బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

బ్రిటీష్ వారు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం.. అయితే ఈ రోజు ఆ బ్రిటన్ దేశానికీ ప్రధానమంత్రిగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నియమించబడ్డాడు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. 'రిషి సునక్' (Rishi Sunak) భారతీయ సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానమంత్రిగా 2022 అక్టోబర్ 24 న బాధ్యతలు స్వీకరించారు.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

'రిషి సునక్' (Rishi Sunak) భారతదేశంలో ఎంతగానో ప్రసిద్ధిచెందిన ఇన్ఫోసిస్ కంపెనీ అధినేతలయిన 'ఎన్.ఆర్. నారాయణ మూర్తి' మరియు సుధా మూర్తి గారి అల్లుడు కూడా. అయితే ఇప్పుడు మనం ఈ కథనంలో కొత్త బ్రిటీష్ ప్రధానమంత్రి వద్ద ఉన్న కార్లు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

ల్యాండ్ రోవర్ డిస్కవరీ (Land Rover Discovery):

రిషి సునక్ గ్యారేజీలో ఉన్న కార్లలో 'ల్యాండ్ రోవర్ డిస్కవరీ' (Land Rover Discovery) ఒకటి. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV యొక్క వెనుక భాగంలో ఫిక్సిడ్ పనోరమిక్ గ్లాస్ రూఫ్ మరియు ముందు భాగంలో స్లైడింగ్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

ల్యాండ్ రోవర్ డిస్కవరీ 3.0 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 355 హెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 మైళ్ళ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 201 కిమీ వరకు ఉంటుంది. దీని ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 49,47,210 ($60,000). ఇది ఎక్కువమంది కొనుగోలు చేసే లగ్జరీ కార్లలో ఒకటి.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

జాగ్వార్ ఎక్స్‌జే (Jaguar XJ):

జాగ్వార్ (Jaguar) ఙకంపెనీ యొక్క అత్యధిక పనితీరుని అందించే కార్లలో ఎక్స్‌జే (XJ) ఒకటి. ఇది రిషి సునక్ గ్యారేజీలో ఉన్న మరొక కారు. దీని ధర $86,500. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 71,32,227. ఇది అత్యంత విలాసవంతమైన కారు. ఇది 3 లీటర్ వి6 టర్బోఛార్జ్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

జాగ్వార్ ఎక్స్‌జేలో ఉన్న 3 లీటర్ వి6 టర్బోఛార్జ్డ్ ఇంజిన్ 225 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 60 మైళ్ళ వేగాన్ని చేరుకుంటుంటుంది. ఇది భారతీయ మార్కెట్లో మొత్తం 5 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం మీద మంచి పనితీరుని అందిస్తుంది.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ ఎంకె6 జిటిఐ (Volkswagen Golf Mk6 GTI):

రిషి సునక్ గ్యారేజీలో ఉన్న మరో కారు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ యొక్క గోల్ఫ్ ఎంకె6 జిటిఐ. దీని ధర $29,000. ఇది భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 23,91,313. ఇది 2 లీటర్ ఇన్లైన్ 4 టర్బో ఇంజిన్ పొందుతుంది. ఇది 207 హెచ్‌పి పవర్ అందిస్తుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 149 కిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో 6.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 మైళ్ళ వరకు ఉంటుంది.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

ఇక 'రిషి సునక్' యొక్క రాజకీయ జీవితం విషయానికి వస్తే, యితడు చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్‌ పార్టీలో ఇంటర్న్షిప్ చేసి 2014 లోనే రాజకీయాల్లోకి వచ్చి 2015 నాటికి బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిచ్‌మాండ్‌ నుండి ఎంపీగా గెలిచాడు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా ఇతడు రెండోసారి ఎంపీగా గెలిచాడు. ఆ తరువాత 2019 నుంచి 2020 వరకు కూడా ట్రెజరీకి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

రిషి సునక్ ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి మాత్రమే కాదు, UK లో ఉన్న అత్యంత సంపన్నుల జాబితాలో కూడా ఒకరు. ఇతని భార్య సుధా నారాయణ మూర్తి ఒక్కగానొక్క కుమార్తె 'అక్షతా మూర్తి'. వీరికి ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బ్రిటీష్ కొత్త ప్రధానిగా మొదటి భారతీయ సంతతి వ్యక్తి 'రిషి సునక్' - అతని కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ సంతతికి చెందిన 'రిషి సునక్' బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం చాలా సంతోషించాల్సిన విషయం. అయితే ఈ దశకు చేరుకోవడానికి ఈయన ఎన్ని ఆటంకాలను ఎదుర్కొని ఉంటాడు, అనేది అందరికి కూడా ఆదర్శం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 26, 2022, 10:21 [IST]
English summary
Britain new prime minister rishi sunak car collection details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+