సోలార్ రేసింగ్ కారును సృష్టించిన రేసింగ్ విద్యార్థులు

By Ravi

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందివ విద్యార్థుల బృందం ఓ అద్భుతమైన కారును సృష్టించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈకో రేసింగ్ (క్యూయెర్)కు చెంది రేసింగ్ విద్యార్థుల బృందం రెజల్యూషన్ అనే ఈకోఫ్రెండ్లీ రేస్ కారును తయారు చేశారు.

రెజల్యూషన్ రేస్ కార్ సాధారణ రేస్ కార్ల మాదిరిగా లీటర్లకు లీటర్లు పెట్రోల్‌ను వృధ చేయదు. ఇది సహజసిద్ధంగా లభించే సూర్యరశ్మిని ఇంధనంగా చేసుకొని నడుస్తుంది. 2013 వరల్డ్ సోలారా ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు గాను ఈ రెజల్యూషన్ సోలార్ కారును తయారు చేశారు.

ఈ పోటీలో రెజల్యూషన్ సోలార్ కారు గెలిచినట్లయితే, ప్రపంచ టైటిల్‌ను దక్కించుకున్న మొదటి బ్రిటీష్ బృందం క్యూయెర్ ఘనతను తెచ్చుకునే అవకాశం ఉంది. రెజల్యూషన్ సోలార్ కార్ డిజైన్ చాలా విశిష్టంగా ఉంటుంది.

ఇతర సోలార్ కార్ల మాదిరిగా రెజల్యూషన్ సోలార్ కార్ ఉపరితలం (పైభాగం)పై సోలార్ ప్యానెళ్లు ఉండవు. రెజల్యూషన్‌లో సోలార్ ప్యానెళ్లు కారు లోపలివైపు అమర్చారు. ఆకాశంలో సూర్యూడి కదలికలను ట్రాక్ చేసేలా ఈ రెజల్యూషన్‌ను తయారు చేశారు. రెజల్యూషన్ సోలార్ రేస్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

డిజైన్

డిజైన్

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు అభివృద్ధి చేసిన ఈ సోలార్ కారులో సోలార్ ప్యానెళ్లను పారదర్శక బాడీకి లోపల అమర్చారు. దీని వలన విద్యార్థులు ఈ కారును టియర్‌డ్రాప్ (కన్నీటి బిందువు) ఆకారంలో ఉండేలా ఈ సోలార్ కారును డిజైన్ చేయగలిగారు. ఈ డిజైన్ ఫలితంగా డ్రాగ్ తగ్గి, ఎఫీషియన్సీ పెరుగుతుంది.

ట్రాకింగ్ ప్యానెల్స్

ట్రాకింగ్ ప్యానెల్స్

సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు గాను సోలార్ ప్యానెళ్లను ట్రాకింగ్ ప్లాట్‌పై అమర్చారు. ఈ ట్రాకింగ్ ప్లాట్ సూర్యుడి దిశను బట్టి మారుతూ, సోలార్ ప్యానెళ్లను కూడా ఆ వైపు మార్చుతుంది. ఫలితంగా ఎక్కువ సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నిర్ధిష్టంగా అమర్చబడిన రెగ్యులర్‌ సోలార్ ప్యానెళ్లతో పోల్చుకుంటే, ఈ ట్రాకింగ్ సోలార్ ప్యానెళ్ల ద్వారా గ్రహించే శక్తి 20 శాతం వరకు అధికంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు.

కొలతలు

కొలతలు

నాలుగు చక్రాలు కలిగిన ఈ రెజల్యూషన్ సోలార్ కారు 16.4 అడుగులు పొడవును, 2.6 అడుగులు వెడల్పును, 3.6 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. అయితే, ఈ సోలార్ కారులో క్యాబిన్ స్పేస్ మాత్రం కాస్తం ఇరుకుగానే ఉంటుందని చెప్పాలి. 5.3 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్న వ్యక్తి ఇందులో పట్టడం కష్టం.

టాప్ స్పీడ్

టాప్ స్పీడ్

రెజల్యూషన్ సోలార్ కారు చూడటానికి లైట్ వెయిట్ కారులా ఉంటుంది. దీని మొత్తం బరువు 120 కేజీలు మాత్రమే. అయినప్పటికీ ఇది గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

కాక్‌పిట్

కాక్‌పిట్

రెజల్యూషన్ కారు లోపల బయటి వాతావరణానికి సంబంధించి సమాచారం అందించే వ్యవస్థ, ఇంటెలిజెంట్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతిక వ్యవస్థలు ఉన్నాయి.

2013 వరల్డ్ సోలార్ ఛాలెంజ్

2013 వరల్డ్ సోలార్ ఛాలెంజ్

అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు జరగనున్న 2013 వరల్డ్ సోలార్ ఛాలెంజ్‌లో రెజల్యూషన్ సోలార్ కారు పాల్గొనబోతుంది. ఉత్తరాది ఆస్ట్రేలియాలోని డార్విన్ ప్రాంతం నుంచి దక్షిణాధి తీరంలోని అడెలైడ్ వరకు బృందాలు ప్రయాణించనున్నాయి.

రెజల్యూషన్ వీడియో

రెజల్యూషన్ తయారీని ఈ వీడియో క్లిప్పింగ్‌లో వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 6, 2013, 11:42 [IST]
English summary
Cambridge University Eco Racing (CUER), a Student racing team, has revealed the ‘Resolution', a prototype solar racer that will take part in the 2013 World Solar Challenge. If it wins, the CUER will become the first British team to get the world title.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+