అద్దెకు బుగాటి వేరాన్; ఒక్క రోజుకు రూ.16 లక్షలు!

By Ravi

ఏదైనా సాధారణ కారును ఒక రోజుకు అద్దెకు తీసుకుంటే, మహా అయితే రూ.5,000 నుంచి రూ.50,000 వరకు బాడుగ (అద్దె) ఖర్చవుతుంది. కానీ ఎవరైనా రోజుకు రూ.16 లక్షల అద్దెను చెల్లించే కారును బాడుగ తీసుకుంటారా..? ఇది సామాన్యులకే కాదు, డబ్బున్నోళ్లకి గుండె పోటు తెప్పించే విషయమే.

ఇంతకీ రోజుకు రూ.16 లక్షల అద్దె వసూలు చేసే ఆ కార్ ఏంటనేదేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నా..! ఫ్రెంచ్ కార్ కంపెనీ బుగాటి రూపొందించిన మాస్టర్‌పీస్ 'వేరాన్'. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే రోడ్ లీగల్ సూపర్ కారుగా ఘనత దక్కించుకున్న 'బుగాటి వేరాన్'ను కోట్లు వెచ్చించి కొనుగోలు చేయలేని వారు, ఇలా లక్షలు పోసి ఒక రోజు మొత్తం ఆ కారులో ఎంజాయ్ చేయొచ్చు.


బుగాటి వేరాన్ సూపర్ కారు ధర 1.3 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన దేశ కరెన్సీలో ఇది సుమారు 8 కోట్ల రూపాయలకు పైమాటే. మరి ఈ కారును అద్దెకు తిప్పేవాళ్లు, కారుపై వెచ్చించిన తమ అసలును సంపాధించుకోవాలంటే, ఆ మాత్రం అద్దె వసూలు చేయక తప్పదు కదా. హోల్డర్ వెహికల్ కాంట్రాక్ట్స్ బుగాటి వేరాన్ సూపర్ కారును అద్దెకు ఇస్తోంది.

ఇలా అద్దెకు ఇచ్చినందుకు ఒక్క రోజుకు వారు ఛార్జ్ చేసే మొత్తం 25,300 డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.16 లక్షలు. అదే వీకెండ్ షూట్ కోసం అయితే, అద్దె 69,100 డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.43 లక్షలు). హోల్డర్స్ వెహికల్ కాంట్రాక్ట్స్ కేవలం బుగాటి వేరాన్ కారును మాత్రమే కాకుండా, రోల్స్ రాయిస్ ఫాంటమ్, లాంబోర్గినీ ముర్సిలాగో, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ వంటి ప్రముఖ కార్లను కూడా అద్దెకు ఇస్తుందట.

Bugatti Veyron 2

బుగాటి వేరాన్ సూపర్ కారు విషయానికి ల్తే, ఇందులో శక్తివంతమైన 8.0 లీటర్ డబ్ల్యూ 16 1001 హార్స్ పవర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 407 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, August 12, 2013, 10:03 [IST]
English summary
Holders Vehicle Contracts is offering a Bugatti Veyron on rent for those unable to buy this luxury sports car. They are renting Bugatti Veyron for a day at a price of £16,500 (nearly INR 16 lakhs).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+