లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తున్న కారణంగా చాలా ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ అమలు చేయబడింది. భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. కావున తమిళనాడులో ఇప్పుడు పూర్తి లాక్‌డౌన్ అమలు చేయబడింది.

ఈ సమయంలో అత్యవసర వాహనాలు మాత్రమే బయటకు రావడానికి అనుమతించబడుతుంది. ఈ సమయంలో అనవసరంగా బయటకు వచ్చే వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వాహనదారుల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారిని అరెస్ట్ చేసిన సంఘటనలు కూడా ఇది వరకే చాలా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా తమిళనాడులో కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ ఒక ప్రమాదం జరిగింది.

లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

నివేదికల ప్రకారం నిన్న రాత్రి 7 గంటల సమయంలో చెన్నైలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఒక వ్యాపారవేత్త నిన్న లగ్జరీ కారులో మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు కాబడిన వ్యాపారవేత్త పేరు హరీష్ మెస్వాని. అతను మద్యం తాగి మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌సి-43 ఎఎమ్‌జి డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది.

MOST READ: మోస్ట్ పవర్‌ఫుల్ ఈ-బైక్; రిస్ట్రెట్టో 303ఎఫ్ఎస్ ఫౌండర్, వివరాలు

లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బయటకు వచ్చిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ విధంగా వాహనాలను తనికీ చేస్తున్న సమయంలో హరీష్ మెస్వాని కూడా పట్టుబడ్డాడు. పట్టుబడిన సమయంలో అతడు అత్యధిక వేగంతో ప్రయాణించినట్లు తెలిసింది.

లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

అతన్ని పోలీసులు బారికేడ్లతో ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో మద్యం తాగి ఉండటం వల్ల అతడు కారుని కంట్రోల్ చేయలేకపోయాడు. అందువల్లనే అతడు నేరుగా బారీకేట్ ను ఢీ కొట్టి నట్లు తెలిసింది. అతని కారు బారీకేడ్ ని ఢీ కొని ఆగింది. తరువాత పోలీసులు అతన్ని బయటకు రమ్మని చెప్పారు.

MOST READ: ఎమర్జెన్సీ వాహనాల్లో రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్స్ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

కానీ ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతడు కారుని వెనుకకు తీసాడు, కానీ ఆ సమయంలో కూడా అతడు వెనుక ఉన్న బారీకేడ్లు ఢీ కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో మీరు ఇక్కడ గమనించవచ్చు. చివరకు విరిగిన కారు యొక్క విండ్‌స్క్రీన్ ద్వారా హరీష్ మెస్వాని ని బయటకు తీసినట్లు తెలిసింది.

హరీష్ మెస్వాని ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణం అతడు మందు తాగి డ్రైవ్ చేయడమే అని తెలిసింది. ఈ విషయాన్ని నిర్ధారించడానికి పోలీసులు హరీష్ మెస్వానిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

MOST READ: భారత్‌లో వాడుకలో ఉన్న అంబులెన్స్ రకాల గురించి మీకు తెలుసా?

లాక్‌డౌన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్[వీడియో]

మెడికల్ టెస్ట్ లో హరీష్ మెస్వాని మద్యం సేవించినట్లు నిర్ధారించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించిన కేసులు అతనిపై నమోదు చేయబడ్డాయి. మద్యం ప్రభావంతో డ్రైవింగ్ చేయడం తప్పు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో తాగి డ్రైవింగ్ చేయడమేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.

Image Courtesy: Sun News

Most Read Articles

English summary
Businessman Arrested For Drunk And Drive Accident. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X