కార్ ఆడియో సిస్టమ్ సృష్టికర్త అమర్ జీ 'బోస్' మృతి
ఆటోమొబైల్ రంగంలో బోస్ ఆడియో సిస్టమ్స్ గురించి తెలియవారెవరూ ఉండరేమో. కార్ ఆడియో/మ్యూజిక్ సిస్టమ్, ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బోస్ అడియో సృష్టికర్త, బెంగాల్‌కు చెందిన అమర్ గోపాల్ బోస్ ఇకలేరు. 83 ఏళ్ల అమర్ జీ. బోస్ అమెరికాలోని వేలాండ్‌లో శుక్రవారం నాడు కన్నుమూశారు. బోస్ మరణవార్తను ఆయన కుమారుడు వాను జీ. బోస్ ధ్రువీకరించారు.
అమర్ జీ బోస్ స్థాపించిన బోస్ కార్పొరేషన్ అనతి కాలంలోనే బహుళ ప్రజాదరణను సొంతం చేసుకుంది. కేవలం ఆటోమోటివ్ రంగంలోనే కాకుండా, గృహ వినియోగానికి, వ్యక్తిగత వినియోగానికి మరియు ఆడిటోరియంలకు కూడా బోస్ ఆడియో పరికరాలను ఉపయోగిస్తారు. బోస్ కార్పోరేషన్ అందిస్తున్న స్పీకర్లు మార్కెట్‌లో కాస్తా ఖరీదైనవే అయినప్పటికీ ఇవి అత్యంత నాణ్యతను కలిగి ఉంటాయి.
భౌతికశాస్త్రంలోని కొన్ని సూత్రాలను ఆధారంగా చేసుకొని 1960లో పరిశోధనలు జరిపి ఆయన స్పీకర్లను తయారు చేశారు. 1964లో బోస్ గురువు వై డబ్ల్యు లీ సలహా ప్రకారం దీర్ఘకాలికి ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని పలు పరిశోధనలు చేశారు. బోస్ కార్పొరేషన్ తొలుత మిలిటరీ కాంట్రాక్టులు చేపట్టేది. అయితే, అవి బోస్‌కు తృప్తినివ్వలేదు. దాంతో ఆయన నవతరం కోసంస్టీరియో స్పీకర్లను తయారు చేయడం మొదలు పెట్టారు. కానీ అప్పట్లో వాటికి మార్కెట్లో మంచి స్పందన లభించలేదు.
అమర్ జీ బోస్ 1968లో బోస్ 901 డైరెక్ట్/రీఫ్లెక్టింగ్ స్పీకర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా దీనికి మార్కెట్లో అనూహ్య స్పందన లభించింది. ఆల్ఫారోమియో, ఆడి, పోర్షే, మాసేరటి, నిస్సాన్ వంటి అనేక కార్ కంపెనీలు తమ వాహనాలలో బోస్ సిస్టమ్‌లను అందిస్తున్నాయి. శబ్ధాన్ని ప్రపంచానికి సరికొత్త రూపంలో పరిచయం చేసిన బోస్ అత్మకు శాంతి కలగాలని మన అందరం ఆ భగవంతుడిని ప్రార్థిద్ధాం.

బోస్ కార్పోరేషన్ సృష్టికర్త అమర్ జీ బోస్ 1929లో జన్మించారు.

అమర్ జీ బోస్ 1968లో బోస్ 901 డైరెక్ట్/రీఫ్లెక్టింగ్ స్పీకర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా దీనికి మార్కెట్లో అనూహ్య స్పందన లభించింది.

ఆల్ఫారోమియో, ఆడి, పోర్షే, మాసేరటి, రెనో వంటి అనేక కార్ కంపెనీలు తమ వాహనాలలో బోస్ సిస్టమ్‌లను అందిస్తున్నాయి.

మాసేరటి క్వాట్రాపోర్టే కారులో బోస్ ఆడియో సిస్టమ్.

ఆల్ఫారోమియో కారులో బోస్ ఆడియో సిస్టమ్.


Click it and Unblock the Notifications








