రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులతో వరల్డ్ రికార్డ్స్ సృష్టించిన BSF

భారతదేశానికి రక్షణ కవచంగా నిలబడి ఉన్న సైనికుల గురించి అందరికి తెలుసు. అయితే ఇటీవల BSF (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) మోటార్ సైకిల్ స్టంట్ టీమ్ ఇటీవల మూడు అరుదైన ప్రపంచ రికార్డులను కైవసం చేసుకుంది. ఈ ప్రపంచ రికార్డుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల BSF విజయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ అరుదైన రికార్డ్ సృష్టించారు. ఈ రికార్డ్ సాధించడం కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను ఉపయోగించారు. నిజానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ బైకులు సాహసాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే వీర సైనికులు ఈ గొప్ప ప్రదర్శనలతో ప్రపంచ రికార్డు సృష్టించి యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులతో వరల్డ్ రికార్డ్ సృష్టించిన BSF సైనికులు

సైనికులు దేశ రక్షణలో మాత్రమే కాకుండా వాహనాల ద్వారా సాహసాలు చేయడానికి కూడా ఏ మాత్రం తీసిపోయే అవకాశమే లేదు. ఈ వరల్డ్ రికార్డ్ సృష్టించిన వారు అందరూ కూడా BSF దళానికి చెందిన సైనికులు. మొదటి రికార్డ్ బద్దలు కొట్టిన వ్యక్తి వ్యక్తి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై 12.9 అడుగుల నిచ్చెనను అమర్చాడు. బైకుపైన అమర్చిన ఆ నిచ్చెన మీద నిలబడి బైకుని నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చూడవచ్చు.

ఇక రెండవ వ్యక్తి (మహిళ) బైకుపై నిలబడి ఎలాంటి ఆధారం లేకుండా ఏకంగా 5 గంటల 26 నిముషాలు పాటు బైక్ రైడ్ చేసి దాదాపు 174.1 కిలోమీటర్ల దూరం కవర్ చేసింది. నిజంగా ఇది చాలా ఆరుదైన ఘటన అనే చెప్పాలి. 174.1 కిమీ దూరం ఒకే వ్యక్తి ప్రయాణించడం చాల గొప్ప విషయం అంతే కాకుండా ఇదే మొదటి సారి కూడా. ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు ఆ మహిళ ఒక్కసారి కూడా బ్రేక్ వేయలేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులతో వరల్డ్ రికార్డ్ సృష్టించిన BSF సైనికులు

ఇక మూడవ రికార్డ్ సాధించిన సైనికుడు బైక్ యొక్క సీటు మీద పడుకుని తన కాళ్లను బైక్ హ్యాండిల్ మీద ఉంచి సుమారు 2 గంటల పాటు బైక్ రైడ్ చేసి 70.2 కిమీ కవర్ చేసాడు. ఈ మూడు రికార్డులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఈ రికార్డులు సాధించిన ముగ్గురు వ్యక్తులు రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైకులు వినియోగించారు. బైకుకి అమర్చిన నిచ్చెన మీద నిలబడిన వ్యక్తి అబ్ధేష్ కుమార్ సింగ్.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మహిళా సైనికురాలి పేరు సీమా భవాని ఆల్ ఉమెన్ మోటార్‌సైకిల్ టీమ్‌కు చెందిన కెప్టెన్ మరియు ఇన్‌స్పెక్టర్ 'హిమాన్షు సిరోహి'. బైకుపై పడుకుని రికార్డ్ సాధించిన వ్యక్తి ఇన్‌స్పెక్టర్ 'బిస్వజిత్ భాటియా'. BSF (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) టీమ్ కి చెందిన వారే. వీరందరి వీరోచిత ప్రదర్శనలు చూసే వారిని తప్పకుండా ఎంతగానో ఆకర్షిస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులతో వరల్డ్ రికార్డ్ సృష్టించిన BSF సైనికులు

ఇటీవల సాధించిన వరల్డ్ రికార్డ్స్ మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం జనవరి 26 న జరిగే రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా సైనికులు ఇలాంటి సాహసోపేతమైన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనలు ఇండియన్ ఆర్మీ యొక్క వీరత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. గతంలో ఒక సైనికుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్‌పై నిలబడి ఎక్కువ దూరం ప్రయాణించి రికార్డు సృష్టించాడు.

భారత సైన్యంలో ఉన్న ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క సింహస్వప్నం. వారి ఒంట్లో చివరి రక్తపు బిందువు ఉన్నత వరకు దేశ సేవకే అర్పిస్తారు. ఏ సమయంలో అయిన ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ధైర్యంతో ఎదుర్కొనగలిగే వారు కేవలం సైనికులు మాత్రమే. సైనికులు కేవలం దేశ రక్షణలో మాత్రమే కాకుండా.. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 27, 2022, 12:05 [IST]
English summary
Border security force creates world record with royal enfield bikes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+