మెట్రోలో ప్రయాణించిన పెళ్లి కూతురు.. ‘స్మార్ట్‌ బెంగళూరు బ్రైడ్‌' అంటూ నెటిజన్ల కామెంట్స్‌.. అసలేం జరిగింది.??

గత కొంతకాలంగా బెంగళూరు ట్రాఫిక్‌ నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్‌ గురవుతోంది. ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఇంటికి వెళ్లేలోపు మీరు ఫోన్‌లో ఓ సినిమా చూసేయొచ్చు. లేదంటే మీరు కారులో కూర్చునే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. తాజాగా బెంగళూరు(Bride In Bengaluru Metro) ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ పెళ్లి కూతురు.. చేసిన పని వైరల్‌ అవుతోంది.

బెంగళూరు మహా నగరం ట్రాఫిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి. అక్కడ ట్రాఫిక్‌ చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. అందుకే బెంగళూరు(Bengaluru Traffic Viral Videos) వాసులు ఓ గంట ముందే ఇంటి నుంచి బయలుదేరుతారు. ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ పెళ్లి కూతురు చాలా స్మార్ట్‌గా ఆలోచించింది.

Bride-In-Bengaluru-Metro-Traffic-Jam

సాధారణంగా మన దేశంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయంటే చాలా హడావుడి ఉంటుంది. వధూవరులను అందంగా ముస్తాబు చేసిన కార్ల(Bengaluru Bride Metro)లో లేదా గుర్రపు బగ్గీలో కళ్యాణ మండపానికి తీసుకువస్తారు. ఇక్కడ ఓ యువతి కూడా తన పెళ్లికి భారతీయ సంప్రదాయంలో అలంకరించుకుని కళ్యాణ మండపానికి కారులో బయలుదేరింది.

అయితే బెంగళూరులో ట్రాఫిక్‌ గురించి తెలిసిందే కదా.. వధువు, ఆమె తరపు బంధువులు చాలా సంతోషంగా కారులో సంతోషంగా కళ్యాణ(Bride In Metro Viral Video) మండపానికి బయలుదేరారు. ఆకాసేపటికే తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ వారిని ఆహ్వానించింది. ఎంత సేపు వెయిట్‌ చేస్తున్నా వాహనాలు ముందుగా కదలట్లేదు. ఓ వైపు ముహూర్తానికి టైమ్‌ అవుతోంది. మరోవైపు ట్రాఫిక్‌ క్లియర్‌ కావడం లేదు.

Bride-In-Bengaluru-Metro-Traffic-Jam

దీంతో వధువు, ఆమె బంధువులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలా దేవుడా ఈ పరిస్థితి నుంచి బయటపడటం అనుకుంటుండగానే.. వధువుకు పై నుంచి మెట్రో రైలు వెళ్లడం కనిపించింది. గమనించిన యువతి.. బతికించావు దేవుడా అనుకుంటూ.. వెంటనే కారు దిగి పక్కనే ఉన్న మెట్రో స్టేషన్‌కు పరుగెత్తింది.

టికెట్‌ తీసుకుని మెట్రో రైలు ఎక్కింది. పట్టు చీర, నగలు, మేకప్‌తో అందంగా ముస్తాబైన వధువును మెట్రోలో చూసి ప్రయాణికులు షాక్‌ అయ్యారు. విషయం అడిగి తెలుసుకున్నారు. ఓ ప్రయాణికుడు వధువు మెట్రోలో ప్రయాణిస్తుండగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Bride-In-Bengaluru-Metro-Traffic-Jam

వీడియోలో వధువు తన వాళ్లతో కలిసి మెట్రోలో ప్రయాణించడం.. ఆ తర్వాత కళ్యాణ మండపానికి చేరుకోవడాన్ని చూడవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. స్మార్ట్‌ బెంగళూరు బ్రైడ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు ప్రయాణికులు ఆమెతో ఫొటోలు కూడా దిగారు. ఏదేమైనా ఈ యువతి ఐడియాకు హ్యాట్సాఫ్‌ అంటున్నారు నెటిజన్లు..

కాగా ఇటీవల బెంగళూరు ట్రాఫిక్‌లో చాలా సంఘటనలు తెగ వైరల్‌ అయ్యాయి. ట్రాఫిక్‌లో చిక్కకున్న ఓ మహిళా ఉద్యోగి.. కారులోనే కూర్చుని బఠానీలు ఒలిచారు. మరో సంఘటనలో బస్సు డ్రైవర్‌.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో సీట్‌లోనే కూర్చుని భోజనం చేశారు. మరో చోట ఓ ఐటీ ఉద్యోగిని ట్యాక్సీ బైక్‌పై వెనుక కూర్చుని ల్యాప్‌టాప్‌లో ఆఫీస్‌ వర్క్‌ చేసుకున్నారు.

బెంగళూరు పీక్‌ ట్రాఫిక్‌ అంటూ ఇలాంటి సంఘటనలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అయ్యాయి. అక్కడి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండటంతో.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా నగరవాసులకు ఈ కష్టాలు మాత్రం తప్పడం లేదు.

More from DriveSpark

Article Published On: Saturday, February 3, 2024, 12:20 [IST]
English summary
Bride traveling in metro due to heavy traffic jam in bengaluru viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+