బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు..!!
ఎంతో మంది తారలు ఎంతో విలువైన కార్లను కొంటారు. మరియు వాటికి అంతే విలువైన ఫ్యాన్సీ కార్ నెంబర్లను కోరుకుంటారు. చాలా మంది వీలైనంత వరకు ఫ్యాన్సీ నెంబర్లు కొనడానికి ఎంతో ఆత్రుతగా ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్.టి.ఒ అధికారులు ఇలా ఫ్యాన్సీ నెంబర్లను కోరుకునే వారికోసం వేళం పాటను నిర్వహిస్తుంది.
Also Read: మార్కెట్లో సందడి చేస్తున్న లీటర్‌కి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల కొత్త కారు
అదే విదంగా వ్యక్తుల తమ జీవితంలో బాగా కలిసొచ్చే నెంబర్లను అమితంగా ఇష్టపడతారు. ఒక వేళ రిజిస్ట్రేషన్ సమయంలో వారు అదృష్ట సంఖ్య వచ్చిందంటే అలాంటి వాటిని కొనడానికి మరింత ఆసక్తి చూపిస్తారు.
Also Read: అత్యదిక మంది కొనుగోలు చేసిన టాప్ 10 కార్లు: మరి ఇందులో మీరు దేనిని ఎంచుకుంటారు
మొత్తానికి నెంబర్ ప్లేట్ కొనే వారు, వారికి బాగా కలిసొచ్చే నెంబర్‌నో, బాగా ఎక్కువగా నమ్మే సంఖ్యనో లేదా వారి రాశి చక్రానికి దగ్గరగా ఉండే నెంబర్లను కోరుకుంటారు. ఇది సర్వసాదారణం. అయితే బాలీవుడు తారలు ఎలాంటి నెంబర్లను కోరుకుంటున్నారో క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం.....!

రణబీర్ కపూర్
చైనా సహా చాలా దేశాల వారు నెంబర్ ఎనిమిదిని అమితంగా ఇష్టపడతారు. అయితే మన బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు చెందిన అన్ని కార్ల కూడా నెంబర్ ఎనిమిది వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇతను ఇంతగా ఈ నెంబర్‌ని ఇష్టపడటానికి కారణం. అతని 33 ఏళ్ల వయస్సున్న అమ్మ మరియు నీతూ కపూర్ ల పుట్టిన తేది జూలై 8 న వస్తుంది బహుశా ఇదే కారణం కావచ్చు.

షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రాశి సంఖ్య ఆదారంగా అతనికి బాగా కలిసొచ్చే సంఘఖ్య 555. అందుకే ఈయన దాదాపుగా అతని అన్ని కార్లకు 555 రిజిస్ట్రేషన్ వచ్చే విధంగా జాగ్రత్త తీసుకుంటాడు.

సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పుట్టిన సంవత్సరం 1970. తను పుట్టిన 16 వార్షికోత్సవం ఆధారంగా 7 శుభ సూచికంగా వస్తుందని తన అన్ని కార్లకు 7 నెంబర్ వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంన్నాడు.

రితేష్ దేష్‌ముఖ్
రితేష్ దేష్‌ముఖ్ ఎక్కువగా ఇష్టపడే నెంబర్ " 1 ". ఒక సారి ఫోటోను గమనిస్తే R 1 అనే నెంబర్‌ను గమనించవచ్చు. ఇక్కడ R అంటే రితేష్ అనే అర్థం వస్తుందనేమో ఈయన తన అన్ని వాహనాలకు R 1 అనే నెంబర్ వచ్చే విధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం మొదలు పెట్టాడు.

షాహీద్ కపూర్
షాహీద్ కపూర్ యొక్క పుట్టిన తేది ఫిబ్రవరి 25, 2 మరియు 5 ను కలపగా 7 వస్తుంది. ఈ పుట్టిన రోజు సెంటిమెంట్ ఆధారంగా వచ్చే నెంబర్ ఏడును తన అన్ని వాహనాల మీద 700 వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని తెగ ఆనందపడిపోతున్నాడు ఈ యువ కథానాయకుడు.

సంజయ్ దత్
సంజయ్ దత్ ఎంతో సంతోషకరమైన నడుటు. ఇతనికి లగ్జరీ కార్లు అంటే ఎంతో మక్కువ. ఇతని అన్ని లగ్జరీ కార్ల మీద 4545 నెంబర్ ఉంటుంది. దీనికి కారణం నాలుగు, ఐదు కూడగా తొమ్మిది వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం సంజయ్ దత్ కి బాగా కలిసొచ్చే నెంబర్ 9 అందుకే 4545 గల నెంబర్‌తో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నాడు. ఈ మద్యనే ఇతని భార్య మాన్యతా ఇతనికి రోల్స్-రాయిస్ గోస్ట్ కారును బహూకరించింది ఇది కూడా 4545 నెంబర్‌ను కలిగి ఉండటం మరిత విశేషం.

అమితాబచ్చన్
బాలీవుడ్ అత్యంత ఆదరణ గల విలక్షణ నటుడు అమితాబచ్చన్. ఇతని పుట్టిన రోజు అక్టోబర్ 11. ఈ రెండు 1 మరియు 1 ని కూడగా రెండు ఇలా రెండు వచ్చేవిధంగా ఈ బిగ్ బి తన అన్ని కార్లకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు.

- పింక్ కార్లను కలిగి ఉండే హాలీవుడ్ సెలబ్రిటీలు
- మీకు నచ్చిన సెలబ్రిటీల కార్ల అభిరుచులు తెలుసుకోండి.

స్టార్ హీరోల కార్ల గురించి ఓ లుక్కేద్దామా?
మరిన్ని ఆటోమొబైల్ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌తో లింక్ కనెక్ట్ అవ్వండి


Click it and Unblock the Notifications








