కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ. 70 లక్షల భీమా; బాష్
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. ఈ విధంగా మరణిస్తున్న వారికి అండగా ఉండటానికి వాహన విడిభాగాల తయారీసంస్థ బాష్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రకటించింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినట్లతే మాత్రం ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది.

కరోనా మహమ్మారి వల్ల ఏవరైనా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మరణించినట్లతే 70 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కంపెనీ తగిన పరిష్కార చర్యలు తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితోపాటు కంపెనీ ఉద్యోగులు మరణిస్తే తన కుటుంబానికి మూడేళ్లపాటు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అందుతుందని కంపెనీ తెలిపింది.

కరోనా వైరస్ సంక్రమించడం వల్ల రోగులు శ్వాశకోశ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో కంపెనీ ఆక్సిజన్ మరియు ఇతర వైద్య పరికరాలను బెంగళూరు మరియు పూణే క్యాంపస్‌లలో అందిస్తూ కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

అంతే కాకుండా ప్రస్తుతం దేశంలో కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల, ప్రజలకు ఆక్సిజన్ అందించడానికి ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారంలో కూడా పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కోవిడ్ 19 వల్ల కలిగే కష్టాల సమయంలో ఈ తయారీ యూనిట్లు సమాజానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి.

ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలకు తహమా వంతు సాయం చేయడానికి కంపెనీ ముందడుగులు వేస్తోంది. అంతే కాకుండా ప్రజలు కూడా ఒకరికొకరు సహకరించుకుని, సంఘీభావం తెలుపుకోవాలని కంపెనీ తెలిపింది.

కంపెనీ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి మాట్లాడుతూ, ఉద్యోగులు కరోనా మహమ్మారి వల్ల మరణిస్తే ఉద్యోగులకు సగటున రూ .70 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మరణించిన ఉద్యోగి యొక్క చట్టపరమైన వారసులకు చెల్లించబడుతుందని కూడా అధికారికంగా పేర్కొంది.

ఈ మొత్తం ప్రస్తుతం ఉన్న రూ. 7 లక్షల ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఇడిఎల్ఐ) కు అదనంగా ఉంటుంది. ఆటో మొబైల్ పరిశ్రమలో ఈ రకమైన ప్రాజెక్టును ప్రకటించిన మొదటి సంస్థ బాష్ కాదు. ఈ కంపెనీ కంటే ముందు ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కూడా ఇలాంటి ప్రణాళికలను ప్రకటించింది.

కరోనాతో తమ ఉద్యోగులు మరణిస్తే వచ్చే రెండేళ్లపాటు ఉద్యోగులకు పూర్తి వేతనం ఇస్తామని బజాజ్ ఆటో అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు మరణించినవారి పిల్లల విద్య అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కంపెనీ తెలిపింది. కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్‌ను డిపెండెంట్లకు 5 సంవత్సరాల వరకు కూడా అందిస్తామని బజాజ్ ఆటో తెలిపింది. భాష్ మరియు బజాజ్ ఆటో కంపెనీలు చేసిన ఈ ప్రకటనలు తమ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉండటానికి సహాయపడతాయి.


Click it and Unblock the Notifications








