నడిరోడ్డుపై పెళ్లి కూతురు ఫోటోషూట్‌.. మండిపడుతున్న నెటిజన్లు!! (వీడియో)

ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది సర్వసాధారణం అయిపోయింది. గత కొన్ని రోజుల క్రితం వరకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్‌ అనేవి కేవలం స్టూడియోలకు మాత్రమే పరిమితం అయ్యేవి. రాను రాను ఈ విధానం మారుతూ వస్తుంది. మరి కొందరు బీచ్‌లో, ప్రముఖ కట్టడాల వద్ద ఇంకా కొందరు వారి స్వస్థలాల్లోని ఫేమస్ ప్రాంతాల వద్ద ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చేయించుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది జనాలను కచ్చితంగా పాటిస్తున్నారు. ఎక్కువ శాతం యూత్ ప్రీ వెడ్డింగ్ షూట్ లేకుండా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికి గల కారణం ఫంక్షన్ హాల్ వద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన బంధువులు ఆ వీడియోలను చూపిస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. దీంతో ప్రతీ జంట ప్రీ-వెడ్డింగ్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా యువజంట రోడ్లపై స్టంట్స్‌ చేస్తూ ప్రీ వెడ్డింగ్ షూట్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఇతరులకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లికూతురు నడిరోడ్డుపై నిలబడి ఫోటోషూట్ చేయించుకుంటున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో మండిపడుతున్నారు. అసలు వారు రోడ్డపై షూట్‌ ఎందుకు చేశారు? తదితర విషయాలు ఈ కథనంలో..

Bride-Photoshoot-On-Busy-Roads

పెళ్లి చీర కట్టుకుని రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో నిలబడిన వధువు వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్‌ అవుతుంది. 'సేఫ్ కార్స్ ఇండియా' ఈ వీడియోను తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఓ చిన్న క్లిప్‌లో వధువు అండర్ బ్రిడ్జి ముందు నిలబడి ఉండటాన్ని మనం చూడవచ్చు. చాలా వాహనాలు హై-స్పీడ్‌తో వెళ్తుండగా ఆమె రోడ్డు మధ్యలో నిల్చుని ఫోటో షూట్‌ చేయించుకుంది.

ఓ ఫోటోగ్రాఫర్ కుడా మధ్యలో నిలబడి వధువు ఫొటోలు తీయడం కూడా మనం గమనించవచ్చు. ఫోజులు మార్చాలని ఫోటోగ్రాఫర్‌ వధువుకి డైరెక్షన్స్‌ ఇస్తున్న విధానాన్ని విజువల్స్‌లో చూడవచ్చు. ఇంతలోనే ఆమె పక్కనే ఒక వాహనాలు వెళ్తుండటం కనిపిస్తుంది. రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఫోటోషూట్ చేయడాన్ని చూస్తూ ఉండిపోయిన కొందరు ఆగ్రహాంతో చూడగా.. మరి కొందరు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Bride-Photoshoot-On-Busy-Roads

బిజీ రోడ్డు మధ్యలో ప్రీ వెడ్డింగ్ ఫొటోలు అవసరమా అని పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. సాధారణంగా ప్రీ వెడ్డింగ్ షూటింగుల్లో ఇలాంటివి జరగడం మనం చూడము. దీనికి సరైన సమాధానం లభించలేదు. ఆమె అందరికంటే ప్రత్యేకంగా ఉండేందుకు ఇలా భిన్నంగా ట్రై చేసి ఉండొచ్చని అంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రమాదం జరిగితే చాలా మంది గాయపడితే పరిస్థితి వేరేలా ఉండేదని మరికొందరు కామెంట్స్‌ చేశారు.

ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు. కొన్ని నెలల క్రితం మూడు హ్యుందాయ్ వెర్నా సెడాన్ కార్లను పూలతో పూర్తిగా డెకరేట్‌ చేశారు. ఆ తర్వాత హైవేపై వీటిని సమాంతరంగా నడుపుతున్న వీడియో అప్పట్లో వైరల్‌ అయ్యింది. ఈ కార్లలోంచి సన్‌రూఫ్‌లో నుంచి ఓ ఫొటోగ్రాఫర్, అతని సహాయకుడు నిలబడి ఉండటం గమనించవచ్చు. వధువు కూడా సన్‌రూఫ్‌ లోంచి బయటకు అభివాదం చేస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం గమనార్హం.

డ్రైవ్స్‌పార్క్‌ వ్యాఖ్య: అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఏలాంటి ప్రమాదం జరగలేదు. దీనిని చూసి ఇకపై ప్రతి ఒక్కరూ పాటించే అవకాశం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఇలాంటి పాటించవద్దని మేము సలహా ఇస్తున్నాము. ఇలాంటి చర్యలు క్షణాల్లో ప్రాణాంతకంగా మారవచ్చు. కాబట్టి దయచేసి రోడ్డు భద్రతా చట్టాలను గౌరవించండి. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని నిలదీయండి.

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2024, 15:29 [IST]
English summary
Bride pre wedding photoshoot on busy road video gone viral
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+