బుగాటి ఎడిషన్ బెల్ట్ బకెల్; ధర రూ.52 లక్షలు
ఓ బెల్ట్ బకెల్ కోసం ఎవరైనా రూ.52 లక్షలు వెచ్చిస్తారా..? వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! మధ్యతరగతి వారికి ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ, సంపన్నులకు మాత్రం ఇది సాధ్యమే. సాధారణంగా, లగ్జరీ కార్ కంపెనీలు ప్రముఖ వాచ్ కంపెనీలతో జతకట్టి, లక్షల ఖరీదు చేసే వాచ్‌లను తయారు చేయటం మనం చూశాం.
కానీ తాజాగా, జెనీవాకు చెందిన ఓ బొటిక్ తయారీదారు బుగాటి బెల్ట్ బకెల్‌ను తయారు చేశాడు. మెకానికల్ బెల్ట్ బెకెల్స్‌ను తయారు చేయటంలో ప్రసిధ్ది చెందిన రొనాల్డ్ ఐటెన్ తయారు చేసిన ఈ బెల్టు పేరు 'కాలిబర్ ఆర్22 ఎమ్‌కె ఐ బుగాటి'. దీని ధర 84,000 డాలర్లు. మన దేశ కరెన్సీలో ఇది సుమారు రూ.52 లక్షలు.
మరి ఈ బెల్ట్ బకెల్ అంత ఖరీదు చేయటానికి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి..!

ఈ లగ్జరీ బెల్ట్ బకెల్ పూర్తిగా చేతుల్తో తయారు చేయబడినది. దీనిని లగ్జరీ మెకానికల్ వాచ్ మేకింగ్ టెక్నిక్స్‌ను ఉపయోగించి తయారు చేశారు. దీని ఫిట్ అండ్ ఫినిష్ చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.

ఈ బకెల్‌పై బుగాటి బ్రాండింగ్ ప్రధానంగా కనిపిస్తుంది. వజ్రం పొదిగిన పిన్, లైట్‌వెయిట్ టైటానియం, స్మోక్డ్ సఫైర్ క్రిస్టల్స్ మరియు కొన్ని రకాల విలువైన మెటీరియళ్లతో దీనిని తయారు చేశారు.

ఈ మెకానికల్ ఐటమ్‌లో 0 మి.మీ. నుంచి 22 మి.మీ. మధ్యలో ఫైన్ ట్యూనింగ్ కాలిబ్రేషన్ కలిగిన 100 కాంపోనెంట్లను ఉపయోగించారు. వాచ్‌లలో కూడా ఈ తరహా మైక్రో భాగాలను ఉపయోగిస్తుంటారు.

కాలిబర్ ఆర్22 ఎమ్‌కె ఐ బుగాటి ఎడిషన్ మెకానికల్ బెల్ట్ బకెల్ ఓ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే. కేవలం 44 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్నారు. ఇందులో మూడు వేరియంట్లు లభిస్తాయి. ఇందులో మొదటిది బంగారంతో తయారు చేయబడినది, రెండవది రోస్ గోల్డ్‌తో తయారు చేశారు. మూడవ ఎడిషన్‌ను ఇంకా విడుదల చేయలేదు.

ఒక స్పోర్ట్స్ కారు ధర కన్నా ఎక్కువ ధర ఉండే ఈ మెకానికల్ బెల్ట్ బకెల్ గురించిన పూర్తి సమాచారాన్ని తెలిపే వీడియోను తర్వాతి స్లైడ్‌లో వీక్షించండి.
కాలిబర్ ఆర్22 ఎమ్‌కె ఐ బుగాటి ఎడిషన్ మెకానికల్ బెల్ట్ బకెల్ వీడియో


Click it and Unblock the Notifications








