కట్నం కింద బైక్ అడిగిన పెళ్లికొడుకు.. చెప్పుతో కొట్టిన పెళ్లి కూతురు తండ్రి.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు!!

భారతదేశంలో వరకట్న వేధింపుల అంశం ప్రధాన సమస్యగా తయారైంది. వరకట్నానికి సంబంధించిన హత్యలు, ఆత్మహత్యలు, విడాకులకు సంబంధించిన కేసులు నిత్యం వేలల్లో నమోదవుతున్నాయి. దీని కారణంగా వివాహితులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అయినా కానీ ఇంకా ఈ సమస్య స్రీలను వేధిస్తూనే ఉంది.

అయితే కొన్ని సందర్భాల్లో ఇవి బయటపడుతుంటే చాలా సందర్భాల్లో మనసులో దాచుకొని మహిళలు కుమిలిపోతున్నారు. బహిరంగంగా చర్చించలేని అంశం కాబట్టి చాలామందికి ఈ సమస్య చెప్పుకోలేక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమస్యలను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు.

Groom Slapped

వివాహం మొదటి రోజు నుంచి మొదలు పెడితే కట్నం కింద ఒప్పుకున్న మొత్తం సొమ్ము అత్తింటి వారికి చేరే వరకు స్రీలకు కష్టాలు తప్పడం లేదు. వరకట్నం అనేది చట్టానికి వ్యతిరేకమైనా జనాల్లో ఇది సాధారణ అంశంగా మారింది. ఎంత ఎక్కువగా కట్నం తీసుకుంటే అంత హోదా దక్కుతుందని జనాల్లో ఓ భావన ఉంది. అందువల్ల ఈ సమస్య ప్రధానంగా మహిళల్నీ వారి కుటుంబాలను వేధిస్తోంది.

వరకట్న వేధింపులను తట్టుకోలేని మహిళలు బహిరంగంగానే చాలా సందర్భాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అత్తింటి వేధింపులను తట్టుకోలేక కుటుంబంలో చర్చించుకోవాల్సిన అంతర్గత విషయాల్ని బయటకు వెళ్లగక్కుతున్నారు. ఇలాంటి సంఘటనలు పచ్చని కాపురంతో పాటు కుటుంబ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఇటీవల ఓ వ్యక్తి తన పెళ్లిలో కట్నం కింద బైక్ కావాలని డిమాండ్ చేయగా వధువు తండ్రి చెప్పు దెబ్బలతో సమాధానం ఇచ్చాడు. పెళ్లి దుస్తులు ఉన్న వ్యక్తిని అందరు బంధువులు చూస్తుండగానే వరకట్నం అడిగినందుకు తగిన గుణపాఠం చెప్పాడు. సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమదైన శైలిలో ఈ ఘటనపై నటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

వివాహనంతరం వరుడు వధువు వెళ్లిపోయే సమయంలో బైక్ అడిగినందుకు పెళ్ళికొడుకు మామ చెప్పులతో చెంపదెబ్బ కొట్టడం ఈ వీడియోలో కనిపించింది. వరకట్నం అనేది భారతదేశంలో నిషేధించబడినప్పటికీ అనేక ప్రాంతాలలో సర్వసాధారణం ఉంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

చెప్పు దెబ్బలతో వరుడిపై దాడి చేస్తుండగా అక్కడ ఉన్నవారు వరుడు మామను నిలువరించారు. పెళ్ళికొడుకు కూడా దాడి చేయవద్దంటూ తన మామను రెండు చేతులతో వేడుకున్న తీరు వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన జరిగిన వెంటనే వరుడు, వధువు వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతారు. క్షణాల్లో జరిగిన ఈ సంఘటన అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

సరైన గుణపాఠం చెప్పారంటూ హిందీలో ఓ క్యాప్షన్‌తో ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేశాడు. వీడియో ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన కాసేపటికే వైరల్ గా మారింది. సోషల్ మీడియా యూజర్ల నుంచి ఊహించని విధంగా కామెంట్లు వచ్చి చేరాయి. దీని కొందరు ఇది పెళ్లి కాదని కావాలని నటించారని కామెంట్ చేశారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి కట్నం కొంద బైక్ ఇవ్వడం ఓ లెక్కనా అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఇద్దరి మధ్య ఏదో సమస్య వచ్చి ఉంటుందని బైక్ పేరిట ఇలా వివాదం ముదిరి ఉండొచ్చని మరికొందరు తమదైన స్థాయిలో విమర్శలు గుప్పించారు. వరకట్న వేధింపులకు పాల్పడే వారికి ఇలాంటి సంఘటనలు ఓ చెంపపెట్టు అని మరికొందరు కామెంట్ చేశారు.

More from DriveSpark

Article Published On: Friday, May 12, 2023, 14:50 [IST]
English summary
Bride father slapped groom with slipper for asking a bike as dowry
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+