పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

భూమిలో శిలాజ ఇంధనాలు అంతరించిపోతుండటం మరియు ఇలాంటి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించడం వలన జరిగే వాతావరణ మార్పులను నియంత్రించే లక్ష్యంలో భాగంగా అగ్రరాజ్యానికి చెంది ఓ రాష్ట్రం కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో కేవలం శిలాజ ఇంధనాలతో మాత్రమే నడిచే వాహనాలను నిషేధించేందుకు సిద్ధమైంది.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

వివరాల్లోకి వెలితే.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం 2035 నుండి కేవలం పెట్రోల్ ఇంధనంతో మాత్రమే నడిచే వాహనాలను నిషేధించాలని నిర్ణయించింది. వాతావరణ మార్పులను నియంత్రించడం మరియు కాలుష్య రహిత శుద్ధ ఇంధనాలతో నడిచే వాహనాల తయారీని ప్రోత్సహించడంలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా అమెరికా మరియు అందులో మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియాలు చరిత్ర సృష్టించనున్నాయి.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

ఈ మేరకు పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనాల తయారీని ప్రోత్సహించేలా కార్ల తయారీ కంపెనీలపై కాలిఫోర్నియా రాష్ట్రం ఒత్తిడి పెంచనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా పరిణించింది. ప్రత్యేకించి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎక్కువ వేడి వాతావరణం కారణంగా ప్రతి ఏటా కార్చిచ్చులు పుట్టుకొచ్చి, అనేక ప్రాంతాలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. వాతావరణ మార్పులను నియంత్రించేందుకు అనేద దేశాలు గత కొన్నేళ్లుగా వివిధ రంగాల్లో తమ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

ఆటోమొబైల్ పరిశ్రమలో శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల నుండి వెలువడే ఉద్గారాలు కూడా గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణంగా పరిణమిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం చాలా దేశాలలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను వినియోగించడం వలన ఆయా దేశాల్లో ఆటోమొబైల్‌ల నుంచి వెలువడే ఉద్గారాలు కొంత మేర తగ్గాయని నివేదికలు సూచిస్తున్నాయి. మన భారతదేశంలో కూడా 2020లో BS6 ఉద్గార నిబంధనలను అమలు చేయడం మీకు గుర్తుండే ఉంటుంది.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

ఉద్గార నిబంధనలను ఎంత కఠినతరం చేసినప్పటికీ పెరుగుతున్న జనాభ మరియు పెరుగుతున్న వాహన వినియోగం కారణంగా కాలుష్యం కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ వాహన కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడానికి ఏకైక మార్గం సున్నా ఉద్గారాలను విడుదల చేసే ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ వాహనాలను వినియోగించడమే. అయితే, ఇవి పూర్తిస్థాయిలో అందిరికీ అందుబాటులోకి రావడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది. మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు, ప్రోత్సాహకాలను ప్రకటించినప్పటికీ, మొత్తం వాహన వినియోగంలో ఈవీల వాటా దాదాపు 2 నుండి 3 శాతం మాత్రమే ఉంది.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

అయితే, కాలిఫోర్నియా మాత్రం ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉందని చెప్పాలి. ప్రజలు శిలాజ ఇంధనాలను వీడి, శుద్ధ ఇంధనాల వైపు మళ్లేందుకు 2020లో కాలిఫోర్నియా గవర్నరు గవిన్ న్యూసమ్ లక్ష్యాలు నిర్దేశించిన తరువాత తాజా నిబంధనలు రూపొందిస్తున్నారు. కాలిఫోర్నియా అమెరికాలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రం కావడంతో ఇక్కడ వాహనాల వినియోగం కూడా అధికంగానే ఉంది. కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డ్(సీఏఆర్‌బీ) జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం, 2026 నాటికి ఆ రాష్ట్రంలో విక్రయించబడే కొత్త వాహనాలలో దాదాపు 35 శాతం వాహనాలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు హైడ్రోజన్ వాహనాలు ఉండాలి.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

ఇలా క్రమంగా, కొత్త వాహనాలలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు హైడ్రోజన్ పవర్డ్ వాహనాల వాటాను పెంచేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. ఆ రాష్ట్రంలో 2035 నాటికి పూర్తిగా 100 శాతం కొత్త వాహనాలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ వాహనాలుగా మాత్రమే ఉండా, కేవలం పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో మాత్రమే నడిచే వాహనాలను పూర్తిగా నిషేధించాలని ఆ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కూడా సమర్థించింది. అయితే, ఇతర అగ్రగామి కార్ కంపెనీలు మాత్రం పూర్తిస్థాయిలో ఇలాంటి పర్యావరణ హితమైన వాహనాలను వినియోగించాలంటే, ప్రభుత్వం కూడా ఎంతో చేయాల్సి ఉంటుందని, ఇందుకు కాలిఫోర్నియా నిర్ధేశించిన దాని కంటే మరింత ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాయి.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పెట్రోల్ మరియు డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపివేయాలని యోచిస్తున్నప్పటికీ, ఈ విషయంపై ప్రస్తుతం ఏ దేశం కూడా పూర్తిగా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో, గ్యాసోలిన్ మరియు డీజిల్ కార్ల అమ్మకాలను పూర్తిగా నిషేధించే ప్రణాళికకు ఆమోదం పొందిన మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ విషయం గురించి కాలిఫోర్నియా స్టేట్ ఎయిర్ రిసోర్సెస్ బోర్డ్ ప్రెసిడెంట్ లియోన్ రాండోల్ఫ్ మాట్లాడుతూ, "కాలిఫోర్నియా మరియు తమ భాగస్వామ్య రాష్ట్రాలకు మరియు ప్రపంచానికి ఇది ఒక చారిత్రాత్మక సంఘటన" అని అన్నారు.

పెట్రోల్ / డీజిల్‌తో నడిచే కార్లను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం..! మరి ప్రత్యామ్నాయం ఏమిటి..?

అమెరికాలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తయారు చేసే టెస్లా మరియు రివియన్ వంటి కంపెనీలు ఇప్పటికే ఉండగా, ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ లైనప్ లో ప్యూర్ ఎలక్ట్రిక్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ లేదా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లను అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వ్యక్తులు ప్రధానంగా ఆలోచించేంది వాటి అధిక ధర మరియు బ్యాటరీ రేంజ్ గురించే. ఎలక్ట్రిక్ వాహనాల యొక్క పరిమిత రేంజ్‌ని చాలా మంది వినియోగదారులు ఒక లోపంగా చూస్తారు. అంటే వాహనంలో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడినప్పటికీ, దానికో తక్కువ దూరం మాత్రమే ప్రయాణించడం చాలా మందికి ఆమోదయోగ్యం కాదు. ఇందుకు పూర్తి పరిష్కారం లభిస్తే, తప్పకుండా ఈవీల వినియోగం పెరిగే అకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, August 28, 2022, 8:01 [IST]
English summary
California government to ban only petrol powered cars from 2035 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+