ఇంట్లో పేలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్: సీసీటీవీ ఫుటేజ్
ఛార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నట్లుండి పేలిపోవడంతో, ఓ ఫ్యామిలీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. ఏడు గంటల పాటు ఛార్జింగ్ పెట్టడంతో స్కూటర్ ఛార్జింగ్ సిస్టమ్‌లో మంటలు చలరేగి భారీ విస్
ఛార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నట్లుండి పేలిపోవడంతో, ఓ ఫ్యామిలీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. ఏడు గంటల పాటు ఛార్జింగ్ పెట్టడంతో స్కూటర్ ఛార్జింగ్ సిస్టమ్‌లో మంటలు చెలరేగి భారీ విస్పోటనం జరిగింది. ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీ ఫుటేజీలో ఈ ప్రమాదం రికార్డ్ అయ్యింది.

మంటలతో పేలడానికి ముందు స్కూటర్ నుండి చిన్నగా శబ్దం మరియు పొగరావడం సీటీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. చిటపటమనే శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి తన కూతురు మరియు కుక్క పిల్లతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు.

నిప్పురవ్వలు మొదలవ్వడాన్ని గుర్తించిన ఆ వ్యక్తి వెంటనే ఛార్జింగ్ ప్లగ్ తొలగించేశాడు. అయితే, అప్పటికే స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ వ్యవస్థలో మంటలు చెలరేగడంతో వెనువెంటనే విపరీతమైన పొగ అలుముకుని భారీ విస్పోటనం జరిగింది.

అయితే, ఛార్జింగ్ ప్లగ్ తొలగించిన తరువాత, ఇంట్లో ఉన్న ముగ్గరూ వెంటనే అక్కడి నుండి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకి చేరుకుని మంటలను ఆర్పేశారు.

ఈ సంఘటన చైనాలో జరిగింది. స్కూటర్ యజమాని జావో అని గుర్తించడం జరిగింది. ఈ ఘటన పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ స్కూటర్ కొనుగోలు చేసినప్పుడు దీనికి 6 నుండి 12 గంటలు ఛార్జింగ్ పెట్టాలని తెలిపారు. అయితే, 7 గంటలకే స్కూటర్ ఇలా పేలిపోయిందని వివరించాడు.
ఛార్జింగ్ అవుతున్న సందర్భంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోవడాన్ని ఇక్కడున్న వీడియోలో వీక్షించగలరు...
Source: PTI News


Click it and Unblock the Notifications








