పాత ఆడి ఏ6 కారును బుగాటి వేరాన్‌గా మార్చేశారు!
ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారు ఏదంటే, టక్కున గుర్తుకొచ్చేది బుగాటి వేరాన్ సూపర్‌కార్. అయితే, ఈ ఫొటోలో మీరు చూస్తున్న బుగాటి వేరాన్ మాత్రం ఆ కోవలోకి రాదు. ఎందుకంటే, అసలు ఇది బుగాటి వేరాన్ కారే కాదు కాబట్టి. అదేంటి ఇది అచ్చం బుగాటి వేరాన్ మాదిరిగానే కనిపిస్తుంది కదా అంటారా.. అయితే, మీరు బ్రేకుపై కాలేసినట్లే.
ఇది కూడా చదవండి: పాత మెర్సిడెస్ కారుతో రోల్స్ రాయిస్ రెప్లికా తయారు చేసిన మెకానిక్
ఇది బుగాటి వేరాన్‌లా కనిపించే ఆడి ఏ6 కారు. మనం ఇదివరకటి కథనంలో ఓ మెకానిక్ పాత మెర్సిడెస్ బెంజ్ కారును ఉపయోగించి రోల్స్ రాయిస్ కారును తయారు చేశడాని తెలుసుకున్నాం కదా.. అలానే మరో ఔత్సాహికుడు పాత ఆడి ఏ6 కారును ఉపయోగించి ఇదిగో ఇలా బుగాటి వేరాన్ రెప్లికా (డూప్లికేట్) కారును తయారు చేశాడు. అంతే, ఈ కారును ఆన్‌లైన్‌లో విక్రయానికి కూడా ఉంచారు.
ఈ డూప్లికేట్ బుగాటి వేరాన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

లిథువానియాలోని ఓ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ఈ బుగాటి వేరాన్ అలియాస్ ఆడి ఏ6 కారు దర్శనమిచ్చింది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

1997 మోడల్ ఆడి ఏ6 కారును ఉపయోగించి ఈ బుగాటి వేరాన్ రెప్లికాను తయారు చేశారు. ఈ డూప్లికేట్ వేరాన్ కారులో ఒరిజినల్ 8.0 లీటర్ డబ్ల్యూ16 ఇంజన్‌కు బదులుగా పాత ఆడి కారులోని 2.8 లీటర్ వి6 ఇంజన్‌నే ఉపయోగించారు.

ఈ 2.8 లీటర్ వి6 ఇంజన్ గరిష్టంగా 200 పిఎస్‌ల శక్తిని (బుగాటి వేరాన్‌లోని 8.0 లీటర్ డబ్ల్యూ16 ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తిలో 1/5వ వంతు మాత్రమే) ఉత్పత్తి చేస్తుంది.

ఈ 2.8 లీటర్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో పాత ఆడి కారులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అలానే ఉంటుంది. ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ అవుతుంది.

ఆన్‌లైన్‌లో ఈ కారును కేవలం 40,000 డాలర్లకే విక్రయిస్తున్నారు. 1997 ఆడి ఏ6 కారును బుగాటి వేరాన్‌లా మార్చేందుకు సర్వప్రయత్నాలు చేసినప్పటికీ, దగ్గర నుంచి చూస్తే, ఇది నకిలీ అని ఇట్టే తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications








