సింగర్ 'జుబిన్ గార్గ్' కొత్త కారు ఇదే.. ఇదిగో ఫోటోలు

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటారనే విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ప్రముఖ సింగర్ తన గ్యారేజిలోకి ఓ రేంజ్ రోవర్ కారును చేర్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ 'జుబిన్ గార్గ్' (Zubin Garg) ఇటీవల 'రేంజ్ రోవర్ వెలార్' (Range Rover Velar) SUV కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో తన రేంజ్ రోవర్ కారు వద్ద ఫోటోలకు పోజులివ్వడం చూడవచ్చు. గార్గ్ కేవలం సింగర్ మాత్రమే కాదు, నటుడు మరియు దర్శకుడు కూడా.

Zubin Garg Range Rover Velar

జుబిన్ గార్గ్ నిర్మాణ సంస్థ కాంచెన్‌జంగా మరియు మిషన్ చైనా అనే చిత్రాలకు బాధ్యత వహించిన విషయం దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. అస్సామీ సినీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన గార్గ్ గ్యారేజిలో రేంజ్ రోవర్ మాత్రమే కాకుండా ఇతర కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఏ కార్లు అతని గ్యారేజిలో ఉన్నాయనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ లగ్జరీ కార్లలో రేంజ్ రోవర్ ఒకటి. ఇప్పటికే ఈ కారును చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు కొనుగోలు చేశారు. ఇందులో కేవలం వెలార్ మాత్రమే కాకుండా రేంజ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ వోగ్ మరియు రేంజ్ రోవర్ డిఫెండర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

Zubin Garg Range Rover Velar

రేంజ్ రోవర్ వెలార్ (Range Rover Velar)

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన రేంజ్ రోవర్ వెలార్ 2.0-లీటర్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 5500 rpm వద్ద 246.6 Bhp మరియు 1300-4500 rpm వద్ద 365 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 3750 rpm వద్ద 201 Bhp పవర్ మరియు 1750-2500 rpm వద్ద 430 Nm టార్క్ అందిస్తుంది.

మిస్టర్ గార్గ్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ వెలార్ పెట్రోల్ వేరియంట్ అని తెలుస్తోంది. ఈ SUVలోని ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, లెదర్యాప్డ్ సీట్లు, స్టీరింగ్ వీల్, ప్రీమియం స్పీఎకర్ సిస్టం మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి మరిన్ని ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

రేంజ్ రోవర్ వెలార్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్, హిల్ డీసెంట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ప్రయాణికులకు పటిష్టమైన భద్రతను అందిస్తుంది. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందించడం వల్ల రేంజ్ రోవర్ వెలార్ కారును చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Sunday, March 10, 2024, 9:03 [IST]
English summary
Bollywood singer zubin garg buys range rover velar details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+