ఔరా ఇదేమి సిత్రం! ఓ వైపు మంచు.. మరోవైపు పెళ్లి - ఫిదా చేస్తున్న వీడియో

వివాహం అనేది జీవితంలో ఓ మధురమైన.. మరచిపోలేని అనుభూతి. కాబట్టి చాలామంది పెళ్లిని ఎంతో ఆడంబరంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ఆశపడుతుంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఓ జంట మంచు ప్రాంతంలో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

నివేదికల ప్రకారం, ఇటీవల ఓ కొత్త జంట హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి లోయల -25 డిగ్రీల ఉషోగ్రతలో పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఓ వైపు మంచు కురుస్తుంటే.. ఆ జంట మాత్రం ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మూడు ముళ్ళు ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఇందులో వధూవరులకు సంబంధించిన బంధువులు కూడా వున్నారు, వారందరూ ఆ చలిని తట్టుకునే విధంగా ఉండే బట్టలు వేసుకున్నారు.

Bride Arrives in Mahindra Thar SUV

ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే.. వధువు మహీంద్రా కంపెనీకి చెందిన థార్ SUVతో ఫోటోలకు ఫోజులిచ్చింది. కెమెరా మ్యాన్స్ మరియు వీడియో రికార్డ్స్ ఫోటోలను, వీడియో రికార్డ్ చేస్తుండటం కూడా వీడియోలో గమనించవచ్చు. మొత్తం మీద ఆ జంట అనుకున్న విధంగానే చలి ఎక్కువగా ఉన్న.. మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెళ్లి చేసుకుని నెటిజన్లను సైతం ఫిదా చేశారు.

నిజానికి పెళ్లిళ్లు, ఇతర సెలబ్రేషన్లలో మహీంద్రా థార్ SUVలను ఉపయోగించడం కొత్తేమీ కాదు. గతంలో కాశ్మీరీ వధువు మహీంద్రా థార్ కారును డ్రైవ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో వరుడు షేక్ అమీర్ మరియు వధువు సనా షబ్నమ్ పెళ్లి తంతు ముగిసిన తరువాత థార్ SUVలోనే బయలుదేరారు. ఈ కారును స్వయంగా వధువు డ్రైవ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Bride Arrives in Mahindra Thar SUV

మహీంద్రా థార్ భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి.. ఇప్పటి వరకు ఎంతోమంది కస్టమర్లను ఆకర్శించింది. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహీంద్రా థార్ SUV కొనుగోలు చేసినట్లు గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో మహీంద్రా థార్ SUV ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

మహీంద్రా థార్

నిజానికి దేశీయ విఫణిలో మహీంద్రా థార్ SUVకి ఓ ప్రత్యేకమైన డిమాండ్ మరియు ఆదరణ ఉండనే చెప్పాలి. ఎందుకంటే భారత మార్కెట్లో లాంచ్ అయ్యి ఇప్పటికి సంవత్సరాలు గడుస్తున్నా.. దీనికున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు, వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికి కూడా చాలానే ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాదు. ఆఫ్-రోడర్ కావడం కూడా.

పనితీరు పరంగా అద్భుతంగా ఉన్న ఈ ఆఫ్-రోడర్ వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది. కంపెనీ ఇటీవల ఈ థార్ SUVని ఎర్త్ ఎడిషన్ రూపంలో లాంచ్ చేసింది. ఇది ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఉండి, కొంత అప్డేటెడ్ డిజైన్ పొందింది. ఇంజిన్ మరియు పర్ఫామెన్స్ పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. అయితే ఇది పరిమిత సంఖ్యలో లభిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2024, 14:00 [IST]
English summary
Bride arrives to spiti valley wedding in mahindra thar video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+