పెళ్లి మండపానికి ఇలా కూడా వస్తారా? ఇప్పుడు ఇదే ట్రెండింగ్‌!!

దేశంలోని ప్రజలు పెళ్లిని ఓ మహోన్నత వేడుకగా భావిస్తారు. అందులో భాగంగానే పెళ్లిళ్లకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. కొందరు యువతీ యువకులు తమ పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా భిన్నంగా వివాహ వేడుకను చేసుకుంటున్నారు. ఆ కోవాకు చెందినదే ఈ వార్త.

ఇటీవల ఫోటో షూట్‌ల సాంప్రదాయం పెరుగుతోంది. పెళ్లికి ముందే జంటలు తమకు నచ్చిన ప్రదేశాలను ఎంచుకుని మరీ ఫోటో షూట్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ వీడియోలను తమ వివాహ వేడుకల్లో బంధు గణానికి చూపిస్తూ తరించి పోతున్నారు. ఈ ట్రెండ్‌ దేశ వ్యాప్తంగా నడుస్తోంది. అయితే కొందరు తమదైన స్టైల్‌లో ఇంటర్‌నెట్‌లో అదరగొడుతున్నారు. గతంలో వివాహ వేదిక వద్దకు పెళ్లి కూతురు ఇచ్చిన ఎంట్రీ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Bride-Entry-With-Ampere-Scooter

తాజాగా బెంగుళూరులోని ఓ వివాహ వేడుకల్లో ఇ-స్కూటర్‌పై ఊరేగుతూ బరాత్‌ (ఊరేగింపు)లో డాన్స్‌ చేస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. తమ సాంప్రదాయానికి భిన్నంగా గుర్రానికి బదులు ఏథర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై (Ather Electric Scooter) ఊరేగుతూ డాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ విజువల్‌ ట్రెండింగ్‌లోకి రాగానే గతంలో ఓ పెళ్లిలో వధువు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మండపానికి వచ్చిన వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

బెంగళూరులోనే జరిగిన సంఘటన మాదిరిగానే గతంలో పెళ్లికూతురు ఆంపియర్ స్కూటర్‌పై మండపానికి వచ్చింది. అయితే దీనికి ఓ విశేషం ఉంది. ఆంపియర్ తన సంస్థ నుంచి కొత్తగా ప్రారంభించిన నెక్సస్ స్కూటర్ కొన్ని నెలల క్రితం దాని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైడ్‌(యాత్ర) చేపట్టింది. సంస్థ బ్రాండింగ్‌లో భాగంగా ఈ రైడ్‌ జరిగింది. దీంతో ఈ స్కూటర్‌ మళ్లీ వార్తల్లో నిలిచింది.

Bride-Entry-On-Scooter

ఈ స్కూటర్‌ గోవా చేరుకున్న సమయంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఓ జంటకు రైడింగ్‌లో ఉన్న ఆంపియర్‌ స్కూటర్‌ని అందించారు. వారి వివాహా వేదిక వద్దకు వధువు ఆ స్కూటర్‌పై వచ్చిన వీడియో ఆకట్టుకుంది. సాంప్రదాయానికి భిన్నంగా కారులో కాకుండా స్కూటర్‌పై రావడంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో అప్పట్లోనే వైరల్‌ అయ్యింది. దీంతో మరొక్క సారి తెరపైకి వచ్చింది.

పెళ్లి ఖర్చులు: ఇండియాలో 5-10 లక్షల వార్షికాదాయం ఉన్న 73% మంది తమ పెళ్లికి 7-10 లక్షలకు మించి ఖర్చు చేయడం లేదు. అయితే సగటు మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు దాదాపు 15-25 లక్షలుగా ఉన్నాయి. అంతే కాకుండా పెళ్లి చేసుకోబోయే జంటలు తమ వివాహాలకు స్వయంగా ఖర్చు చేసుకునే విధానం పెరుగుతోంది. 41.2% మంది వారి సేవింగ్స్‌ని ఉపయోగిస్తుండగా.. 26.1% మంది వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నట్లు తేలింది.

Bride-Entry

పెళ్లి చేసుకునే జంటల్లో మెజారిటీ 25 మరియు 28 సంవత్సరాల (34.1%) మధ్య మరియు 29 మరియు 35 సంవత్సరాల (30%)గా ఉంది. వివాహాలు చేసుకునే యువతీ యువతులు 32.5% మంది 3 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్నారని, 47.5% మంది 3 నుంచి 10 లక్షల మధ్య సంపాదిస్తున్నారని, 12% మంది 11 నుండి 20 లక్షల సంపాదిస్తున్నారని తెలిసింది. వీటితోనే వారు పెళ్లిళ్లు చేసుకుంటడం గమనార్హం.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


More from DriveSpark

Article Published On: Friday, May 17, 2024, 8:50 [IST]
English summary
Bride make a grand entrance on ampere nexus visuals gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+