Budget 2024 FAME సబ్సిడి కొనసాగింపు, పన్ను తగ్గింపు, మౌలిక సదుపాయాల కల్పన.. బడ్జెట్‌పై భారీ అంచనాలు..!!

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు సహా అనేక రంగాలు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ బడ్జెట్లో కీలక సంస్కరణలపై ప్రకటనలను (Budget 2024 automakers Expectations) ఆశిస్తోంది.

ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం FAME సబ్సిడీలను అందిస్తోంది. ఈ సబ్సిడీ కారణంగా ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

Budget 2024 FAME subsidy

టైర్‌-1 నగరాల్లో పెరుగుతున్న వినియోగం : ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి టైర్‌ -1 నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడం ద్వారా హైబ్రిడ్‌ మరియు ఎలక్ట్రిక్‌ వాహనాలకు FAME సబ్సిడీని కొనసాగించాలని భావిస్తున్నారు. దీంతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాలపై GST తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఆదాయపు పన్ను మినహాయింపులు : దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారుల ఆదాయపు పన్నులో కొంత మొత్తాన్ని తగ్గించే ప్రకటన వస్తుందని పలువురు ఆశిస్తున్నారు. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు సెక్షన్‌ 80EEB కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సమాచారం.

automakers expected Budget 2024 will support towards green mobility

ఫేమ్‌ సబ్సిడి పరిస్థితి ఏంటి : ప్రస్తుతం FAME కింద ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై సబ్సిడీ ఇస్తోంది. తొలిదశలో ఈ సబ్సిడీ నేరుగా వినియోగదారుడికి అందించారు. అనంతరం రెండో దశలో తయారీదారులకు అందిస్తున్నారు. గత సంవత్సరం మే తర్వాత ఈ ఫేమ్ సబ్సిడీలో గణనీయమైన స్థాయిలో కోత విధించారు. దీంతో అమ్మకాలు భారీగా తగ్గాయి. అనంతరం ఫెస్టివల్‌ సీజన్‌లో జోరందుకున్నాయి.

దీంతోపాటు భారత్‌లో తయారీ, ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాలు, బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు మేడ్‌ ఇన్‌ ఇండియా లో భాగంగా ఈవీ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చే ప్రకటనల వెలువడతాయని ఆటోమొబైల్‌ రంగంలో ఆశిస్తోంది. దీని కారణంగా భారత్‌లో ఈ రంగంలో పెట్టుబడులు పెరగడం సహా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.

EV makers expectations on Budget 2024

ఛార్జింగ్ స్టేషన్ల కొరత : అయితే ప్రస్తుతం ఈవీ రంగం ఛార్జింగ్‌ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాల కొరత వేదిస్తోంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు. ఈ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు.. దేశంలో ఈవీల కొనుగోలుపై గణనీయ స్థాయిలో ప్రభావం చూపిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 30, 2024, 10:12 [IST]
English summary
Budget 2024 automobile industry heavy expectations on union budget
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+