కారును సమాధి చేసేందుకు బ్రెజిల్ వ్యక్తి ప్లాన్స్..

మనుషులు మరణించిన తర్వాత శాస్త్ర ప్రకారం సమాధి చేయటం మాములే. కానీ మనుషులతో పాటే వారి కార్లను కూడా సమాధి చేయటం గురించి మీరెప్పుడైనా విన్నారా..? ఇలాంటి ఓ విచిత్ర సంఘటనే బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తనకెంతో ఇష్టమైన బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పౌర్ కారును మట్టిలో పూడ్చిపెట్టేందుకు ఓ గోయ్యి తీసి, తన కారు పక్కన నిల్చన్న ఫొటోను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ విచిత్రమైన ఐడియా వెనుక రహస్యం ఏంటంటే, పురాతన ఈజిప్షయన్ల సాంప్రదాయం ప్రకారం, మరణించిన వ్యక్తులతో పాటుగా వారికి ఇష్టమైన వస్తువులను కూడా సమాధి చేసినట్లయితే, మరణానంతరం సైతం వీటిని వారు ఉపయోగించుకోవచ్చని చెబుతుంటారు. అందుకే, ఈజిప్ట్ పిరమిడ్లలో మమ్మీలతో పాటు వారి ఆభరణాలు, వస్తువులను అందులో ఉంచుతుంటారు.

Bentley Car

ఈ సిద్ధాంతాన్ని అనుసరించే, ఈ 62 ఏళ్ల చిక్విన్హో స్కార్పా అనే వ్యక్తి తన కారును సమాధి చేస్తున్నట్లుగా దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ తర్వాతి రోజున మరో ఫొటోను పోస్ట్ చేసి అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు.

ఆ ఫొటోలో బెంట్లీ కన్నా విలువైనది, మన శరీరంలో ఉన్న అవయవాలని, మరణానంతరం వాటిని దానం చేసినట్లయితే, ఇతరులకు ప్రాణం పోసిన వాళ్లమవుతాయని స్కార్పా ఓ చక్కటి సందేశాన్ని అందించాడు. తాను కూడా, తన మరణానంతరం అవయవాలను దానం చేస్తానని ప్రకటించాడు. మూఢ నమ్మకాలను తొలగించేందుకు ఈ పబ్లిసిటీ స్టంట్ చేసినట్లు ఆయన వివరించాడు.

More from DriveSpark

Article Published On: Friday, October 4, 2013, 15:08 [IST]
English summary
A Brazilian businessman caused a stir recently on social networking site Facebook when he posted a photo of himself standing with a shovel, apparently digging a grave to bury his beloved Bentley Continental Flying Spur. The luxury sedan is also seen in the background.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+