రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
గత ఏడాది డిసెంబర్ 30 న ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసింది. ప్రమాద సమయంలో హర్యానా రోడ్ వేస్ బస్ డ్రైవర్ మరియు కండక్టర్ రిషబ్ పంత్ కి సహాయం చేసి సమయానికి హాస్పిటల్ లో చేర్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
ప్రమాదంలో సతి మనిషికి సాయం చేసిన ఈ బస్ డ్రైవర్ మరియు కండక్టర్లను అప్పుడే హర్యానా రోడ్ వేస్ సత్కరించడం కూడా జరిగింది. అయితే నిన్న జరిగిన రిపబ్లిక్ డే సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అవార్డులతో (షీల్డ్) సత్కరించారు. దీనికి సంబంధించి ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సత్కారం మానవత్వానికి మంచి గుర్తింపు అనే చెప్పాలి.

చండీగఢ్ లో హర్యానా ప్రభుత్వం నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ మరియు కండక్టర్ పరంజీత్ కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు లభించింది. ఈ రిపబ్లిక్ డే వేడుకలలో పోలీస్ జవాన్ల మోటార్ సైకిల్ ప్రదర్శన తరువాత అవార్డులు అందించడం జరిగింది. నిజానికి ఆపదలో ఉన్న వారిని కాపాడిన వారికి ఇలాంటి గుర్తింపు అవసరం, భవిష్యత్తులో కూడా వారు ఇలాంటి మరిన్ని మంచి పనులు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.
2022 డిసెంబర్ 30 ఉదయం 5:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో హమ్మద్‌పూర్ సమీపంలోని రూర్కీలోని నర్సన్ సరిహద్దులో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు డివైడర్ ని డీ కొట్టింది. కారు డీ కొట్టిన కొన్ని నిముషాల్లోనే ఎక్కువగా మంటలు వ్యాపించాయి, అతి కష్టం మీద రిషబ్ పంత్ బయటపడ్డాడు, కానీ అతనికి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి.

అదే సమయంలో అటుగా వచ్చే బస్ డ్రైవర్ మరియు కండక్టర్ అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. రంజీత్ మొదట రిషబ్ పంత్ ను గుర్తించి అతడు ఇండియన్ క్రికెటర్ అని గుర్తించి సుశీల్ కుమార్ కి చెప్పాడు. అయితే మొత్తానికి వారు రిషబ్ పంత్ కి సహాయం చేశారు. హర్యానా ప్రభుత్వం వారిని ప్రశంసించడమే కాకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా వారిని మెచ్చుకుంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రిషబ్ పంత్ కి చాలా గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రమాద స్థలంలో కారు మంటల్లో కాలి బూడిదైపోయింది. భయంకరమైన ప్రమాదంలో కూడా వేగంగా ఎంతో నేర్పుతో రిషబ్ పంత్ కారు నుంచి బయటపడగలిగాడు.
भारतीय क्रिकेटर @RishabhPant17 जी की जान बचाकर हरियाणा रोडवेज़ के चालक सुशील कुमार जी व परिचालक परमजीत जी ने मानवता की मिसाल पेश की है।
— Manohar Lal (@mlkhattar) January 26, 2023
आज #गणतंत्र_दिवस के मौके पर दोनों को सम्मानित किया।
कड़क बोली व नरम दिल वाले हरियाणवी, जीवन के हर कार्य में अपनी छाप छोड़ रहे हैं। pic.twitter.com/CUfPTpUYyG
రిషబ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురి కావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు, ప్రమాదం జరిగింది ఉదయం కాబట్టి బహుశా పొగమంచు కారణమై ఉండవచ్చని ఊహించారు. అయితే దీనికి సంబంధించిన సరైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. పొగమంచు ఇతరత్రా కారణాల వల్ల దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కావున ఉదయం పూట వాహనాలలో ప్రయాణించేవారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది.
ప్రస్తుతం కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. గుంతలతో నిండిన రోడ్లు లేదా ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకుండా వాహనాలను డ్రైవ్ చేయడం వంటివి ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కావున వాహనాలను ఉపయోగించే వాహన వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








