బాలీవుడ్ స్టార్స్ ఉపయోగించే ఖరీదైన బైకులు.. ఇవే
ఇప్పటివరకు మనం చాలా కథనాల్లో బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు ఉపయోగించే అత్యాధునిక మరియు అద్భుతమైన లగ్జరీ కార్లను గురించి తెలుసుకున్నాం. అయితే వీరి గ్యారేజిలో ఖరీదైన కార్లతోపాటు, ఖరీదైన బైకులు కూడా ఉన్నాయి. ఇందులో యమహా కంపెనీ బైకుల నుంచి సుజుకి హయబుసా బైకులవరకు ఉన్నాయి.
Recommended Video
మనం ఈ కథనంలో బాలీవుడ్ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు ఎలాంటి బైక్స్ ఉపయోగిస్తున్నారు, వాటి ధర ఎంతవరకు ఉంటుందనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. రండి.

సల్మాన్ ఖాన్:
బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' కి అత్యంత వేగవతమైన బైకులంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే అప్పుడప్పుడు ముంబై వీధుల్లో బైకులో తిరుగుతూ కనిపిస్తాడు. అత్యంత ఖరీదైన కార్లు మరియు విలాసవంతమైన బంగ్లాలు మాత్రమే కాకుండా యమహా ఆర్1 వంటి ఖరీదైన బైక్ కూడా కలిగి ఉన్నాడు.

భారతీయ మార్కెట్లో యమహా కంపెనీ యొక్క ఆర్1 బైక్ ధర రూ. 21 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ సూపర్ స్పోర్ట్స్ బైక్ 998 సిసి క్రాస్-ప్లేన్, 4-సిలిండర్, 4-వాల్వ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 179 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది, కావున మంచి పనితీరుని అందిస్తుంది.

యమహా ఆర్1 అనేది కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన మరియు మంచి పనితీరును అందిస్తుంది. ఈ R1 బైక్‌లో క్విక్ షిఫ్ట్ సిస్టమ్, లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్, రెండు వైపులా డిఆర్ఎల్ మరియు ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ బైక్ రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

అక్షయ్ కుమార్:
బాలీవుడ్ చిత్ర సీమలో మరో ఫెమస్ సెలబ్రెటీ మరియు హీరో అయిన అక్షయ్ కుమార్ కి కూడా బైకులంటే చాలా ఇష్టం. ఈ కారణంగా యితడు ఎక్కువ సార్లు హెల్మెట్ ధరించి లాంగ్ రైడ్స్ కి వెల్తూ ఉంటాడు. ఇతని వద్ద అత్యంత ఖరీదైన యమహా కంపెనీ యొక్క విమాక్స్ ఉంది. డీఐ ధర భారతీయ మార్కెట్లో రూ. 27 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే భారతీయ మార్కెట్లో ఈ బైక్ 2020 లో నిలిపివేయబడింది.

యమహా విమాక్స్ బైక్ 1679 సిసి వి4 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 6500 ఆర్‌పిఎమ్ వద్ద 167 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ మరియు 9000 ఆర్ పిఎమ్ వద్ద గరిష్టంగా 200 హార్స్ పవర్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 220 కిలోమీటర్లు. ఇది అత్యంత వేగవతమైన బైకులతో ఒకటి.

జాన్ అబ్రహం:
బాలీవుడ్ లో సూపర్ బైకులంటే ఎక్కువగా ఇష్టపడే హీరోలలో ఒకరు జాన్ అబ్రహం. ఇతడు ధూమ్ సినిమాలో సుజుకి హయాబుసా రైడ్ చేస్తూ కనిపించాడు. అయితే ఇతనికి నిజజీవితంలో కూడా బైకులంటే చాలా ఇష్టం.

జాన్ అబ్రహం సుజుకి హయబుసా, యమహా YZF R1 వంటివాటితో కలిపి మొత్తం 16 కంటే ఎక్కువ బైక్‌లను కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఖరీదైన బైకులు. ఇందులో అతనికి ఇష్టమైన మరియు ఖరీదైన బైక్ డుకాటి యొక్క పానిగేల్ వి4. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన బైక్ కూడా. ఈ బైక్ ధర రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూమ్).

డుకాటి పానిగేల్ వి4 1.1-లీటర్ 4-సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 215 బిహెచ్‌పి పవర్ మరియు 123 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. కావున ఎక్కువమంది సెలబ్రెటీలు ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

విద్యుత్ జమ్వాల్:
ప్రముఖ బాలీవుడ్ ఫైటర్ విద్యుత్ జమ్వాల్ ఉపయోగించే బైక్ ట్రయంఫ్ కంపెనీ యొక్క రాకెట్ 3 సూపర్ బైక్. ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా, రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ట్రయంఫ్ రాకెట్ 3 బైక్ 2458 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. కావున ఇది 165 హార్స్ పవర్ మరియు 221 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ టార్క్-అసిస్ట్ హైడ్రాలిక్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

షాహిద్ కపూర్:
షాహిద్ కపూర్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన బైకులు చాలానే ఉన్నాయి. ఇందులో BMW R1250GS అడ్వెంచర్ బైక్ కూడా ఉంది. ఈ బైక్ ధర రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

నిజానికి R1250GS అనేది BMW మోటోరాడ్ యొక్క ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్-టూరింగ్ బైక్. ఇందులో 1,254 సిసి ఇంజిన్ ఉంటుంది. ఇది 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 134 బిహెచ్‌పి పవర్ మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 143 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ స్టాండర్డ్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
బాలీవుడ్ లో మాత్రమే కాకుండా, టాలీవుడ్ లో కూడా నాగచైతన్య, ప్రభాస్ మొదలైన వారు ఖరీదైన బైకులను కలిగి ఉన్నారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతోపాటు ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకులు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








