Boy Riding Moped మోపెడ్‌పై అమ్మమ్మతో బాలుడి రైడ్.. కోటికి పైగా వ్యూస్‌తో వీడియో వైరల్..
ఈ రోజుల్లో యూత్‌కి బైక్ నడపడమంటే మహా క్రేజ్.. అమ్మాయిలూ అందుకు మినహాయింపు కాదు. ఇక యువకులు తమ అభిరుచికి అనుగుణంగా బైక్‌లు కొనుగోలు చేసి డ్రైవింగ్‌ను ఆస్వాదిస్తారు. కాగా ఏ దేశంలో ఐనా సరే వాహనం నడపాలంటే మైనారిటీ తీరి ఉండటంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాల వార్తలు సాధారణమైపోయాయి. దీనికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడమే. ముఖ్యంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణాలలో ఒకటి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మొదట్లో ఫన్నీగా అనిపించినా.. అది ఎంత ప్రమాదకరమో ఈ కథనంలో మీ కోసం..

పిల్లలను అదుపులో ఉంచాల్సిన తల్లిదండ్రులే వారికి చిన్నవయసులోనే బైక్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. వృద్ధురాలిని మోపెడ్‌పై కూర్చోబెట్టుకుని ఓ చిన్న పిల్లాడు బండి నడుపుతున్న వీడియో వీడియో వైరల్‌గా మారింది. ఆ బాలుడి వయసు పదేళ్ల లోపే ఉండవచ్చు. ఆ చిన్నారి TVS XL నడుపుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
మోపెడ్ వెనుకవైపు తన అమ్మమ్మను కూర్చోబెట్టుకుని ఆ బాలుడు అతివేగంగా మోపెడ్ నడుపుతున్నాడు. అదే దారిలో వెళ్తున్న మరో వాహనంలో ఉన్న వ్యక్తి ఆ సంఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే అని స్పష్టంగా అర్థమవుతోంది. మైనారిటీ తీరని పిల్లలకు బండి ఇవ్వడం చట్టరీత్యా నేరం.
అంతే కాకుండా అతి వేగంతో బండి నడపడమే కాకుండా ఆ బాలుడు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. వెనుక కూర్చున్న వృద్ధురాలికి అక్కడ ప్రమాదకర పరిస్థితి తెలియడం లేదు. తాను తన గమ్యస్థానానికి వెళ్తున్నాననే సంగతి తప్ప ట్రాఫిక్ నిబంధనలేవీ తనకు తెలిసినట్లుగా అనిపించడం లేదు. వీడియోను బట్టి చూస్తే ఇది గ్రామీణ ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీసులు, కెమెరాలు లేకపోవడంతో ఆ చిన్నారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేలా ప్రోత్సహించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడోయోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.24 కోట్లకు పైగా వీక్షణలు మరియు 7.36 లక్షలకు పైగా లైక్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్రంగా స్పందించారు.
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. పిల్లల చేతికి ఇలా వాహనాలు ఇవ్వడం సరికాదని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు ఆ చిన్నారి, అమ్మమ్మ క్షేమంగా ఇంటికి చేరారా అని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడి చిరునామా తెలుసుకుని అతని తల్లిదండ్రులకు జరిమానా విధించి చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








