ఆటోమేటిక్ కారులో బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలి.. ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి ?

మీరు కారులో చాలా స్పీడ్‌గా వెళ్తున్నారు. అప్పుడే అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కారును ఆపాలి అంటే, చాలామంది క్లచ్ తొక్కి, గేర్‌ను డౌన్ చేసి, కారు స్పీడ్‌ను తగ్గించాలి అని చెబుతుంటారు. కానీ, అసలు మ్యాన్యువల్ గేర్‌ లేని ఆటోమెటిక్ గేర్ కార్లలో ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? వివరంగా తెలుసుకుందాం.

కారులో ప్రయాణించడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? వాహనాల్లో ప్రయాణించే చాలామంది దాని వల్ల వచ్చే ప్రమాదాలను పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుత కాలంలో కారు స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్యూర్‌ అవ్వడం చాలా తగ్గిపోయింది. వాహనాలు తయారు చేసే కంపెనీలు ఇప్పుడు చాలా క్వాలిటీ బ్రేకులను ఇస్తున్నాయి. కానీ, పూర్తిగా ఈ సమస్య లేదని మాత్రం చెప్పలేం.

Automatic car

ఈ రోజుల్లో కూడా బ్రేక్ ఫెయిల్యూర్‌ సమస్య ఉంది. సాధారణంగా మ్యాన్యువల్ గేర్ ఉన్న కార్లలో చాలామందికి ఈ సమస్య ఎదురై ఉంటుంది. ఇలాంటి సమస్య చూసిన చాలామంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చాలా చోట్ల చదివి ఉంటారు. కొందరు దీన్ని ప్రమాదకర పరిస్థితుల్లో ఉపయోగించి ఉంటారు కూడా.

మ్యాన్యువల్ గేర్ కార్లలో బ్రేక్ ఫెయిల్యూర్‌ అయితే, గేర్‌ను డౌన్ చేసి స్పీడ్‌ను కంట్రోల్ చేయాలి. స్పీడ్ తగ్గుతున్న కొద్దీ, ఒకవేళ కారు ఢీకొట్టినా ప్రమాదం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని ఫాలో అవ్వమని చెబుతారు. కానీ ఆటోమెటిక్ కార్లలో గేర్ ఉండదు కదా, మరి అప్పుడు ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం.

Automatic car

ఆటోమెటిక్ కార్లలో స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్యూర్‌ అయితే, ముందుగా యాక్సిలరేటర్‌ను వదిలేయాలి. ఇది ముందుగా వాహనం వేగాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఆటోమెటిక్ కారులో యాక్సిలరేటర్‌ను వదిలేసి, స్పీడ్ తగ్గితే, ఏఎమ్‌టీ వంటి కార్లలో గేర్ ఆటోమెటిక్‌గా తగ్గిపోతుంది.

వేగం బాగా తగ్గిన తర్వాత పార్కింగ్ బ్రేక్‌ను ఉపయోగించి వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఒక్కసారిగా ఈ బ్రేక్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించవద్దు. దీనివల్ల వాహనం నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ వీలైతే బ్రేక్‌ను అప్పుడప్పుడు వదిలిపెట్టి మళ్లీ పడితే బ్రేకింగ్ పవర్ మరింత మెరుగ్గా ఉంటుంది.

Automatic car Gear

చాలామంది ఆటోమెటిక్ కార్లలో బ్రేక్ ఫెయిల్యూర్‌ అయితే గేర్‌ను న్యూట్రల్ లో పెట్టాలని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు.. కారు గేర్ పొజిషన్‌లో ఉంటేనే, యాక్సిలరేటర్‌ను నొక్కకపోతే వేగం తగ్గుతుంది. న్యూట్రల్‌లో పెట్టినా కారు వేగం అంత త్వరగా తగ్గదు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: ఆటోమెటిక్ కార్లలో బ్రేక్ ఫెయిల్యూర్‌ అయితే ఎలా ఎదుర్కోవాలి అని చాలామంది డ్రైవర్లకు తెలియదు. అలాంటి వారికి ఈ చిట్కాలు చాలా సహాయపడతాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.

More from DriveSpark

Article Published On: Wednesday, June 25, 2025, 18:18 [IST]
English summary
Brake failure in automatic cars how to handle it without a clutch
Read more on: #india #auto news #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+