హైవే మీద కారుని డీ కొన్న ఎద్దుల బండి [వీడియో]

భారతదేశంలో చాలా నగరాలలో మరియు గ్రామాలలో కార్ట్ రేసింగ్ లు సర్వసాధారణం. ముంబై మరియు పూణే వంటి నగరాల్లో అక్రమంగా పరుగెత్తే గుర్రపు బండ్ల యొక్క దృశ్యాలను మనం తరచుగా చూస్తూనే ఉంటాము. ఇటువంటి అక్రమ రేసింగ్లు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. అవి ఎందుకు చట్ట విరుద్ధం, ఇటువంటివి ప్రజా రహదారుల మీద ఎందుకు జరపకూడదు అనే విషయాలను గురించి మనం క్రింద వీడియోలో చూడవచ్చు.

హైవే మీద కారుని డీ కొన్న ఎద్దుల బండి [వీడియో]

ఇండియాలో కొన్ని పండగలకి గుర్రపు పందాలు, ఎద్దుల పందాలు, కోడి పందాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పందాలు నగరాలకు, గ్రామాలకు దూరంగా నిర్వహిస్తారు. పండుగలలో ఉత్సాహాన్ని నెలకొల్పడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. ఇదే విధంగా హైవే మీద ఒక ఎద్దు కారుని ఢీకొనే దృశ్యం ఇప్పుడు చూద్దాం!

హైవే మీద కారుని డీ కొన్న ఎద్దుల బండి [వీడియో]

గుర్రపు బండి రేసింగ్ మాదిరిగానే బెల్గాంలో బుల్ కార్ట్ రేసింగ్ చాలా ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బుల్ కార్ట్ రేసింగ్ యొక్క పండుగలు చాలానే ఉన్నాయి. చాలా మంది ప్రజలు బహిరంగ రహదారులపై కూడా ఇటువంటి పందాలు బహిరంగంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో రోడ్లపై జరిగే అనియంత్రిత రేసింగ్ ప్రమాదాలను చూపిస్తుంది.

హైవే మీద కారుని డీ కొన్న ఎద్దుల బండి [వీడియో]

ఈ వీడియో ప్రకారం బెల్గాంలో ఒక వంతెన మీద ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ వీడియో వాహనం లోపలినుండి చిత్రీకరించడం జరిగింది. వీడియోలో ఎద్దుల బండి వ్యతిరేక దిశలో అధిక వేగంతో ప్రయాణించినట్లు మనకు తెలుస్తుంది. వంతెనపై మరొక బండిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్న ఎద్దుల బండి వంతెనపై తప్పు దిశలో అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు వీడియోలో చూపిస్తుంది. ఎద్దుల బండిని గుర్తించిన తరువాత ఎదురుగా వస్తున్న వాహనం ఆగిపోయింది.

హైవే మీద కారుని డీ కొన్న ఎద్దుల బండి [వీడియో]

ఏది ఏమైనా ఎద్దులను నియంత్రించే వ్యక్తి ఎద్దును సమయానికి నియంత్రించలేకపోయాడు. ఎద్దుని నియంత్రించలేకపోవడం వల్ల ఎద్దుల బండి ఎదురుగా ఉన్న వాహనాన్ని డీ కొట్టినట్లు మనకు వీడియోలో కనిపిస్తుంది. ఎద్దుల బండి డీ కొట్టడం వల్ల ఎద్దు కొమ్ము వాహనం యొక్క ముందు భాగంలోకి దిగబడటం మనం వీడియోలో చూడవచ్చు. ఎద్దు కొమ్ము వాహనం ముందుభాగంలో చొచ్చుకుపోవడం వల్ల విండ్‌షీల్డ్‌ పూర్తిగా పగిలింది.

హైవే మీద కారుని డీ కొన్న ఎద్దుల బండి [వీడియో]

ఎద్దుల బండిని నడిపే వ్యక్తి ఎద్దులను అదుపులో ఉంచడానికి చాలా కష్టపడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. జంతువులు చాలా అనూహ్యమైనవి, కాబట్టి వాటిని అదుపులో ఉంచడం చాలా కష్టం. ఎద్దులను నియంత్రించలేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది.

హైవే మీద కారుని డీ కొన్న ఎద్దుల బండి [వీడియో]

భారతదేశంలో ఇటువంటి కార్ట్ రేసింగ్లు జనసంచారం ఉన్న చోట, ప్రధాన రహదారుల మీద జరపడం చట్టవిరుద్ధం. ఇటువంటి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలుకూడా అనుభవించవలసి వస్తుంది. ఇటువంటివి చట్ట విరుద్ధమైన చర్యలు అయినప్పటికీ ఇవి ఎంవి చట్టాల పరిధిలోకి రావు, కాబట్టి ట్రాఫిక్ పోలీసులు వారికి జరిమానాలు విధించలేరు.

ఇవి ఎంవి చట్టం పరిధిలోకి రానప్పటికీ ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వీరిని శిక్షించే అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటి బండ్లకు ఎలాంటి రిఫ్లెక్టర్లు ఉండవు కాబట్టి వీటిని రోడ్లలో గుర్తించడం చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా హైవేలలో చీకటిలో ప్రయాణినిచేటప్పుడు ఇటువంటి వాటిని గుర్తించలేకపోవడం జరుగుతుంది. ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Crazy moment when a car meets ‘speeding’ bullock carts in the middle of a highway [Video]. Read in telugu.
Story first published: Friday, January 17, 2020, 17:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X