బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఇప్పుడు డాగ్ ప్రూఫ్

గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిలో ప్రాక్టీస్ రేస్ జరుగుతున్న సమయంలో కొన్ని వీధి కుక్కలు (స్ట్రీట్ డాగ్స్)రేస్ ట్రాక్‌పై ప్రవేశించి ప్రాక్టీస్ సెషన్‌కు అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అన్ని మీడియాలు ఈ విషయంపై ఫోకస్ చేయటం, హడావిడిగా చేసిన ఏర్పాట్ల పట్ల బిఐసి యాజమాన్యంపై విమర్శలు తలెత్తడంతో ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కార్యనిర్వాహకులు సాధ్యమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. కుక్కలు, జంతువులు రేస్ ట్రాక్‌పైకి ప్రవేశించడానికి వీలు లేకుండా మెష్‌లను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. బిఐసిలో అక్టోబర్ 27న జరగనున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి:
- జేకే ఏసియా రేసింగ్ సిరీస్ (క్వాలిఫైయింగ్): 09:15-09:45
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ (పిట్ లేన్ వాక్): 09:50-10:40
- ఎఫ్1 థర్డ్ ప్రాక్టీస్: 11:00-12:00
- ఎమ్ఆర్ఆఫ్ ఛాంపియన్‌షిప్ ఫస్ట్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 12:25-12:55
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ పిట్ లేన్ వాక్: 13:00-13:45
- ఎఫ్1 క్వాలిఫైయింగ్: 14:00
- జేకే ఏసియా రేసింగ్ సిరీస్ ఫస్ట్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 15:30-16:00


Click it and Unblock the Notifications








