Bridgestone India ఇకపై మెకానిక్‌లు, డ్రైవర్లుగా మహిళలు.. వీరి టాలెంట్‌కు సలాం కొట్టాల్సిందే.!
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రంగంలోనూ మహిళలు అడుగుపెడుతున్నారు. కానీ ఆటోమొబైల్ రంగం అందుకు మినహాయింపు. అన్ని రంగాలతో పోలిస్తే ఆటో రంగంలో మహిళలకు ప్రాధాన్యత చాలా తక్కువ. కానీ మేము ఇందులోనూ తీసిపోము అంటూ ఆటోమోటివ్ రంగంలోనూ సత్తా చాటుతున్నారు మహిళామణులు. వారికి బ్రిడ్జిస్టోన్ ఇండియా మార్గం చూపింది.
మహిళా సాధికారత దిశగా.. మహారాష్ట్ర ఇండోర్‌లోని బ్రిడ్జ్‌స్టోన్(Bridgestone India) ఇండియా 200 మందికి పైగా మహిళలకు ప్రొఫెషనల్ డ్రైవర్‌లు మరియు మెకానిక్‌లుగా శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దింది. సమాన్ సొసైటీ సహకారంతో యాంత్రిక ప్రోగ్రామ్ కింద 60 మంది మహిళలు ద్విచక్ర వాహన మెకానిక్‌లుగా, 149 మంది డ్రైవర్లుగా శిక్షణ పొందారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.

జూన్ 2023 నుంచి వీరిలో పది మంది మహిళా మెకానిక్‌లు "మెకానిక్ ఆన్ వీల్స్" సేవలో భాగంగా ఉన్నారు. వినియోగదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ద్విచక్ర వాహనాలకు సర్వీసింగ్ మరియు అవసరానికి అనుగుణంగా అత్యవసర రోడ్‌సైడ్ మరమ్మతులు సైతం చేస్తున్నారు. ఇండోర్ నగర వాసులు ఈ సేవలను పొందవచ్చు.
కాగా మొదటి బ్యాచ్ ట్రైనీలు ఇప్పుడు మాస్టర్ ట్రైనర్లుగా మారారు. క్రమంగా ఇతర మహిళలకు సైతం శిక్షణ ఇస్తున్నారు. చాలా మంది మహిళా ట్రైనీలు ఇప్పటికే ద్విచక్రవాహనాల షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో ఉపాధి పొందుతున్నారు. కాగా మరికొందరు సొంతంగా గ్యారేజీలు కూడా ప్రారంభించారని బ్రిడ్జ్‌స్టోన్ పేర్కొంది.

బ్రిడ్జ్‌స్టోన్(Bridgestone India) వారు మూడున్నర నెలలపాటు శిక్షణలో భాగంగా డ్రైవింగ్ నైపుణ్యాలు, నివారణ నిర్వహణ మరియు అత్యవసర మరమ్మతులపై డ్రైవర్లరు శిక్షణ ఇస్తారు. ఇంగ్లీష్ మాట్లాడే స్కిల్స్, మ్యాప్ రీడింగ్, ప్రథమ చికిత్స, ఆత్మరక్షణలో సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కూడా ఇస్తారు. మహిళలకు సంబంధించిన చట్టాలు, మోటారు వాహన చట్టం, బీమా చట్టం గురించి ఇలా పలు అంశాలపై కూడా అవగాహన వారికి అవగాహన కల్పించారు.
బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో సాన్సిని మహిళలకు ఇస్తున్న డ్రైవింగ్ శిక్షణపై మాట్లాడారు. మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా మహిళా సాధికారిత దిశగా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. మహిళలకు డ్రైవింగ్, మెకానిక్ పనిపై శిక్షణ ఇవ్వడం మహిళా సాధికారత దిశగా అడుగులు వేయడానికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.

ఈ రంగంపై మహిళలకు ఆసక్తి ఉండటంతో వారికి సరైన శిక్షణ ఇచ్చి వారిలో ఉన్న ప్రతిభను మెరుగుపరిచేందుకు గొప్ప అవకాశమని స్టెఫానో పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా వారు ఆర్థిక స్వాతంత్య్రం పొందవచ్చన్నారు. కొత్త స్కిల్స్‌ను నేర్చుకోవడంలో గొప్ప అంకితభావం ప్రదర్శించినందుకు మహిళలను అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








