చేతిలో బుల్లెట్ గాయంతో 30 కి.మీ ప్రయాణం.. ప్రయాణికుల కోసం ప్రాణాలనే రిస్క్‌లో పెట్టిన బస్సు డ్రైవర్
సినిమాల్లో హీరోలు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతుంటే చప్పట్లు కొడుతాం. విలన్లతో వారి వీరోచిత పోరాటాలకు ఎవరైనా సరే విజిల్ వేయకుండా ఉండలేరు. ఇక బస్సు ఛేజింగ్‌లు, ట్రైన్ ఛేజింగ్‌ల లాంటి ఘటనలో వారి పర్ఫామెన్స్‌కు ఫిదా అయిపోతాం. ఇప్పుడు నిజజీవితంలో ఇదే తరహాలో పోరాటం చేసి 35 మంది ప్రయాణికులను కాపాడాడు ఓ బస్సు డ్రైవర్.
మహారాష్ట్రలోని అమరావతి-నాగ్‌పూర్ హైవేపై షెగావ్ సమీపంలో ఆదివారం ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. 35 మంది ప్రయాణిస్తున్న ఓ మినీబస్సును దోపిడీ దొంగలు వెంబడించారు. బస్సు డ్రైవర్ తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నా.. చాకచక్యంతో ప్రయాణికులను కాపాడారు. మినీ బస్సు షెగావ్ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తుండగా.. ఈ సంఘటన చోటుచేసుకుంది.

షెగావ్ నుంచి నాగ్‌పూర్‌కు మినీ బస్సు వెళ్తుండగా(Bus Driver With Bullet In Arm) మార్గమధ్యలో వారిని దోపిడీ దొంగలు వెంబడించారు. దీంతో వారిని తప్పించుకునేందుకు బస్సు డ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడే.. స్పీడ్‌గా పోనిచ్చాడు. ఈ క్రమంలో ఓ కారులో వెంబడిస్తున్న దోపిడీ దొంగలు.. బస్సును ఓవర్ టేక్ చేసి బుల్లెట్లతో దాడి చేశారు. దీంతో మరింత అప్రమత్తమైన బస్సు డ్రైవర్ కారును ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించాడు.
మొత్తం మీద ఆ దోపిడీ దొంగల ముఠా.. బస్సు అద్దాలపైకి నాలుగు రౌండ్ల బుల్లెట్లను పేల్చింది. ఈ క్రమంలో అదృష్టవశాత్తు బుల్లెట్ల నుంచి బస్సు డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఓ బుల్లెట్ మాత్రం డ్రైవర్ చేతికి తగిలింది. అయినప్పటికీ అతను నియంత్రణను కోల్పోలేదు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ బస్సును ధైర్యంగా స్పీడ్‌గా దూసుకుపోనిచ్చాడు.
చేతి నుంచి రక్తస్రావం అవుతున్నా.. మినీ బస్సును నియంత్రిస్తూ 30 కి.మీ ప్రయాణించి టియోసా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రయాణికులను రక్షించాడు. బస్సులోని ప్రయాణికుంలదరూ సురక్షితంగా ఉన్నారని పోలీసు అధికారి వెల్లడించారు. అనంతరం అమరావతి పోలీసులు బస్సును తిరిగి నందగావ్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను వెంటనే స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తరలించారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్ సమీపంలోని ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల నుంచి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా దొంగల ముఠా సభ్యులు యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వాహనాన్ని దొంగిలించినట్లు తెలుస్తోంది. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏ రాష్ట్రానికి సంబంధించి అయినా రవాణా శాఖలో పనిచేయాలంటే డ్రైవర్లకు ఏకాగ్రత, ధైర్యం, మానసిక ఆరోగ్యం సరిగా ఉండాలి. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే డ్రైవర్లు.. ప్రజారవాణా రంగంలో కీలక పాత్ర వహిస్తారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో దోపిడీ దొంగలబారి నుంచి ప్రయాణికులను కాపాడిన డ్రైవర్ సాహసానికి నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








