వీడియో: బస్ రూట్ తప్పించిన డ్రైవర్, భారీ యాక్సిడెంట్
ప్రతి బస్ డ్రైవర్ కూడా ఓ నిర్ధిష్టమైన రూట్‌ను ఎంచుకొని, ఎల్లప్పుడూ అదే రూట్‌లో ప్రయాణిస్తుంటారు. అయితే, కొందరు డ్రైవర్లు మాత్రం షార్ట్ కట్ కోసం రూట్ మళ్లించి డ్రైవ్ చేస్తుంటారు, ఇలా చేసే ప్రక్రియలో కొందరు అనుకోని ప్రమాదాలను చవిచూస్తుంటారు.
అలాంటి ఓ సంఘటనే రష్యాలో చోటు చేసుకుంది. రష్యాలోని ఓ బస్ డ్రైవర్ రెగ్యులర్ రూట్ కూకుండా వేరే రూట్ తీసుకోవటానికి ప్రయత్నించాడు. అయితే, రోడ్డు అక్కడికే ముగియటం, బస్సు వేగం అధికంగా ఉండటంతో అతను తన రూట్ వదలి బ్రిడ్జ్ క్రింద ఉన్న రూట్‌పై బస్సును దూకించాడు. అదే సమయంలో బస్సు బ్రేకులు కూడా ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎత్తు నుంచి క్రింద పడిన బస్సు ఓ పక్కకు ఒరిగిపోయింది.
మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి
ఇదంతా బ్రిడ్జ్ క్రింద నుంచి వస్చున్న మరో కారులోని డ్యాష్‌బోర్డ్ కెమెరాకు చిక్కింది. బస్సు ప్రమాదం జరిగే సమయంలో కేవలం కొన్ని అడుగులు దూరంలో పూర్తిగా ప్యాసింజర్లతో నిండిన మరో బస్సు కూడా ఉంది. అదృష్టవశాత్తు దారితప్పిన ఆ బస్సు బ్రిడ్జ్ క్రింద ఆగి ఉన్న బస్సుపై పడలేదు. అదే జరిగి ఉండే భారీ ప్రాణ నష్టమే జరిగి ఉండేది.
బస్సు ప్రమాదం జరిగిన తక్షణమే చుట్ట ప్రక్కల ఉన్న వారంతా హుటాహుటిన గాయపడిన వారికి సాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఇదిగో ఆ వీడియోని మీరు కూడా చూడండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/UUV9BwVg_zU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








