బైక్‌పై ఆకతాయిల స్టంట్స్‌.. బొక్క బోర్లా పడ్డ వెనుక వ్యక్తి.. వీడియో వైరల్‌..

దేశంలో రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ మనతో పాటు ఇతరులకూ సురక్షితం. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన మొదట్లో మనకు నవ్వు తెప్పించినా తర్వాత ఆలోచింపజేస్తుంది. పూర్తి సమచారం ఈ కథనంలో చదవండి.

దేశంలో రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అజాగ్రత్త వైఖరి వల్ల తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. ప్రజలు సరైన రహదారి ప్రవర్తనను నేర్చుకోవడం చాలా ముఖ్యం. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా ఓ వీడియో సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Bullet-Rider-Stunts

మనం రహదారిపై వెళ్తున్నప్పుడు కొందరు ఆకతాయిలు బండిని ర్యాష్‌గా డ్రైవ్‌ చేస్తూ విన్యాసాలు చేయడం చూస్తుంటాం. రద్దీగా ఉన్న రోడ్డుపై సైతం బైక్‌ను మలుపులు తిప్పుతూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. రయ్‌రయ్‌మని శబ్ధం చేస్తూ ఇతరుల దృష్టిని తమ వైపునకు తిప్పుకోవాలని చూస్తుంటారు. బుల్లెట్‌ రైడర్‌.. కవాసాకి బైక్‌ ముందు విన్యాసాలు చేస్తూ రోడ్డుపై చక్కర్లు కొట్టిన ఘటన చోటుచేసుకుంది.

అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం లేదు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ చేశారు. రోడ్డుపై కవాసాకి నింజా ZX10R బైక్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ పైకి వెళ్తున్నాయి. కవాసాకి బైక్ వెనుక ఉండగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ముందు వెళుతోంది. అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై ఇద్దరు యువకులు ఉన్నారు. మరో బైక్‌ ముందు విన్యాసాలు చేస్తూ రోడ్డుపై స్పీడ్‌గా వెళ్తూ బండిని మలుపులు తిప్పుతున్నాడు.

Bullet-Rider-Stunts

ఆ సమయంలో రోడ్డు సైతం రద్దీగా ఉంది. అయినా కార్ల మధ్య దూసుకెళ్తూ రైడ్‌ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఓ చోట ఆగుతుంది. అక్కడ ఓ వ్యక్తితో సంభాషణ అనంతరం ముందుకు కదులుతాడు. అయితే బుల్లెట్‌ వెనుక కూర్చున్న వ్యక్తి సపోర్ట్‌ కోసం దేనిని పట్టుకోలేదు. దీంతో ఆ విషయం గమనించని రైడర్‌.. అకస్మాత్తుగా బండిని స్టార్ట్‌ చేశాడు. దీంతో వెనుక కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోయాడు.

ఒక్కసారిగా ఈ దృశ్యం చూడగానే మనకు నవ్వు రావచ్చు. కానీ పడిపోయిన వ్యక్తి మాత్రం దానిని హాస్యాస్పదంగా తీసుకున్నట్లు లేదని వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అనుకోని హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ వీడియోలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించలేదు. ఇది చాలా ప్రమాదకరం.

అదృష్టవశాత్తు పిలియన్‌ కింద కూర్చున్నట్లుగా పడటంతో గాయాలు కాలేదు. ఒకవేళ వెల్లకిలా పడిపోయినట్లయితే తలకు తీవ్రగాయాలయ్యే అవకాశం ఉండేది. తాను నిటారుగా పడిపోవడంతో వెన్నుకు స్వల్ప గాయాలు అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఆ వ్యక్తి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని చెప్పవచ్చు.

పబ్లిక్‌ రోడ్డుపై బుల్లెట్ రైడర్ నిర్లక్ష్యపు విన్యాసాల కారణంగా రోడ్డుపై ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వెనుక నుంచి వచ్చే వాహనాలు ఆపడానికి తగినంత సమయం లేదా స్థలం ఉండదు. ఈ సంఘటన పబ్లిక్ రోడ్లపై బైక్‌ను ఎలా నడపకూడదో ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

అందుకే పబ్లిక్ రోడ్లపై ప్రతి ఒక్కరి భద్రతను గుర్తుంచుకుని డ్రైవింగ్‌ చేయాలి. విన్యాసాలు లేదా నిర్లక్ష్య డ్రైవింగ్‌ చేయడం శ్రేయస్కరం కాదు. విన్యాసాలు చేయాలనుకుంటే నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా రేస్ ట్రాక్‌ల వంటి క్లోజ్డ్ ఎన్విరాన్‌మెంట్‌లను ఉపయోగించుకోవాలి. ఈ రోజుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సోషల్ మీడియా వీడియోలను సాక్ష్యంగా తీసుకుంటున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, July 31, 2023, 12:36 [IST]
English summary
Bullet rider shows off in front of kawasaki superbike video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+