కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

ప్రముఖ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మరియు KK గా ప్రసిద్ధి చెందిన 'కృష్ణకుమార్ కున్నత్' గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తన మరణానికి ముందు కలకత్తాలోని నార్జూల్ మంచాలో 2022 మే 30 (మంగళవారం) న జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌లో కృష్ణ కుమార్ కున్నత్ పాల్గొన్నారు. ఆ తరువాత తాను బస చేసే హోటల్‌కి వెళ్లిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, అప్పటికప్పుడే అతనిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే కెకె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేకే మరణం సినీలోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

కృష్ణ కుమార్ కున్నత్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, అస్సామీ మరియు గుజరాతీ భాషల్లో కూడా పాటలను పాడారు. పాటలను పాడుతూ అత్యుత్తమంగా సింగర్ గా పేరుగాంచిన కె.కె. కార్ల ప్రేమికుడు కూడా.. కావున కేకే కలిగి ఉన్న కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

కృష్ణ కుమార్ కున్నత్ వద్ద జీప్ కంపెనీకి చెందిన చెరోకీ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఏ క్లాస్ మరియు ఆడి కంపెనీకి చెందిన ఆర్ఎస్5 వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. కేకే ఇటీవలే ఆడి ఆర్ఎస్5 కారుని కొనుగోలు చేశారు.

కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

ఆడి ఆర్ఎస్5 (Audi RS5):

జర్మన్ బ్రాండ్ అయిన ఆడి కంపెనీ యొక్క ఆర్ఎస్5 ధర రూ. 1.04 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ లగ్జరీ కారు గత ఏడాది ఆగస్టులో భారతదేశంలో విడుదలయింది. ఈ లగ్జరీ కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

RS5 స్పోర్ట్‌బ్యాక్‌ వి6 2.9-లీటర్ టిఎఫ్ఎస్ఐ ట్విన్-టర్బో ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 443 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. సెల్ఫ్-లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్‌తో బ్రాండ్ యొక్క క్వాట్రో పర్మినెంట్ ఆల్-వీల్ డ్రైవ్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సెట్ చేయబడింది. మెరుగైన పనితీరు కోసం ఆడి డ్రైవ్ సెలెక్ట్, ఆర్ఎస్ స్పోర్ట్స్ సస్పెన్షన్ మరియు ఆర్ఎస్ స్టీల్ బ్రేక్‌లతో కూడా ఈ సెడాన్ అందించబడుతుంది.

కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, యాంటీ-థెఫ్ట్ వీల్ బోల్ట్‌లు, హోల్డ్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ రియర్-వ్యూ మిర్రర్, స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి.

కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

జీప్ గ్రాండ్ చెరోకీ (Jeep Grand Cherokee):

కేకే కలిగి ఉన్న కార్లలో జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' (Grand Cherokee) కూడా ఒకటి. దీని ధర రూ. 75 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారులో 'కృష్ణ కుమార్ కున్నత్' చాలాసార్లు కనిపించారు. ఇది కూడా చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. కావున ఎక్కువమంది సెలబ్రెటీలు దీనిని కొనుగోలు చేస్తారు.

కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

జీప్ గ్రాండ్ చెరోకీ భారతదేశంలో డీప్ చెర్రీ రెడ్ క్రిస్టల్ పర్ల్, బ్రిలియంట్ బ్లాక్ క్రిస్టల్ పర్ల్, బ్రైట్ వైట్, ట్రూ బ్లూ పెర్ల్, గ్రానైట్ క్రిస్టల్ మరియు బిల్లెట్ సిల్వర్ వంటి 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో, కంపెనీ జీప్ గ్రాండ్ చెరోకీ 4xeని పరిచయం చేసింది.

కృష్ణకుమార్ కున్నత్ (KK) ఉపయోగించిన లగ్జరీ కార్లు: ఎలా ఉన్నాయో చూసారా..!!

మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్ (Mercedes-Benz A Class):

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ యొక్క ఏ క్లాస్ సెడాన్ ని కూడా కేకే వినియోగిస్తున్నారు. దీని ధర రూ. 32.32 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని ఉత్పత్తిని కంపెనీ 2019 లోనే నిలిపివేసింది. అయితే ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన పనితీరుని కూడా అందిస్తుంది. కావున ఇప్పటికి కూడా చాలామంది దీనిని వినియోగిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, June 2, 2022, 5:00 [IST]
English summary
Bollywood singer kk car collection mercedes benz a class audi rs5 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+