ఆ దేశ సుల్తాన్‌ ఒక కార్ల పిచ్చోడు.. అతని వద్ద 7000 లగ్జరీ కార్లు.. అన్ని బండ్లు ఎందుకురా బుజ్జి!

దక్షిణాసియాలోని బ్రూనైలో (Brunei) పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. బ్రూనైతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దౌత్య సంబంధాలను పునరుద్ధరణపై చర్చలు జరపనున్నారు. బ్రూనై పర్యటన అనంతరం ఆ దేశ సుల్తాన్ హసనల్‌ బోల్కియా ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక పాలకుల్లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రాణి ఎలిజబెత్‌ 2 తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్‌గా పేరున్న ఇస్తానా నూరుల్ ఇమాన్‌లో బోల్కియా సుల్తాన్ మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు.

సంపదకు, విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌కి పేరుగాంచిన సుల్తాన్ హసనల్‌ బోల్కియా (Brunei Sultan Hassanal Bolkiah) మోదీని మీట్‌ అవుతుండటంతో ప్రపంచం అంతా వీరిపైనే ఫోకస్‌ చేస్తుంది. బ్రూనై సుల్తాన్‌ బోల్కియా ప్రపంచంలోనే అత్యంత సంపన్న పాలకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 1967లో అధికారం చేపట్టిన సుల్తాన్ హసనల్ బోల్కియా బ్రూనై పాలకుడిగానే కాకుండా దేశ ప్రధానిగా, రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా కూడా దేశానికి అవసరమైన సేవలందించారు.

Brunei Sultan Hassanal Bolkiah Luxury Cars

అంతే కాకుండా విదేశాంగ మంత్రిగా, సాయుధ దళాల కమాండర్‌గా, పోలీసు చీఫ్‌గా, పెట్రోలియం యూనిట్ అధిపతిగా, యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా, ఇస్లామిక్ మత వ్యవహారాల కమిటీ సుప్రీం హెడ్‌గా, బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెడ్‌గా పనిచేశారు. తన రాజ్యంపై సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉన్న అతికొద్ది రాజులలో హసనల్ బోల్కియా ఒకరుగా నిలిచారు.

బ్రూనై రాజకీయ, ఆర్థిక వ్యవహారాలలో గణనీయమైన వృద్ధిని సాధించడంలో సహాయపడింది. అయితే బ్రూనై సుల్తాన్ అపారమైన సంపదకు కారణం అతని విలాసాలే అని చెప్పవచ్చు. ఈ లైఫ్‌స్టైల్‌ హసనల్ బోల్కియాని 30 బిలియన్ డాలర్లకు అధిపతిని చేసింది. ఈ దేశం పరిమాణంలో చిన్నదైనప్పటికీ, బ్రూనైలో చమురు, గ్యాస్ నిల్వలు సుల్తాన్ సంపదకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.

Brunei Sultan Hassanal Bolkiah Luxury Cars

ఈయన 1980, 1990 దశకాల్లో బిల్ గేట్స్‌తో అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు. సుల్తాన్ ప్యాలెస్‌లో 450 ఫెరారీ కార్లు, 380 బెంట్లీ కార్లు, 600 రోల్స్ రాయిస్‌లతో సహా సుమారు 7,000 లగ్జరీ కార్లు ఈయన గ్యారేజీలో ఉన్నాయి. ప్రపంచంలోనే అధిక కార్లను కలిగి ఉన్న వ్యక్తిగా ఈయన రికార్డు తిరగరాశారు.

వీటితో పాటు పోర్షే, లంబోర్ఘిని, మేబాక్‌, జాగ్వార్, బీఎండబ్ల్యూ, మెక్ లారెన్ వంటి లగ్జరీ కార్లు కూడా ఈయన గ్యారేజీ ఉన్నాయి. హసనల్ బోల్కియా సేకరణలో అత్యంత ముఖ్యమైన వాహనాల్లో సుమారు 80 మిలియన్ల విలువైన బెంట్లీ డొమినార్ ఎస్‌యూవీలు, పోర్షే 911, హారిజన్ బ్లూ పెయింట్‌తో తయారైన X88 పవర్ ప్యాకేజీ, 24 క్యారెట్ల బంగారు పూత పూసిన రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్ 2 ఉన్నాయి.

Brunei Sultan Hassanal Bolkiah Luxury Cars

బంగారు పూత పూసిన రోల్స్ రాయిస్, ఇతర కార్ల విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ కారు కలెక్షన్‌ని సొంతం చేసుకున్న వ్యక్తిగా హసనల్ బోల్కీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇస్తానా నూరుల్ ఇమాన్ నివాసం ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్‌గా ఉంది. ఇందులో 1,700 గదులు, 257 స్నానపు గదులు, 5 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.

బ్రూనై స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని 1984లో నిర్మించిన ఈ ప్యాలెస్‌లో 110 గ్యారేజీలు, అతని గుర్రాల కోసం ఎయిర్ కండిషన్డ్ లాడ్జీలు కూడా ఉన్నాయి. ఫ్లయింగ్ ప్యాలెస్ అని పిలువబడే విలాసవంతమైన కస్టమైజ్డ్ బోయింగ్ 747 తో సహా.. అనేక ప్రైవేట్ జెట్స్ కూడా ఉన్నాయి. ఇతని కార్ల విలువ మన దగ్గర అక్షరాల రూ.3,000 కోట్లతో సమానం. ఇతను ఖరీదైన బోయింగ్ 747 విమానంలో హసనల్ బోల్కీ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తాడు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 4, 2024, 16:44 [IST]
English summary
Brunei sultan hassanal bolkiah who owns 7000 luxury cars full details in telugu
Read more on: #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+