బుల్లెట్ మీద మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన వధువు
కళ్యాణ సమయంలో వధువును వారి వారి సాంప్రదాయాలను బట్టి మండపానికి తీసుకువస్తారు. కొంత మంది వధువుని నడిపించుకుంటే తీసుకు వస్తే మరి కొంత మంది బుట్టెలో మోసుకుని వస్తారు. కాని ఇందుకు భిన్నంగా బుట్టెలో రావాల్సిన వధువు బుల్లెట్ వేసుకుని ఏకంగా కళ్యాణం జరిగే చోటుకి చేరుకుంది.
విచిత్రంగా జరిగిన ఈ సంఘటన వార్తల్లోకెక్కి దేశవ్యాప్తంగా మారు మ్రోగిపోతోంది. ఈ బుల్లెట్ రాణి గురించి నమ్మశక్యం కాని మరిన్ని విశయాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందా రండి.|

అహ్మదాబాద్ నగరంలో నివాసం ఉండే ఈమె పేరు ఆయేషా (26) డాక్టర్ గా పిలవబడే ఈమె తన పెళ్లికి తానే స్వయంగా బుల్లెట్ బైకును నడుపుకుంటూ పెళ్లి మండపంలోని కళ్యాణం జరిగే ప్రదేశానికి చేరుకుంది.

అస్సలు విషయం తెలుసుకుంటే మీరు ఆశ్యర్యపోవడం ఖాయం. వరుడు కానుకగా ఇవ్వడానికి ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకువచ్చినట్లు చెప్పింది ఈ వరూధిని.

ఎంతో అందంగా ఉన్న ఈమె కళ్లకు మంచి అద్దాలను పెట్టుకుని రాయల్ ఎన్ఫీల్డ్ 350 మీద అక్కడి వచ్చిన వధువును వరుడు పొగడ్తలతో ముంచెత్తాడు.

రాఖీ పండుగ పర్వదినాన తన సోదరుడి నుండి బహుమానంగా పొందిన ఈ 350 బుల్లెట్ బైకును తన కాబోయే భర్తకు కానుగా ఇచ్చినట్లు తెలిసింది.

ఆయేషా తన 13 వ ఏట బైకులను రైడ్ చేయడంలో దిట్ట అని పేరు పొందింది. అప్పటి నుండి ప్రతి బైకును కూడా ఎంతో చక్కగా రైడ్ చేసేది. అందుకోసం తన పరిణయం రోజు కాస్త వెరైటీగా ఉండాలని కోరుకుని ఇలా బుల్లెట్ మీద దూసుకొచ్చింది.

కెనడాలో పుట్టి పెరిగిన ఆయేషా భర్త ఆమె అలా బుల్లెట్ మీద ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా సంభ్రమాశ్ఛర్యాలకు గురయ్యాడు. తరువాత తనకు పూర్తిగా వెన్నంటు ఉండి మండపం చేరే వరకు ఎంతో చొరవ తీసుకున్నాడు.

ఆయేషా వృత్తి రీత్యా కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలిగా పని చేస్తోంది. ఆయేషా తండ్రికి ఇదివరకే ఒక బుల్లెట్ బైకు ఉండేది. ఆ బైకు మీదనే ఆయేషా ఎప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న ప్రసిద్ద ఓం బన్నా దేవస్థానానికి వెళుతూ ఉంటుంది.

ఈ పెళ్లి తరువాత ఆయేషా భర్త కెనడాకు వెళ్లిపోనున్నాడు. అందుకే ఉన్నన్ని రోజులు ఎంచక్కా ఈ బుల్లెట్ బైకు మీద తన సతీమణి ఎక్కించుకుని చాలా ప్రదేశాలు చుట్టేస్తానని తెలిపాడు.

- బజాజ్ వి బైకు విడుదల సమాచారం మరియు ఫోటోలు
- బాయ్‌ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్ చేసిన షరపోవా: ఇక్కడ క్లిక్ చేయండి
- భర్తకు భలే కానుక ఇచ్చిన శ్రీదేవి
- పింక్ కార్లను కలిగివున్న సెలబ్రిటీలు



Click it and Unblock the Notifications