సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

వాహనాలను సాధారణ రోడ్లలో నడపడం కంటే కఠినమైన రోడ్లలో నడపటం కొంత కష్టం, ఇంకా పర్వత రహదారులలో నడపడం అత్యంత కఠినతరం, పర్వత రహదారులలో నడపడం కష్టం మాత్రమే కాదు ప్రమాదం కూడా.. ఒక బస్ డ్రైవర్ పర్వత రహదారిలో చేసిన అద్భుత విన్యాసానికి సంబంధించిన ఒక వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

పర్వతాలలో మరియు పర్వత ప్రాంతాలలోని ఇరుకైన మార్గాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక డ్రైవర్ చేసే తప్పు ఆ వాహనంలో ఉన్న అందరిని ప్రమాదానికి గురి చేయడమే కాకుండా వారి ప్రాణాలకు సైతం ముప్పును కలిగించే అవకాశం ఉంటుంది.

సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

పర్వతప్రాంతాలలో బస్సు నడిపే వారికి ఆ మార్గం గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఏ మలుపుల్లో ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని కూడా వారికి బాగా తెలుసు. కొన్నిసార్లు ఈ రోడ్లలో బస్సు డ్రైవర్ల చేసే డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రజలు ఎంతగానో ప్రశంసిస్తారు.

MOST READ:మళ్ళీ బయటపడిన లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ వీడియో.. మీరు చూసారా ?

సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియో హిమాచల్ ప్రదేశ్ లో జరిగినట్లు తెలుస్తుంది. హిమాచల్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ యొక్క టూరిస్ట్ బస్సు, డ్రైవర్ తన డ్రైవింగ్ నైపుణ్యాన్ని చూపిస్తూ, ధైర్యంగా ఒక లోయ చుట్టూ ఎంతో జాగ్రత్తగా బస్సును బయటకు తీశాడు.

సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

ఈ నాలుగు నిమిషాల వీడియో బస్సు డ్రైవర్ యొక్క డ్రైవింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం అనే చెప్పాలి. బస్సు కొండపై సన్నని మార్గంలో చిక్కుకుపోయిందని, మరొక మార్గం ఇంకా చిన్నగా ఉండటం మనం వీడియోలో చూడవచ్చు.

MOST READ:జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

బస్సును తిప్పడానికి డ్రైవర్ యు-టర్న్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతమంది ప్రయాణీకులు కూడా బస్సులో కూర్చున్నట్లు వీడియో కనిపిస్తుంది. అయితే, బస్సు తిరిగేటప్పుడు ప్రయాణికులందరూ బస్సు దిగటం కూడా ఇక్కడ గమనించవచ్చు.

సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

ప్రయాణీకులు దిగిన తరువాత బస్సు డ్రైవర్ నెమ్మదిగా బస్సును యు టర్న్ చేయడం ప్రారంభిస్తాడు. వీడియోలను రికార్డ్ చేసే వ్యక్తులకు ఇంత పెద్ద బస్సును ఇంత చిన్న మార్గంలో యు టర్న్ ఎలా తీసాడో వారికికీ అర్థం కాలేదు.

MOST READ:మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

ఏదేమైనా, బస్సు డ్రైవర్ బస్సును చాలా జాగ్రత్తగా వెనక్కి తిప్పి, అతని డ్రైవింగ్ సామర్త్యాన్ని రుజువు చేస్తాడు. ఆ బస్సు డ్రైవర్ ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యహహరించినా ఆ బస్సు కచ్చితంగా లోయలోకి పడే అవకాశం ఉంది. కానీ ఎంతో చాకచక్యంగా ఆ బస్సుని రోడ్డుపైకి తీసుకురాగలిగాడు.

బస్సు డ్రైవర్ బస్సుని రోడ్డుపైకి జాగ్రత్తగా తీసుకు వచ్చిన తరువాత, ప్రయాణికులు తిరిగి బస్సులో కూర్చుంటారు. బస్సు డ్రైవర్ చేసిన ఈ సాహసోపేతమైన చర్య చూసిన తరువాత, వీడియోలను రికార్డ్ చేస్తున్న వ్యక్తులు అతనిని చప్పట్లతో ప్రశంసించారు. ఏది ఏమైనా ఇది చాలా గొప్ప సాహసం అనే చెప్పాలి.

MOST READ:అప్పుడే హ్యాక్ చేయబడిన HSRP అధికారిక వెబ్‌సైట్ ; తర్వాత ఏం జరిగిందంటే

సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

మీరు ఇది వరకు కూడా ఇలాంటి సహస చర్యలు చేసిన వీడియోలు చూసి ఉంటారు. కానీ ఇది మీరు చూసిన అన్నింటికీ భిన్నంగా ఉందా లేదా అనే విషయై కామెంట్ ద్వారా తెలియజేయండి. వీలైతే ఎప్పుడైనా మీరు ఇలాంటి సహస కృత్యాలకు పాల్పడకుండా ఉండండి.

Most Read Articles

English summary
Bus Driver Shows Incredible Driving Skill Takes U-Turn On Narrow Mountain Road. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X