20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో గుర్రంగూడ గో-కార్టింగ్ ప్లే జోన్‌లో ఓ 20 ఏళ్ల యువతి గో-కార్టింగ్ సరదా ఆమె ప్రాణం పోయేలా చేసింది. ఈ సంఘటన గుర్రంగూడలో ఉన్న హస్టెన్ గో-కార్టింగ్‌లో చోటుచేసుకుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

నివేదికల ప్రకారం గాయపడిన మహిళను నగరంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బిటెక్ విద్యార్థి శ్రీవర్షిణిగా పోలీసులు గుర్తించారు.

20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

ఇన్‌‌స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవర్షిణి తన స్నేహితులతో కలిసి హస్టన్ గో-కార్టింగ్‌కు వెళ్ళింది. గో-కార్ట్ నడుపుతుండగా వాహనం బోల్తా పడింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందడంతో మీర్‌పేట పోలీసులు అక్కడకు వెళ్లగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న శ్రీ వర్షిణి తన ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు అక్కడకి వెళ్లి, ప్లే జోన్‌లో ఉన్న కారులో కాసేపు రౌండ్స్ వేద్దాం అనుకుంది. ఓ యువకుడు కార్ డ్రైవింగ్ చేస్తుండగా శ్రీ వర్షిణి పక్కనే కూర్చుంది. అయితే కారు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

టైర్‌కు శ్రీ వర్షిణి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తల బలంగా నేలకు తగిలిందని, ఆమె పెట్టుకున్నహెల్మెట్‌ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైందని ఫ్రెండ్స్ చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీ వర్షిణి మృతి చెందింది.

20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

అర్ధరాత్రి సమయంలో గో-కార్టింగ్ కు అనుమతి ఇవ్వడంపైన తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గో-కార్టింగ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు ఆరోపించారు. దీని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Note: Images are representative purpose only.

More from DriveSpark

Article Published On: Friday, October 9, 2020, 12:01 [IST]
English summary
20-yr-old Hyderabad B-Tech student dies during go-karting accident. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+