పెళ్లి కోసం హెలికాప్టర్‌లా మారుతి వ్యాగన్‌ R.. కట్‌ చేస్తే పోలీసులు ఎంట్రీ.. ఏం చేశారంటే.!!

మన దేశంలో టాలెంట్‌కు కొదవ లేదు. సోషల్‌ మీడియా వినియోగం విస్తృతమయ్యాక ఎన్నో వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌ రంగంలో ఎన్నో మార్పులు చూశాం. ఈ క్రమంలో ఇద్దరు సోదరులు కలిసి కారును హెలికాప్టర్‌గా మార్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇప్పటివరకూ చాలా మంది పాత కారును కొత్త మోడల్‌ కారులా, బైక్‌కు ట్రాక్టర్‌ వీల్‌ అమర్చడం, కారును పడవలా మార్చి నీళ్లలో నడపడం లాంటివి చూశాం. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు మాత్రం తమ బుర్రకు పదును పెట్టి వినూత్న ప్రయోగం చేశారు. అయితే వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు.

Maruti-WagonR-Converted-Into-Helicopter

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు తమ మారుతీ సుజుకీ(Maruti Suzuki Wagon R Helicopter) వ్యాగన్ఆర్ కారును హెలికాప్టర్‌గా మార్చారు. కారుకు పైన ఫ్యాన్, వెనుక తోక మాదిరిగాను ఏర్పాటు చేసి.. భూమిపై నడిచే హెలికాప్టర్‌గా దీనిని తీర్చిదిద్దారు. ఇంకా హెలికాప్టర్‌ తయారీ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు.

ఈ క్రమంలోనే ఈ సోదరులు చేసిన ప్రయోగం పోలీసుల కంటపడింది. వెంటనే ఈ మారుతి వ్యాగన్‌ ఆర్‌ హెలికాప్టర్‌ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆ వాహనాన్ని సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఈ వ్యాగన్‌ ఆర్‌ హెలికాప్టర్‌ను పోలీసులు పరిశీలిస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయిపోయింది.

Maruti-WagonR-Converted-Into-Helicopter

వీడియోను పరిశీలించినట్లయితే.. తెల్లటి వ్యాగన్ఆర్ కారుపై ఆ ఇద్దరు అన్నదమ్ములు వెల్డింగ్ చేసి తయారు చేసిన రెక్కలు.. పెయింట్ లేకుండా ఉండటాన్ని గమనించవచ్చు. అంటే ఈ ప్రయోగం ఇంకా మధ్యలోనే ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో వాహనానికి రంగులు వేసిన ప్రదేశం తెలియడంతో.. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసినట్లు చెబుతున్నారు.

అయితే పోలీసులు యథావిధిగా గస్తీ డ్యూటీలో బిజీగా ఉండగా.. ఈ సోదరులు తమ వింత హెలికాప్టర్ కారును అటువైపు తీసుకెళ్లారు. ఇది గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని సీజ్‌ చేశారు. అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసిన హెలికాప్టర్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Maruti-WagonR-Converted-Into-Helicopter

సోషల్‌ మీడియా X సైట్‌లో ప్రచురించబడిన ఈ కొత్త రకం హెలికాప్టర్ వీడియో 70,000 కు పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. యువత ఆవిష్కరణలను గౌరవించాలని పేర్కొన్నారు. వారి టాలెంట్‌ను కొనియాడారు. ఇలాంటి వినూత్న ప్రతిభ ఉన్న యువకులను ప్రోత్సహించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

అంతేకాదు ఈ ప్రయోగం కోసం ఆ సోదరులు ఏకంగా 2.5 లక్షలు ఖర్చు చేశాడు. కాగా పెళ్లిళ్ల కోసమే తాను హెలికాప్టర్‌లా ఈ కారును మాడిఫై చేసి.. అద్దెకు ఇవ్వడం కోసమే ఇలా రూపొందించినట్లు తెలిపారు. అయితే ఈ హెలికాప్టర్‌ కారుకు పెయింటింగ్‌ వేసే క్రమంలోనే పోలీసులు ఈ వాహనాన్ని సీజ్‌ చేశారు. కాగా వారికి పోలీసులు రూ. 2000 ఫైన్‌ విధించారు.

కారు వెనుక భాగాన్ని తొలగించి, యథాతథ స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కానీ హెలికాప్టర్‌గా మార్చడానికి తాను ఖర్చు చేసిన డబ్బు వృథా అయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ పాటించకుంటే ఫైన్‌ వేయాలి కానీ ఇలా మాడిఫికేషన్లకు ఫైన్‌ వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మోటారు వాహన చట్టం ప్రకారం ఈ కారుకు చలాన్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 21, 2024, 9:40 [IST]
English summary
Brothers converted maruti wagonr into helicopter in uttar pradesh police seized the vehicle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+