లాసిక్ కార్లలో మిత్సుబిషి పాజెరో కూడా ఒకటి. ఒకప్పుడు భారతదేశంలో విక్రయించబడిన ఈ మిత్సుబిషి వాహనం ఇప్పుడు ఇక్కడి మార్కెట్లో తయారు చేయబడటం లేదు. షారుఖ్ ఖాన్ యొక్క పాజెరో 2.8-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

బాలీవుడ్ కింగ్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!

10. హ్యుందాయ్ క్రెటా

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భారతదేశంలో హ్యుందాయ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసినదే. షారుఖ్ ఖాన్ వద్ద ఇప్పటికే అనేక హ్యుందాయ్ కార్లు ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పుడు ఆయన గ్యారాజ్ లో కొత్తగా 2వ తరం హ్యుందాయ్ క్రెటా కూడా జోడించబడింది. మార్చి 2020లో ప్రారంభించబడిన ఈ కొత్త తరం క్రెటా కారును 2020 ఆటో ఎక్స్‌పోలో షారుఖ్ ఖాన్ విడుదల చేశారు.

Most Read Articles

English summary
Shahrukh khan car collection124113
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X