లగ్జరీ కార్ల కాన్వాయ్‌లో వెళ్తూ రోడ్డుపై కరెన్సీ నోట్ల కట్టలతో వరుడు హల్‌చల్‌.. వీడియో వైరల్‌

పెళ్లి వేడుకల్లో సాధారణంగా వధూవరులను కార్లలో ఊరేగించడం చూస్తూ ఉంటాం. డీజే పాటలతో భారాత్‌ను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ఓ పెళ్లి వేడుకలో మాత్రం పాటలు, డ్యాన్సులకు బదులుగా కాసుల వర్షం కురిపించారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింత సంఘటనలు జరిగినా అవి మన దృష్టికి వస్తున్నాయి. వైరల్‌ అవ్వడం కోసం కొత్త కొత్త ప్రయోగాలకు పాల్పడుతున్నారు. అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఈ క్రమంలో ఇటీవల కొందరు యువకులు కార్లలో వెళ్తూ వింత చేష్టలకు పాల్పడిన సంఘటనలు తెగ చోటుచేసుకున్నాయి.

BrideGroom-Throwing-Money-From-Cars

కారు బానెట్‌పై కూర్చుని ప్రయాణించడం, కారు రూఫ్‌పై కూర్చుని స్టంట్స్‌ చేయడం, డోర్లు పట్టుకుని వేలాడుతూ వెళ్లడం.. ఇలా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వారికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా హాని కలిగిస్తున్నారు. ఇంకా రాత్రిళ్లు కారులో ప్రయాణిస్తూ బాంబులు కాల్చడం లాంటి చర్యలకు కూడా పాల్పడ్డారు. కాగా ఇవన్నీ ఒక ఎత్తయితే.. కారులో వెళ్తూ రోడ్డుపై నోట్లు కురిపించడం లాంటివి కూడా చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం కోసం చాలా మంది ఇలాంటి వింత చేష్టలకు పాల్పడుతూ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. కాగా ఇదే తరహాలో కొందరు యువకులు కూడా ఇటీవల ఇలా రోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరేసిన సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇలా చేసింది సాధారణ యువకులు కాదు. ఓ పెళ్లి కొడుకు. ఈ సంఘటన నోయిడా పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది.

BrideGroom-Throwing-Money-From-Cars

పెళ్లి మండపానికి వెళ్లే ముందు వరుడిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. అయితే ఇక్కడ ఈ వరుడు మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఆలోచించాడు. కళ్యాణ వేదిక వద్దకు చేరుకోవడానికి తనను అనుసరించే కార్ల కాన్వాయ్‌పై డబ్బు విసిరి తన స్టేటస్‌ను ప్రదర్శించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

వీడియోను పరిశీలించినట్లయితే.. కాన్వాయ్ ముందు భాగంలో ఉన్న కార్లలో ఒకదాని నుంచి కుప్పలు కుప్పలుగా కరెన్సీ నోట్లను ఎగురవేయడాన్ని చూడవచ్చు. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారులో వరుడు నిలబడి నోట్లను విసిరేస్తున్నాడు. దాంతో పాటు ఇతర కార్లపై కూడా డబ్బును విసిరేస్తూ.. రోడ్డుపై కూడా విసురుతున్నాడు.

BrideGroom-Throwing-Money-From-Cars

కాన్వాయ్‌లో రెండు తెల్ల జాగ్వార్ XF సెడాన్‌లు, ఒక ఆడి A4, రెండు మహీంద్రా స్కార్పియోలు, MG హెక్టర్, హ్యుందాయ్ వెర్నా ఇంకా అనేక ఇతర కార్లను వీడియోలో చూడవచ్చు. ఇవే కాకుండా పూలతో అలంకరించబడిన కార్లు కూడా ఉన్నాయి. కాగా వరుడి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కాన్వాయ్‌లోని వివిధ వాహనాల సన్‌రూఫ్‌ల నుండి డబ్బు విసురుతున్నారు.

అయితే ఈ కరెన్సీ నోట్లు నిజమా కాదా అనే దానిపై స్పష్టత లేదు. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. పబ్లిక్‌ రోడ్లపై ఇలా చేయడం ద్వారా ఇతర వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

BrideGroom-Throwing-Money-From-Cars

కాగా రోడ్లపై ఇలా డబ్బులు విసరడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఆగస్టులో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ వ్యక్తి ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మనీ హీస్ట్' కాస్ట్యూమ్‌ ధరించి కారుపైన నిలబడి రోడ్డుపై వెళ్తున్న వారిపై నగదు వర్షం కురిపించాడు. రూ. 10, రూ. 20 నోట్లను పబ్లిక్‌ రోడ్డుపై విసిరేయడం ప్రారంభించాడు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

More from DriveSpark

Article Published On: Friday, February 9, 2024, 12:10 [IST]
English summary
Bridegroom and his friends throwing money from their luxury cars convoys
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+