బస్‌స్టాండ్‌ని దొంగతనం చేసిన దుండగులు.. రూ. 10 లక్షలతో ప్రారంభించిన వారం రోజుల్లోనే చోరీ.!!

ఎక్కడైనా దొంగతనాలు అంటే ఇళ్లలో బంగారం, నగదు చోరీ.. లేదంటే కార్లు, బైకులు దొంగిలించడం చూస్తుంటాం. ఇంకా కొత్తగా మాల్స్‌లో, షాపుల్లో చోరీలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఓ వెరైటీ దొంగతనం జరిగింది.. ఇలాంటి సంఘటన మీరెక్కడా చూసి, వినీ ఉండరు. ఏకంగా కొత్తగా నిర్మించిన బస్టాప్‌(Bus Shelter Stolen)ను కొట్టేశారు దుండగులు.

ఇప్పటివరకూ వివిధ రకాల నేరాల ద్వారా వ్యక్తుల ప్రైవేట్‌ ఆస్తుల మీద కన్నేసిన నేరగాళ్లు.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఆస్తులకే ఎసరు పెట్టారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ చోరీ ఘటన తెగ వైరల్‌ అవుతోంది. రూ. 10 లక్షల ఖర్చుతో స్టీల్‌ స్ట్రక్చర్‌తో నిర్మించిన బస్‌ షెల్టర్‌ను వారం రోజుల్లోనే దోపిడీ చేశారు.

Bus-Shelter-Stolen

బెంగళూరు కన్నింగ్‌హామ్‌ రోడ్డులో బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) ఆధ్వర్యంలో ఆగస్టులో బస్ షెల్టర్ ప్రారంభించారు. అయితే బస్‌ షెల్టర్‌ అదృశ్యమైనట్లు దాని నిర్మాణానికి బాధ్యత వహిస్తున్న కంపెనీ అధికారి ఒకరు సెప్టెంబర్ 30న ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కానీ నెల రోజుల వరకూ బస్ షెల్టర్‌ మిస్‌ అయిన సంగతి తెలియలేదా అనే సందేహం మీకు రావచ్చు.

ఇక్కడ ఆశ్చర్యమేమంటే.. ఈ బస్టాప్‌ బెంగుళూరు సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయానికి సమీపంలో ఉంది. విధాన సౌధ నుంచి కిలోమీటర్‌ కంటే తక్కువ దూరంలోనే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గట్టి పోలీసు బందోబస్తు ఉండే ఏరియాలో ఇలా బస్‌ షెల్టర్‌ అదృశ్యమవడం.. అదృశ్యమైన నెల రోజుల తర్వాత వెలుగులోకి రావడం విచిత్రం.

పోలీస్‌ స్టేషన్‌లో అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలో BMTC ద్వారా బస్ షెల్టర్‌లను నిర్మించే బాధ్యత తమపై ఉందని.. ఈ నేపథ్యంలో ఆగస్టు 21 న కన్నింగ్‌హామ్ రోడ్‌లో కాఫీ డే దగ్గర బస్‌ షెల్టర్‌ నిర్మించినట్లు చెప్పారు. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించిన ఈ బస్టాప్‌ వ్యయం రూ. 10 లక్షలు అని వెల్లడించారు.

కాగా బస్‌ షెల్టర్‌ దొంగిలించిన నిందితుల కోసం హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే బెంగళూరులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా బస్టాప్‌లను చోరీ చేసిన ఉదాహరణలు ఉన్నాయి.

ఈ ఏడాది మార్చిలో HRBR లేఅవుట్‌లోని మూడు దశాబ్దాల నాటి బస్టాండ్ రాత్రికి రాత్రే అదృశ్యమైంది. కళ్యాణ్ నగరంలోని ఈ బస్టాండ్‌ను 1990లో లయన్స్ క్లబ్ విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అయితే కమర్షియల్‌ పర్పస్‌ కోసం దీన్ని BBMP రాత్రికి రాత్రే తొలగించింది.

బీఎంటీసీ అధికారులు స్వయంగా వచ్చి BBMP అధికారులను విచారించినప్పుడే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో దొంగలు త్వరగా పోలీసులకు చిక్కుతున్నారు. బస్టాప్‌లో నిర్ణీత బస్సు వచ్చే వరకు ప్రయాణికులు ఎదురుచూసేందుకు బస్టాప్‌లో వేచిచూడటం కోసం ఈ షెల్టర్లు నిర్మిస్తున్నారు. కానీ దొంగలు ఏకంగా వీటిని కూడా దొంగిలిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, October 6, 2023, 14:04 [IST]
English summary
Bus shelter in bengaluru worth rs 10 lakhs stolen recently
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+