బైకులపై దేశాన్ని చుట్టడానికి సిద్దమై BSF మహిళా సిబ్బంది.. వారి చివరి గమ్యం ఎక్కడంటే?
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కి చెందిన 'భవానీ స్క్వాడ్' ప్రత్యేక మోటార్‌సైకిల్ మహిళా స్క్వాడ్ దేశంలోని ప్రతి మూలకు వెళ్లి మహిళల్లో అవగాహన కల్పించి దేశభక్తిని పెంపొందించడానికి కంకణ కట్టుకుంది. ఈ ప్రత్యేక స్క్వాడ్ కి 'శశక్తికరణ్-2022' అని పేరు పెట్టారు. డీఐ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

దేశంలోని మహిళలలో దేశభక్తిని పెంపొందించడానికి 'భవానీ స్క్వాడ్' 2022 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ నుండి తమ ప్రయాణం ప్రారభించనుంది. ఇందులో 36 మంది మహిళా బైకర్లు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇందులో 8 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఉన్నాయి.

దీనికి సంబధించిన వీడియో మీరు గమయించినట్లైతే ఇందులో మహిళలు బైకులపైన అద్భుతమైన విన్యాసాలను చేస్తారు. ఈ విన్యాసాలను చూస్తే ఎవ్వరైనా ముగ్దులు కావాల్సిందే. మహిళలు ఇంత గొప్ప విన్యాసాలు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం.

2022 మార్చి 8 నుంచి ప్రారంభం కానున్న ఈ భవానీ స్క్వాడ్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల గుండా 5,280 కి.మీ వరకు ప్రయాణించనుంది. ఇందులో భాగంగానే వారు మహిళా సాధికారత సందేశాన్ని ఇస్తూ, ఈ మోటార్‌సైకిల్ స్క్వాడ్ కన్యాకుమారి వెళ్తుంది. ఇన్‌స్పెక్టర్ హిమాన్షు సిరోహి పర్యవేక్షణలో ఈ స్క్వాడ్ భారత్‌లో పర్యటించనుంది.

భవానీ స్క్వాడ్ యొక్క ఈ రైడ్ దేశంలో ప్రధాన నగరాలైన చండీగఢ్, అమృత్‌సర్, అత్తారి, బికనీర్, జైపూర్, ఉదయపూర్, గాంధీనగర్, బరూచ్, నాసిక్, పూణే, షోలాపూర్, హైదరాబాద్, అనంతపురం, బెంగళూరు, సేలం, మధురై మరియు కన్యాకుమారి వంటి నగరాల్లో తమ రైడ్ కొనసాగిస్తుంది.

భవానీ స్క్వాడ్ ఈ మహిళా మోటార్‌సైకిల్ రైడ్ ని 2022 మార్చి 28 న ముంగుస్తుంది. అంటే ఆ రోజున వారి చివరి గమ్యాన్ని చేరుకుంటుంది. వీరు ఈ ప్రయాణంలో రోజుకి 200 కిలోమీటర్ల నుంచి 29 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తారు. దీనికి ప్రణాళిక కూడా ఉంది. ఇందులో BSF దాని కేంద్రాలను ప్రధాన స్టాప్‌లుగా చేసుకుంటుంది.
భవానీ స్క్వాడ్ టీమ్ లో టీమ్ కెప్టెన్లు మరియు వివిధ సభ్యులు కూడా ఉన్నారు. భారతదేశం నలుమూలల నుండి మహిళలు మోటార్ సైకిల్ స్క్వాడ్‌లో చేర్చబడ్డారు. దేశంలోనే తొలిసారిగా మహిళా బైకర్ల ఈ తరహా కంట్రీ టూర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఎంతోమంది మహిళలలో ఉత్సాహాన్ని నింపుతుంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2016 లో బీఎస్‌ఎఫ్ సీమా భవాని మహిళా మోటార్‌సైకిల్ టీమ్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ జట్టు తన సత్తాను ఇప్పటికే చాలాసార్లు ప్రదర్శించింది. ఈ బృందం 2018 మరియు 2020 సంవత్సరాల రాజ్‌పథ్ రిపబ్లిక్ డే పరేడ్‌లో తమ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా బైకులపైన చుట్టి రావడానికి శ్రీకారం చుట్టింది. మొత్తానికి ఇది నిరాఘాటంగా పూర్తికావాలని మేము ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








