లడఖ్‌లో 19,400 అడుగుల ఎత్తులో రోడ్డు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి ఇదే..!

దేశ సరిహద్దుల వెంట రోడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఎంతో సవాలుతో కూడుకున్నది. ఇందుకోసం ఎన్నో ముందస్తు ప్రణాళికలు అవసరం. అయితే సరిహద్దుల వెంట రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సంస్థ బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ తీవ్రంగా కృషి చేస్తోంది.

తాజాగా ఈ సంస్థ లడఖ్‌లోని డెమ్‌చౌక్‌ ప్రాంతంలో వరల్డ్‌ హై ఆల్టిట్యూడ్‌ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ రోడ్డు పుక్చేకి కలుపుతుంది. ఈ సున్నితమైన ప్రాంతంలో సైనిక స్థావరం ఉంది. ఇది సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

 world highest motorable road in ladakh

అయితే కొత్తగా నిర్మించనున్న రోడ్డు సుమారు 19,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే.. ప్రపంచంలోనే ఎత్తైన మోటారబుల్‌ రహదారిగా నిలుస్తుంది. దీనిపై బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO) ట్వీట్‌ చేసింది. 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుగా (19,024 అడుగులు) ఉన్న ఉమ్లింగ్‌ లా పాస్‌ను దాటుతున్న చిసుమ్లే డెమ్‌చౌక్‌ రహదారి పేరు మీద ఉన్న రికార్డును చెరిపేస్తుందని తెలిపింది. ప్రస్తుతం 19,024 అడుగులతో ప్రపంచంలోనే ఎత్తైన రహదారిగా ఉన్న లడఖ్‌లోని ఉమ్లింగ్‌ లా వద్ద రహదారిని రెండు సంవత్సరాల క్రితం BRO నిర్మించింది.

 world highest motorable road in ladakh

కొత్తగా నిర్మించనున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారిని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన మహిళా ఇంజినీర్ల బృందం పర్యవేక్షిస్తోందని తెలిసింది. ఈ బృందానికి కల్నల్‌ పొనాంగ్‌ డోమింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో తాము భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని కల్నల్‌ పొనాంగ్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు రోడ్ల టాస్క్‌ఫోర్స్‌లో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.

అయితే సరిహద్దుల్లోని రోడ్ల నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడికున్నది. అయినా.. పర్యాటకం సహా భద్రతకు ఈ రోడ్లు ఎంతో ముఖ్యమైనవి. అత్యవసర పరిస్థితుల్లో సరిహద్దులకు వేగంగా సైన్యాన్ని సహా ఇతర వాహనాలను తరలించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ పక్కా ప్రణాళికతో వీటిని నిర్మిస్తోంది.

బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రస్తుతం అనేక రోడ్లను పర్యవేక్షిస్తోంది. మరియు అనేక రోడ్లను నిర్మిస్తోంది. గత నెలలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. భారత్‌- మయన్మార్‌ - థాయ్‌లాండ్‌ మధ్య జరుగుతున్న రోడ్ల ని‌ర్మాణ పనులు సుమారుగా 70% పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు దేశాలు సుమారు 1400 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ఈ రోడ్డు భారత్‌లోని మణిపూర్‌లోని మోరేను నుంచి మయన్మార్‌ మీదుగా థాయ్‌లాండ్‌లోని మెసోట్‌ నగరానికి కలుపుతుంది. ఈ మూడు దేశాల మధ్య హైవే నిర్మించాలన్నది సుమారు రెండు దశాబ్బాల కలగా ఉండేది. గతంలో అనేక కారణాలు వల్ల నిర్మాణాలు ఆలస్యం అయ్యాయి. అయితే ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 19, 2023, 13:36 [IST]
English summary
Border roads organization started construction of world highest motorable road in ladakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+