అడవి ఏనుగు ఆగ్రహానికి 8 కిమీ రివర్స్ గేర్‌లోనే వెళ్లిన బస్సు.. డ్రైవర్ సాహసానికి ప్రశంసలు వెల్లువ
ఇటీవల కాలంలో వాహనాల మీద ఏనుగుల దాడులు ఎక్కువవుతున్నాయి. గతంలో కర్ణాటకలోని కబిని రిజర్వ్ పారెస్ట్ లో ఒక అడవి ఏనుగు బొలెరో కారుని వెంబడిచిన సంఘటన గురించి చదువుకున్నాం, అయితే ఇప్పుడు కేరళలో ఒక ఏనుగు ఏకంగా 40 మంది ప్రయాణిస్తున్న బస్సుని వెనక్కు వెళ్లేలా చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒక ప్రయివేట్ బస్సు కేరళలోని చాలకుడి మరియు వల్పరై రోడ్డులో ఉదయం వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఒక భారీ ఏనుగు బస్సుకి అడ్డంగా నిలబడిపోయింది. అంతే కాకుండా ఈ పెద్ద ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ.. బస్సుమీదికి వచ్చేస్తోంది.

భారీ ఏనుగు వేగంగా బస్సు మీదికి వస్తున్న సంగతి గమనించిన ఆ బస్సు డ్రైవర్ ఎంతో నేర్పుగా, చాకచక్యంగా రివర్స్ గేరులో బస్సుని డ్రైవ్ చేస్తున్నాడు. అలా ఆ డ్రైవర్ మొత్తం 8 కిలోమీటర్లు రివర్స్ గేరులోని డ్రైవ్ చేసి బస్సులోని 40 మంది ప్రయాణికులందరినీ కాపాడాడు.

నిజానికి అడవి జంతువులు చూడటానికి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అంతకంటే క్రూరమైనవి. అందులోనూ ఏనుగులు వంటి పెద్ద జంతువులు చాలా సైలెంట్ గా ఉన్నప్పటికీ కోపం వస్తే భీభత్సం సృష్టిస్తాయి. అప్పుడు అనుకోని పెద్ద ప్రమాదాలే జరుగుతాయి. నిజానికి ఆ ప్రైవేట్ బస్సు ప్రయాణిస్తున్న అడవి మార్గం దట్టంగా ఉండటమే కాకుండా, మట్టి రోడ్డు కావడం మరో తెలుసుకోవాల్సిన విషయం.

అలాంటి మట్టి రోడ్డుమీద ఆ డ్రైవర్ ఏ మాత్రం గాబరా పడకుండా చాలా నేర్పుగా ఆ బస్సుని వెనక్కు డ్రైవ్ చేసి మొత్తానికి అందరి ప్రాణాలు కాపాడేసాడు. దీనితో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 8 కిలోమీటర్లు బస్సు వెనక్కి వచ్చిన తరువాత ఆ ఏనుగు మళ్ళీ అడవిలోకి వెళ్లిపోయింది. మొత్తానికి ఆ ఏనుగు భారీ నుంచి బస్సు డ్రైవర్ నేర్పుగా కాపాడారు. ఆ బస్సు డ్రైవర్ పేరు 'అంబుజాక్షన్' అని తెలిసింది. డ్రైవర్ చేసిన ఈ సాహసానికి చాలామంది అభినందిస్తున్నారు.

అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి, ఇటీవల కేరళకి చెందిన ఒక న్యూస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో ఒక అడవి ఏనుగు రోడ్డుపైకి వచ్చింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ ఏనుగును అదిలిస్తున్నాడు. ఆ వ్యక్తి ఫారెస్ట్ గార్డు అని తెలిసింది. ఆ ఏనుగు రోడ్డుపైకి వచ్చినప్పుడు ఆ ఫారెస్ట్ గార్డు ఒక స్కూటర్ పైన ఉంటూ ఏనుగుపైన అరుస్తున్నాడు. ఆ సమయంలో ఆ ఏనుగు ముందుకు వెనుకకు కదులుతుంది.

ఆ ఫారెస్ట్ గార్డు ఏనుగును అదిలించే సమయంలో ఒక వేళా ఆ ఏనుగు మీదికి వస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో ముందు ఉన్న ఒక వ్యక్తి మొబైల్ కెమెరాలో మొత్తం వీడియో తీస్తున్నాడు. మొత్తం మీద ఆ ఏనుగు చివరికి అడవిలోకి వెళ్ళిపోతుంది. మొత్తం మీద అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిజానికి అడవి జంతువులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అలాంటి జంతువులు చిన్న అలజడికి కూడా చెలరేగిపోతాయి. కావున అటవీ మార్గంలో ప్రయాణించేవారు చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. లేకుంటే పెద్ద ప్రమాదాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వేళా రాత్రి సమయంలో మీ వాహనాలకు ఏవైనా అడవి జంతువులు ఎదురుగా వస్తే వెహికల్ యొక్క లైట్స్ ఆఫ్ చేసుకుని నెమ్మదిగా వెనక్కు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో ఎలాంటి శబ్దాలు చేయకుండా ఉండటం మంచిది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
అడవి మార్గంలో ప్రయాణించేవారికి తప్పకుండా ఆ రోడ్డు గురించి, ఆ అడవి యొక్క పరిసరాలను గురించి కనీస జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే అడవిలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. కావున వాహనాలను డ్రైవ్ చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అడవి మార్గంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పకుండా తెలుసుకుని ఉండాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరిన్ని కథలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.
Note: Images are representative purpose only


Click it and Unblock the Notifications








