Driver Lunch in Traffic Jam సమయం లేదు.. అందుకే ట్రాఫిక్‌లోనే ఇలా.. బస్సు డ్రైవర్‌ వీడియో వైరల్‌..

మెట్రో పాలిటన్‌ నగరాల్లో ట్రాఫిక్‌ సమస్య ఎలా ఉంటుందో మన అందరికీ అనుభవమే. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌ను అధిగమించి గమ్య స్థానానికి చేరుకునే సరికి గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు ట్రాఫిక్‌ జామ్‌లో ఓ సంఘటన అక్కడి ట్రాఫిక్‌ సమస్యకు అద్దం పడుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యపై సోషల్‌ మీడియాలో చాలా ట్రోల్స్‌ చూస్తుంటాం. బెంగళూరులో బస్సులో ప్రయాణించాలంటే 10 నుంచి 15 కి.మీల దూరానికి గంటల సమయం పడుతుంది. తాజాగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న బీఎంటీసీ డ్రైవర్‌ ఆకలికి తట్టుకోలేక.. తాను తెచ్చుకున్న లంచ్‌ బాక్సుని బస్సులోనే ముగించారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Driver Lunch in Traffic Jam

బెంగళూరు నగరంలోని సిల్క్‌ బోర్డు జంక్షన్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. సాయిచంద్‌ అనే వ్యక్తి ఆ సంఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ట్రాఫిక్‌లో బీఎంటీసీ బస్సు డ్రైవర్ భోజనం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. 'బెంగళూరు పీక్ ట్రాఫిక్ మూమెంట్' అనే క్యాప్షన్‌తో ఇటీవల అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది వీక్షించారు. రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు.

దీనిపై పలువురు స్పందిస్తూ బెంగళూరు ట్రాఫిక్‌లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను కామెంట్ల ద్వారా వివరించారు. మరికొందరు బస్సు డ్రైవర్ల కష్టాలపై సానుభూతి ప్రకటించారు. ఈ ట్రాఫిక్ వల్ల డ్రైవర్లకు సరిగ్గా భోజనం చేసే సమయం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగళూరు ట్రాఫిక్ గురించి ఆలోచిస్తే అది అతి పెద్ద సమస్య. ఐటీ పార్కుకు నిలయంగా ఉన్న ఆ మహానగరంలో అందులోనూ బస్సు డ్రైవర్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీంతో బస్సులో ప్రయాణించలేక పలువురు ద్విచక్రవాహనాలపై వెళుతున్నారు. ఈ కారణంగా అక్కడ ద్విచక్ర వాహనాల సంఖ్య భారీగా పెరిగింది.

తాజాగా బెంగళూరులో ట్రాఫిక్‌లోనే మరో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగిని ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆ మహిళా ఐటీ ప్రొఫెషనల్ ర్యాపిడో స్కూటర్‌పై ఆఫీస్‌కు వెళ్తూ ఆలస్యమవుతుండటంతో తన పర్సనల్ కంప్యూటర్‌లో పనిచేసుకుంటున్నారు. ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగళూరులోనే ఇటీవల ఓ రోజు ట్రాఫిక్‌లో ఆటో డ్రైవర్‌ కుక్కతో కనిపించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. శునకాన్ని తన ఒడిలో పెట్టుకుని ట్రాఫిక్‌ జామ్‌లో వేచి ఉన్న దృశ్యాన్ని కొందరు తమ చరవాణీలలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఆటో డ్రైవర్‌ ఆ కుక్కను ఎలాంటి ఆటపట్టించకుండా చంటి పిల్లను చూసుకున్నట్లుగా ఎంతో గారాబంగా చూసుకోవడం చూపరులను కదిలించింది. ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మనసుకు హత్తుకుంటుంది. ఎండ వేడిమి వల్ల అలిసిన ఆ శునకం ముఖాన్ని గుడ్డతో తుడిచి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఈ దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 31, 2023, 17:15 [IST]
English summary
Bus driver finished his lunch in bangalore traffic jam video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+