ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ధరలు తగ్గబోతున్నాయా? లిథియం ఖనిజంపై దిగుమతి సుంకం రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన

దేశంలో దిగుమతి చేసుకునే లిథియం ముడిసరుకుపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసేందుకు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దాదాపు 25 రకాల ఖనిజాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు. దీంతో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌లో వినియోగించే లిథియం బ్యాటరీల ధరలు తగ్గనున్నాయి. వీటిపై సుంకం తగ్గింపుతో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ ధరలు కొద్దిమేర దిగి వచ్చే అవకాశం ఉంది. కస్టమ్స్‌ సుకం తగ్గింపు అనేది ఎలక్ట్రిక్‌ బ్యాటరీ సప్లయర్స్‌కి కాస్త ఊరటే అని చెప్పాలి. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కొనుగోళ్లపై పూర్తి స్థాయిలో సబ్సిడీపై ఎటువంటి ప్రకటన చేయకపోయినా త్వరలో ఫేమ్‌3 సబ్సిడీని సైతం కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది.

న్యూక్లియర్, అంతరిక్షం, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ మరియు హైటెక్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు భూమిలో అరుదుగా లభించే లిథియం, కాపర్, కోబాల్ట్ మరియు ఇతర ఖనిజాలు కీలకమైనవిగా ఉన్నాయి. దాదాపు 25 ఖనిజాలపై సుంకాన్ని తగ్గింస్తున్నట్లు తన ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామణ్‌ ప్రకటించారు. ఈ బేసిక్‌ కస్టమ్స్ సుంకాన్ని (BCD) తగ్గించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

Customs-Duty-Removed-On-Lithium-Ion-Batteries

భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉంటాయని భావిస్తున్నారు. ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు తమ ఉత్పత్తుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. భవిష్యత్తులో ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలకే మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. తాజా నిర్ణయం కొంతమేరకు ఈ రంగానికి ఊరట ఇవ్వనుంది.

ఇప్పటి వరకు భారత్‌లో పెద్ద లిథియం అయాన్ మైనింగ్ ప్లాంట్లు లేవు. భారత్ విదేశాల నుంచి సరిపడా లిథియం అయాన్లను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. భారత్‌లోని కొన్ని ప్లాంట్లు విదేశాల నుంచి లిథియం వంటి ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని బ్యాటరీలను తయారు చేస్తున్నాయి. ఈ ప్లాంటులో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం తయారయ్యే బ్యాటరీలకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకునే సమయంలో పన్ను విధిస్తున్నారు.

Customs-Duty-On-Lithium-Ion-Batteries

ఇప్పటి వరకు భారత్‌లో లిథియం ఖనిజ దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 18 శాతం ఐజీఎస్‌టీ, 10 శాతం సర్‌ఛార్జీ విధిస్తున్నారు. దీంతోపాటు 1 శాతం ల్యాండింగ్ ఛార్జీ కూడా వసూలు చేస్తున్నారు. ఫలితంగా భారత్‌లో రూ.100 విలువైన లిథియంను దిగుమతి చేసుకుంటే రూ.49 సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేస్తామని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ఫలితంగా రూ.100 విలువైన లిథియం ఖనిజాన్ని భారత్‌లోకి దిగుమతి చేసుకుంటే రూ.30 పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ ఖర్చు తగ్గుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీ ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించే అవకాశం ఉండే అవకాశం తక్కువే అని చెప్పాలి.

చాలామంది ఊహించినంతగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం లేదు. లిథియం ధర మొత్తం ఎలక్ట్రిక్ వాహన ధరలో కొంత భాగం మాత్రమే. నిర్దిష్ట పన్నును మాత్రమే తొలగించినందున, తదనుగుణంగా మాత్రమే ధర తగ్గుతుంది. ఇది నేరుగా వాహన ధరల్లో తగ్గంపు లభించే అవకాశం తక్కువ. లిథియం అయాన్‌ని కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే కాకుండా సెల్ ఫోన్లు సహా వివిధ బ్యాటరీ ఉపయోగించే వస్తువుల తయారీకి కూడా ఉపయోగిస్తారు.

దాదాపు 25 ఖనిజాలపై సుంకం తగ్గింపు ఉండనుంది. అయితే ఇందులో ఆటోమోబైల్‌ రంగానికి కీలకమైన లిథియం అయాన్, కోబాల్ట్‌ ఉపయోగానికి ఉంటాయి. పన్ను మినహాయింపుతో ఈ రంగంలోని తయారీ దారులకు కాస్త ఊరటే అని చెప్పాలి. అయితే ఇది ధరలపై ప్రభావం చూపదు. సుంకం తగ్గింపుపై పలు తయారీ సంస్థలు కేంద్ర బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేశాయి. పూర్తి స్థాయిలో ఈ రంగాన్ని బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 24, 2024, 10:33 [IST]
English summary
Budget 2024 customs duty removed on lithium and cobalt import to boost battery production
Read more on: #off beat #budget #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+