ISIS మరియు రష్యా ప్రధాని పుతిన్ గుండెల్లో గుబులు పుట్టించనున్న బ్రిటీష్
బ్రిటీష్ తాజాగా తమ దేశ నౌకాదళంలోకి హెచ్‌ఎమ్‌ఎస్ క్వీన్ ఎలిజబెత్ యుద్ద నౌకను ప్రవేశపెట్టారు. బ్రిటీష్ తమ నావికాధళ చరిత్రలో ఇదే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారీయర్ మరియు యుద్ద నౌక అని తెలిపింది. ప్రముఖ మిర్ర్.యుకె దీని గురించి ఈ యుద్ద నౌక ISIS మరియు రష్యాలను అణచివేయగల సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు తెలిపింది. మొత్తానిరి బ్రిటీష్ రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌కు కొంచెం భయం పుట్టించిందన్నమాట. దీనింతటకీ కారణం అయిన బ్రిటీష్ వారి హెచ్‌ఎమ్‌ఎస్ క్వీన్ ఎలిజబెత్ గురించి మరియు దీని శక్తి సామర్థ్యాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి...

65,0000 టన్నుల బరువున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారీర్ హెచ్‌ఎమ్‌ఎస్ క్వీన్ ఎలిజబెత్ నౌకను గురించి హెచ్‌ఎమ్‌ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యాప్టెన్ సైమన్ పెటిట్ మాట్లాడుతూ బ్రిటీష్ చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన యుద్ద నౌక అని తెలిపాడు.

ప్రస్తుతం యుద్దాలను సృష్టిస్తున్న వారు అంతటి ఆపితే వారికి ఎంతో మంచిది లేకపోతే మా ఈ యుద్ద నౌకతో రంగంలోకి దిగితే యుద్దాన్ని ఎందుకు మొదలు పెట్టామా అని ఆలోచించాల్సి వస్తుంది అని కెప్టెన్ సైమన్ తెలిపాడు.

మా ఈ యుద్ద నౌక గురించి తెలిసి కూడా యుద్దాన్ని ప్రారంభిస్తే, వారి అంచనాలకు మరియు ఊహలకన్నా ఇది రెండు పెద్దదిగా ఉంటుంది. అంటూ హెచ్‌ఎమ్‌ఎస్ వేల్స్ నౌక యొక్క కెప్టెన్ సైమన్ వ్యాఖ్యలు చేశారు.

932 అడుగులు పొడవున్న హెచ్‌ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌక రాయల్ నౌకా దళానికి చెందిన పురాతణ యుద్ద నౌకను కూడా ఇది మోయగలిగేంత సామర్థ్యాన్ని కలిగి ఉంది.

హెచ్ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌక సుమారుగా 36 ఎఫ్ -35 బి లైటింగ్ ఫైటర్ జెట్ ప్లేన్లను మరియు హెలికాఫ్టర్లను మోయగలదు.

ప్రస్తుతం దీనికి ట్రయల్ టన్ నిర్వహిస్తున్నారు. 2018 నాటికి దీనిని పూర్తిగా ఆయుధాలతో నింపి 2020 కల్లా యుద్దాలకు సన్నద్దం చేయనున్నారు.

హెచ్ఎమ్ఎస్ క్వీన్ ఎలిజబెత్ మోసుకెళ్లే ఎఫ్35బి లైటినింగ్ ఫైటర్ జెట్ విమానాలు గరిష్టంగా 1.6 మ్యాక్ వేగంతో వెళ్లగలవు.

హెచ్ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌక వేగం సుమారుగా గంటకు 10,000 నాటికల్ మైళ్లుగా ఉంది.

హెచ్ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌక లోని ప్రొపెల్లర్స్‌ను సుమారుగా 80 మెగావాట్ శక్తితో ప్రయోగిస్తుంది. అనగా అవి 50 బుల్లెట్ రైళ్ల శక్తికి సమానంగా ఉటుంది.

దీనిని విస్తీర్ణం పరంగా చూస్తే 70 మీటర్ల వెడల్పు మరియు 280 మీటర్లు పొడవుగా ఉంటుంది. అంటే మూడు ఫుట్ బాల్ స్టేడియంలకు సమానంగా ఉంటుంది.

హెచ్ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌకలో సుమారుగా 1,600 మంది వరకు ప్రయాణించవచ్చు. అది కేవలం ఇందులో పనిచేసే ఉద్యోగులు మాత్రమే.

దీని నిర్మాణానికి సుమారుగా 170 లక్షల విడిబాగాలను వినియోగించుకున్నారు. వీటిని అందివ్వడానికి సుమారుగా 700 లకు పైగా వ్యాపార సంస్థలు బాగా స్వామ్యమయ్యాయి.

ఇందులోని ఎఫ్35బి ఎయిర్ క్రాఫ్ట్‌లను షార్ట్ టేకాఫ్ మరియు వర్టికల్ ల్యాండిగ్ అయ్యేవిధంగా రూపొందించారు. ఈ హెచ్‌ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌక లో స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నౌక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 2,500 మంది ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది.

హెచ్ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌకకు పెయింట్ పూయడానికి సుమారుగా 2,50,000 లీటర్ల పెయింట్ కావాల్సి ఉంటుంది. దీనిని నౌక మొత్తాన్ని ఏడు పొరలుగా పూస్తారు.

హెచ్ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌకలో 2,50,000 కిలోమీటర్లు పొడవైన విద్యుత్ వైర్లు మరియు 8,000 కిలోమీటర్లు పొడవున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కలవు.

హెచ్ఎమ్ఎస్ ఎలిజబెత్ యుద్ద నౌక లో ఉన్న ఎఫ్35 బి పైటర్ జెట్‌లో ఉన్న రెక్కల పొడవు సుమారుగా 25 అడుగులు ఉంది. ఈ జెట్‌లో 30ఎమ్ఎమ్ గల గన్‌లు కలవు.

ఇందులోని phalanx Close-In అనే ఆయుధ పరిజ్ఞానం ద్వారా నిమిషానికి 3,000 రౌండ్ల బుల్లెట్ల కాల్పులు జరపవచ్చు.

ISIS తీవ్రవాదుల అంతానికి ఇవే సరైన విమానాలు అంటున్న అమెరికా
వీటితో మరింత బలమైన రష్యా రక్షణ రంగం

మిస్సైల్స్ కోసం రష్యాతో చేతులు కలిపిన భారత్
భారతీయ సైన్యంలో ఉన్న శక్తివంతమైన యుద్ద వాహనాలు


Click it and Unblock the Notifications








