అల్లుడికి ఏ మామ ఇవ్వని గిఫ్ట్ ఇచ్చేసాడు.. మీరూ ఓ లుక్కేసుకోండి
సాధారణంగా ఎవరైనా తమ కుమార్తెకి వివాహం చేస్తే.. ఏదైనా బైక్, లేదా కారునే గిఫ్ట్ గా తమ అల్లుడికి ఇస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా చూసాము. అయితే ఇటీవల ఒక వ్యక్తి తమ కుమార్తె వివాహంలో అల్లుడికి ఒక బుల్‌డోజర్ గిఫ్ట్ గా ఇచ్చాడు.
నివేదికల ప్రకారం.. హమీర్‌పూర్ జిల్లా, సుమెర్‌పూర్ పరిధిలోని దేవ్‌గావ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పరశురామ్ ప్రజాపతి, తన కుమార్తె నేహాకు నేవీలో పనిచేస్తున్న యోగేంద్రతో వివాహం జరిపించడానికి పూనుకున్నాడు. అయితే వారి వివాహం ఈ నెల 15 న జరిగింది. పెళ్లి జరిగిన తరువాత వధువు తండ్రి కుమార్తెకు కట్నంగా బుల్డోజర్ ను అందించాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.

బుల్‌డోజర్‌ను గిఫ్ట్ గా ఇవ్వాలనే ఆలోచన చాలా కొత్తగా ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రాలేదనే చెప్పాలి. వధువు తండ్రి పరశురామ్ తన అల్లుడికి కారుని కట్నంగా ఇస్తే అది ఇంటి ముందు పడి ఉంటుంది. కానీ బుల్‌డోజర్ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అనే ఆలోచనతో ఈ గిఫ్ట్ అందించాడు. ప్రస్తుతం తన కుమార్తె సివిల్ సర్వీస్‌కు ప్రిపేర్ అవుతోందని, బుల్‌డోజర్ ఆదాయం వల్ల ఖర్చుల కోసం భర్తను డబ్బు అడగాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.
నిజానికి సమాజం రోజురోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. కావున మనుషుల ఆలోచనలో కూడా మార్పు వస్తోంది. గతంలో పెళ్లి కానుకలుగా ఆవులు, గొర్రెలు లేదా కోళ్లు వంటి వాటిని ఇచ్చేవారు. ఆ తరువాత సైకిల్స్ ఇచ్చేవారు. అయితే ఈ ఆధునిక కాలంలో డబ్బున్నవారు ఖరీదైన కార్లు లేదా బైకులు కానుకలుగా ఇస్తుంటే మధ్యతరగత వారు వారి స్థోమతకు తగ్గట్టుగా బైకులు లేదా కార్లు ఇస్తున్నారు.

అయితే ఈ మార్పులను చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇంకెలాంటి వస్తువులను బహుమతులుగా ఇస్తారో మనమే ఊహించుకోవచ్చు. అయితే ప్రస్తుతం బుల్‌డోజర్ కానుకగా ఇచ్చిన తండ్రి మాత్రం గొప్పగా ఆలోచించాడనే చెప్పాలి. ఎందుకంటే బుల్‌డోజర్ వల్ల ఎక్కువ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది తప్పకుండా వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. అయితే దీనిపైన పాఠకులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.. త్వరలోనే తెలుస్తుంది.
ప్రస్తుతం వరకట్నాలు వంటివి పూర్తిగా నిషేదంలో ఉన్నాయి. అయితే పిల్లనిచ్చే తండ్రి వారి బాగు కోసం అల్లుడి మీద నమ్మకంతో ఏదైనా ఇస్తే బహుశా అది తప్పు కాకపోవచ్చు. ఇలాంటి గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. తమ కూతురు అత్త గారి ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి మరియు అల్లుడు కూతురు బాగుండాలని వారి తల్లితండ్రులు ఖరీదైన కానుకలను అందిస్తూ ఉంటారు.
బుల్‌డోజర్ వంటి వాహనాలు రోజు వారీ ప్రయాణానానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ ప్రస్తుత కాలంలో వీటి అవసరం చాలానే ఉంది. ఏదైనా నిర్మాణాలు మొదలైన వాటిలో బుల్‌డోజర్‌ల పాత్ర చాలా వరకు ఉంటుంది. మనుషులు చేయలేని పనులను కూడా ఇవి అవలీలగా చేస్తాయి. కావున సమయం చాలా ఆదా అవుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పరశురామ్ ప్రజాపతి తన అల్లుడికి బుల్‌డోజర్ గిఫ్ట్ గా ఇచ్చాడని తెలుస్తోంది.
నిజానికి చాలా మంది తమ అల్లుళ్లకు కార్లు వంటివి కానుకలుగా ఇస్తూ ఉంటారు. అయితే పరశురామ్ ప్రజాపతి మాదిరిగా ఆలోచించి వారి ఉన్నతికి ఉపయోగపడే కానుకలు ఇస్తే వారికి చాలా ఉపయోగపడుతుంది. కావున ఇవ్వగలిగిన వారు తమ కుమార్తెకు మరియు అల్లుడికి ఉపయోగపడే వాహనాలను కానుకలుగా ఇస్తే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








